ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ “శ్రీ ఎమ్” గ్రంథం నుంచి పార్ట్ 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

నా అధ్యాత్మిక ప్రయాణంలో సాయినాధుడు (పార్ట్ 2)

పాత గుడ్డముక్కలను మెలి తిప్పి పేనిస తాడుతో కప్పు నుంచి వేలాడుతూన్న సన్నని చెక్క పలక మీద షిర్డీ సాయిబాబా పడుకొని ఉన్నారు. షిర్డీ సాయిబాబా 1918.లోనే పరమపదించారని  అందరూ అంటారు! నేను ఆశ్చర్యంతోనూ భక్తీ పూర్వక భయంతోనూ ఆయనను తేరిపారజూస్తుంటే నా వెంట్రుకలు నిక్కబొడ్చుకున్నాయి. నా ఒళ్ళంతా కంపించింది. ఆ పలక మీద ఆయన(సాయి) కూర్చున్నారు. నేలకు ఆరడుగుల ఎత్తునున్న ఆ వింత పక్కమీంచి ఆయన ఎలాగ దిగి వస్తారబ్బా అని నేను విస్తుపోతూండగా, ఆయన నిమ్మళంగా పలక మీంచి జారి  ప్రయత్నమేమీ లేకుండానే తేలుతూ కిందికి నేలమీదకు దిగారు.  మామూలుగా ఆయన తలకు కఫ్నీ లా ఉండే గుడ్డ మాత్రం లేదని గమనించాను. ఆయన గుండు పూర్తిగా తీసినట్టుంది. మా పక్కన నిలుచొని ఉన్నప్పుడు ఆయన ఆరడుగుల పొడుగుతో ఒక వస్తాదులాగ ఉన్నారు.

ఆయన బాబాజీని కౌగిలించుకున్నారు. వాళ్ళిద్దరూ మృదువుగా ఒకరి నొకరు ముద్దు పెట్టుకున్నారు. నేను ఆయన పాదాల మీద సాష్టాంగపడ్డాను. ఆయన నన్ను లేవదీసి నిలబెట్టారు “సలాం (శాంతి) కుర్రాడా! నీకు ఒక గొప్ప గురువున్నారు. నాకూ ఒక గొప్ప గురువు ఉండేవారు, నా “వెంకూశా”.  నేను చేసినదంతా ఆయనను తేరిపార చూడడమే.  అల్లా మాలిక్‌ హై (భగవంతుడే యజమాని) రామ్ రామ్” అని అన్నారు.

“దయచేసి ఇతనిని ఆశీర్వదించండి బాబా” అని బాబాజీ అన్నారు.

“అల్లా మాలిక్‌ హై. నేను చేస్తూన్నలాంటి పనినే నువ్వు చెయ్యాలి, కానీ మరోవిధంగా. సులభం కాదు, అబ్బాయీ! ఈ లోకం పిచ్ఛిది, కానీ వాళ్ళు నేను పిచ్ఛివాణ్ణి అనుకున్నారు. “హు అల్లాహ్, రామ్, రామ్, రామ్, రామ్”  కబీర్ చేసిన పనిని చెయ్యి “గురువుగారి దీవెనలను తీసుకో” అని సాయి చెప్పి, తన చెక్కపలక పక్కమీద వేసి ఉన్న దుప్పటి కింద చేయిపెట్టి ఒక డబ్బు నోట్ల కట్టను తీశారు. “ఇదుగో, అల్లాహ్ భలా కరేగా (భగవంతుడు నీకు మంచి చేస్తాడు), ఈ డబ్బు తీసుకొని గాణగాపురం, పిఠాపురం, అక్కల్కోటా వెళ్ళు వెళ్ళు” అని అన్నారు.

నేనా డబ్బు తీసుకోడానికి తడపటాయించాను. బాబాజీ “తీసుకో” అని గుసగుసలాడారు. నేనా డబ్బు తీసుకొని తిరిగి ఆయన కాళ్ళమీద పడ్డాను.  బాబాజీ సాయినాథ్‌ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారుమేము లోపలికి ఎలాగ వచ్ఛామో అదేవిధంగా బయటకు వెళ్ళాం. “మళ్ళీసారి మూసిన తలుపుల్లోంచి వెళ్దామని చూడకు. నీ ముక్కు పచ్చడి కాగలదు” అని బాబాజీ ఎకసక్కెమాడుతూ అన్నారు. అవతల ఇంకా చీకటిగానే ఉంది. కానీ కొద్దిసేపబ్లోనే తెల్లారిపోతుంది ఇక. “డబ్బు జాగ్రత్తగా ఉంచుకో రేపు నీ ప్రయాణం ప్రారంభించు. నేనిప్పుడు వెళ్ళిపోవాలి. అవసరమైనప్పుడు నేను నిన్ను చూస్తాను” అని బాబాజీ అన్నారు. సాయినాథ్‌ చెప్పిన ఊళ్ళకు ఎలా వెళ్ళాలో సూచనలనిచ్చి ఆయన వెళ్ళిపోయారు.

తెల్లారిన తరువాత నేను గురుస్ధానాన్నీ సమాధినీ,  ధుని మండుతూన్న ద్వారకామాయీనీ తిరిగి మరోసారి చావడినీ చూశాను. చావడిలో నిలుచొని, అక్కడున్న సాయిబాబా పెద్ద చిత్రాన్ని చూస్తూ, రాత్రి నాకు కలిగిన అసాధారణ అనుభవానికి విస్తుపోయాను.

ఉదయం పలహారం తరవాత, కోపర్‌గావ్‌ రైల్వే ష్టేషనకు బస్సులో వెళ్ళి రైలుకోసం ఎదురు చూస్తూ నిలుచున్నాను. షిర్డీ నుంచి నేను గాణుగాపురం సర్సోవాడికీ ప్రయాణం చేశాను. దత్తాత్రేయుల అవతారంగా అందరూ విశ్వసించే మహాస్వామి “సరసింహ సరస్వతి” తన జీవితంలో  చాలాకాలం నర్సోవాడిలోనే గడిపారు.

అక్కణ్ణించి నేను స్వామీ సమర్ధ అని అరిదరూ పిలిచే అక్కల్కోట మహారాజ్ సమాధి ఉన్న అక్కల్కోటకు వెళ్ళాను. ఈయనను కూడా దత్తాత్రేయుని అవతారం అని విశ్వసిస్తారు. ఆయన షిర్డీ సాయిబాబాకు సమకాలీకుడు. స్వామీ సమర్ద 1878లో పరమపదించారు. అక్కల్‌కోటలో ఒక మర్రిచెట్టు కింద ఉరిడేవారు కనక అక్కల్‌కోట మహారాజ్‌ను “వటవృక్ష మహరాజ్ ” అని కూడా అంటారు. చాలా శక్తీమంతుడైవ దివ్యపురుషుడుగా ఈయనకు ప్రతిష్ఠ ఉంది. చాలా అద్భుతాలను చేసిన ఈయనను మహారాష్త్రలోనూ ఉత్తర కర్ణాటకలోనూ బాగాగౌరవిస్తారు. అక్కల్కోట మహరాజ్ పొడుగుపాటి దృఢకాయుడు. ఒక చిన్న గోచీ తప్ప మరేమీ ధరించేవారు కాదు. నేను అక్కల్కోటలో మూడు రోజుల పాటు ఒక సత్రంలో ఉన్నాను. మూడో రోజున నాకు నచ్చిన స్పష్టమైన స్వప్నంలో అక్కల్కోట మహరాజ్ ఎర్రగోచీ పెట్టుకొని కనిపించి “నేనూ షిర్డీలో ఉన్నవాడూ వేరుకాము” ఇప్పుడు నీవు పిఠాపురం వెళ్ళి శ్రీపాద వల్లభులకు నీ మనస్సునర్పించు అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ దగ్గరున్న పీఠాపురానికి నేను ప్రయాణం కట్టాను. అక్కడ శ్రీపాద వల్లభుల గుడిని దర్శించాను. ఆయనను కూడా దత్తాత్రేయల అవతారంగా చెబుతారు.

తరవాత కర్ణాటకాలో గుల్బర్గా జిల్లాలోని మాణిక్‌నగర్‌కు వెళ్ళి మాణిక్ ప్రభు సమాధిని దర్శిరిచాను. ఆయనను కూడా దత్తాత్రేయుల అవతారంగానే చెబుతారు.

ఈ అధ్యాయం ముగించే ముందుగా. సాయిబాబా, పవిత్రమైన అగ్నిని ధుని అనే పేరిట వెలిగించేవారు. ధునిని వెలిగించడమన్నది “నాథ సంప్రదాయానికి” అలవాటు. “నాథ సంప్రదాయానికి ఆదినాథుడు శ్రీ సాయినాథుడే”.  ఆయన 1918వ సంవత్సరం అక్టోబరు 15న పరమపదించారు. ఆయన పరమపదించడానికి ముందు. “తన శరీరం లేకపోయినా కూడా తాను షిర్డీలోనే ఉంటాననీ, శ్రద్ధా భక్తులతో అక్కడకు వచ్చేవాళ్ళతో తాను మాట్లాడతాననీ” చెప్పారు.

ఆ రాత్రి చావడీలో ఆ చిన్ననాటకం ఆయన ఆడకపోయి ఉంటే తీవ్ర సంశయాళువైన నా మనసు ఆ మాటను  నమ్మి ఉండేది కాదు. అతి తక్కువ విశ్వాసమూ ఎక్కువ సంశయమూ ఉన్న నామీద కూడా అత్యంత దయ చూపిన ఆయనకు నేను ఎల్లప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. వంగి నమస్కరిస్తాను పూర్తి వినయంతోనూ, ప్రేమతోనూ నేను ఆయనకూ, నన్ను షిర్డీకి తీసుకువెళ్ళిన నా ప్రియతముడైన బాబాజీకి మొక్కుతాను.

(“ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ “శ్రీ ఎమ్” గ్రంథం నుంచి”)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ “శ్రీ ఎమ్” గ్రంథం నుంచి పార్ట్ 2

kishore Babu

Thank you So much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles