ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ “శ్రీ ఎమ్” గ్రంథం నుంచి పార్ట్ 1–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

నా అధ్యాత్మిక ప్రయాణంలో సాయినాధుడు (పార్ట్ 1)

చెన్నైలో దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయానికి కలిసి ఉన్న ఎలియట్స్‌ బీచ్ అనే ఒక వ్యక్తిగత బీచ్లో నేను నిశ్శబ్దంగా సముద్ర కెరటాలను పరికిస్తూ ఉండగా ఒక సాయంత్రం పూట బాబాజీ పిలుపు వచ్చింది.

అక్కడెంత ప్రశాంతంగా ఉందంటే,  చెన్నై వేడి వేసవిలో కూడా నాకు నిద్ర పట్టింది బాబాజీ సుపరిచిత కంఠధ్వని నన్ను లేపింది – “ఆలంది దగ్గరున్న ఙ్ఞానేశ్వర సమాధికి వెళ్ళు,  మూడ్రోజుల్లో బయల్దేరు” అని.

మర్నాడు రామకృష్ణ మఠం గ్రంథాలయంలో ఆ ఊరు ఎక్కడుందో తెలుసుకొందామని అరగంటసేపు ప్రయత్నిస్తూ కూచున్నాను.

ఆ గొప్ప మహారాష్టీయ మహాత్ముడు జ్ఞానేశ్వర్‌ తాలూకు చిన్న జీవితచరిత్ర చదువుతూ, పూనే నుంచి ఆలంది పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే అని తెలుసుకున్నాను.

అంచేత రెండు రోజుల తరవాత పూనే వెళ్ళే రైలేక్కాను అక్కణ్ణించి బస్సేక్కి ఆలంది చేరుకున్నాను. అది నిజంగా చాలా ప్రశాంతమూ రమ్యమూ అయిన కుగ్రామం. జ్ఞానేశ్వర్‌ సమాధి గృహానికి నడిచి వెళ్ళాను.  

ఆ సమాధి చుట్టూ చాలామంది కూర్చొని ఉన్నారు. సంత్ ఙ్ఞానేశ్వర్‌ రాసిన ‘జ్ఞానేశ్వరి’ని కొంతమంది చదువుతున్నారు. అది భగవద్గీతకు గొప్ప అనువాదమూ, వ్యాఖ్యానమూను. మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. 

చాలామంది పెద్దవాళ్ళే. బహుశా మహారాష్టీయులు కావచ్చు. బాబాజీ మాత్రం కనుచూపు మేర దూరంలో లేరు. సమాధి నుంచి ఏమంత దూరం కాని ఒక రావిచెట్టు కింద చతికిలబడి గాఢమైన ఆలోచనలో కూరుకు పోయాను.

ఈ నిర్మాణాన్ని జ్ఞానేశ్వరుల జీవ సమాధి అని అంటారు. ఎందుకంటే ఆయనింకా సూక్ష్మరూపంలో ఉన్నారనే అందరూ నమ్ముతారు కనుక. జనం ఆయనను గొప్ప మహాత్ముడిగా విశ్వసిస్తారు. 

“ఆయన నాథశాఖకు చెందినవాడు” నాథ శాఖియులు ఆయనను వారి ప్రఖ్యాత యోగులలో ఒకరిగా చెప్పుకుంటారు.

ఆ సమాధి ముందు నేను కూర్చొని ఉండగా, నా వెన్ను బాము కిందనున్న కుండలినీ శక్తి విప్పుకొని బుసకొడుతూ పైకి లేచి మొదట హృదయ కేంద్రానికీ తరువాత శిరఃకేంద్రానికి అప్రయత్నం గానే చేరుకుంది. 

నేను ఆనందంలోనూ ప్రదీప్తమైన తెల్లని వెలుగులోనూ స్నానం చేస్తూ గంటలకొద్దీ బయట ప్రపంచం గురించిన ఎరుక లేకుండా కూర్చుని ఉండిపోయాను నేను తిరిగి ఈ లోకానికి వచ్చేసరికర్లా చాలా చీకటి పడింది.

ఏదోవిధంగా’ నేను ఒక చౌల్ట్రిలో వసతిని సంపాదించ గలిగాను. అక్కడ సాదా భోజనం కూడా సమకూర్చారు. నాలుగు రోజుల పాటు అక్కడ ధ్యానంలో నిమగ్నుణ్ణై ఆనందమయమైన సమయాన్ని గడిపాను.

బాబాజీ జాడ లేదు గానీ అక్కడ నాకు బాగానే ఉంది.

అయిదో రోజు తెల్లవారుజామున నాలుగింటికె ధ్యానం చేసుకోడానికి సమాధి దగ్గరకు వెళ్లాను.

అక్కడ ఒక ముసలాయస మాత్రమే ఉన్నారు. వాబ్రస్‌ మీసంతో ఉన్న ఆయన జ్ఞానేశ్వరీ చదువుతున్నారు.

నేను ఆయనకు కొంచెం దూరంగా కూర్చుందామని ఆనుకుంటూండగా, నా వైపుకు సాదాగా ఉన్న తెల్లని నడుము గుడ్డతోనూ పొడుగాటి జుట్టుతోనూ కౌమార దశలో ఉన్న ఒక చిన్న కుర్రాడు వస్తూండడం గమనించాను. 

అతను నవ్వి నన్ను కౌగిలించుకున్నాడు. నా శరీరమూ మనస్సూ అనందామృతంతో నిండిపోయాయి. బహుశా అతను జ్ఞానేశ్వర్ కావచ్చు నన్న ఆలోచన నాకు వచ్చింది. 

అతను నాతో మృదువుగా హిందీలో. “నా అన్న సాయినాథుడు వారి‌ ఆస్ధానం షిర్డీలో నీకోసం వేచి ఉన్నారు ఈ రోజునే అక్కడికి వెళ్ళు” అని అన్నాడు.

అతను అప్పుడు సమాధి దగ్గరకు నడిచి అక్కడున్న మర్రిచెట్టు వెనక్కివెళ్ళాడు. నేను ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాను కానీ అతనెక్కడా కనిపించలేదు.

అప్పుడు నాకర్ధమయింది అదొక దర్శనమని, ఎంచేతనంటే ఙ్ఞానేశ్వరీ చదువుకుంటూ కూర్చున్న ఆ ముసలాయన ఏదో అసాధారణాన్ని చూపిన వైనాన్నేమీ కనబరచలేదు. ఆయన చదువూతూనే ఉన్నాడు.

పూనే నుంచి షిర్డీ వెళ్ళడానికి బస్సునొక దాన్నేక్కి రాత్రి బాగా పొద్దుపోయిన తరవాత చేరుకున్నాను. సమాధి సంస్థాన సముదాయం ముఖద్వారం దగ్గర బాబాజీ నిలుచొని ఉన్నారు “రా,రా! అయితే,నువ్వు ఆ యువయోగిని కలుసుకున్నావన్నమాట. 

ఇక్కడ ఇప్పుడు అన్నీ మూసి ఉన్నాయి, కానీ, ‘మనం సాయినాథుడు శయనం చేసిన “చావడీ”కి వెళ్దాం”  అని అన్నారు.

మేము సమాధినీ గురుస్ధానాన్నీ ధుని మండుతూ ఉండే ద్వారకామయీనీ దాటి ‘చావడీ’ అనే చిన్న కట్టడం దగ్గరకు చేరుకున్నాం. కొన్ని ఊరకుక్కులు తప్పించి అక్కడ మరింకెవ్వరూ లేరు.

చావడీకున్న కట్టె కవాటం మూసి ఉంది. ఇప్పుడు మేమేం చేస్తామబ్బా అని అబ్బురపడుతున్నాను

బాబాజీ  “నడు లోపలికి వెడదాం” అని అన్నారు.

“తలుపుకు తాళం ఉందిగా” అన్నాను నేను.

“నాకు తెలుసు. ఇప్పుడు నీ కళ్ళు మూసుకొని తలుపులోంచి వెళ్తూన్నట్టుగానే నటించు” అని అన్నారాయన.

“కానీ బాబాజీ…”

“చెయ్యి అంతే, కళ్ళు మాత్రం తెరవకు”

కళ్ళు మూసుకొని నేను నా కుడి కాలును ముందుకు  పెట్టి నా మోకాలిని వంచాను. ఏదో ఒక గుడ్డ తెరను తోస్తూన్నట్టనిపించింది. మిగతా నా శరీరమంతా తలుపుకు తగిలినప్పుడు కూడా అదే భావన కలిగింది  నాకు, ఒక క్షణంలో ఆ భావన మాయమయింది.

“సరే నీ కళ్ళు తెరు” అన్న బాబాజీ మాటలు వినిపించాయి.

నేను కళ్ళు తెరిచేసరికి చావడీ లోపల ఉన్నాం మేము. ఆ తలుపుకు ఇంకా తాళం వేసే ఉంది. బాబాజీ నా పక్కన నిలుచొని ఉన్నారు.

తాళం వేసి మూసి ఉన్న తలుపులోంచి ఏదోవిధంగా నడవడమనే ఆశ్చర్యం నుంచి ఇంకా బయట పడకముందే అంతకన్నా అద్భుతమూ, నమ్మశక్యం కానిదీ అయిన మరో విషయాన్ని చూసి నేను అవాక్కయ్యాను.

రేపు తరువాయి భాగం…..

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ “శ్రీ ఎమ్” గ్రంథం నుంచి పార్ట్ 1–Audio

kishore Babu

Thank you So much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles