Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా బిక్ష చేసి తెచ్చిన పదార్థములను కొలంబాలో ఉంచేవారు. వాటిని కుక్కలు పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి.
ప్రస్తుతము బంగ్లాదేశ్ లో నున్న తాంగలి అనే కుగ్రామంలో జగన్నాధదాస బాబాజీ జన్మించారు. ఈయన గౌడీయ వైష్ణవ సంప్రదాయమునకు చెందినవాడు.
అయన వద్ద ఒక కుక్క ఉండేది. ఆ కుక్క కొన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఆ కుక్క పిల్లలు జగన్నాధదాస బాబాజీ తినే కంచం నుండే తినసాగాయి.
ఆయన వద్ద ఉండే బీహారీలాల్ అనే సేవకుడు ఆ కుక్కను, కుక్క పిల్లలను వెళ్ళగొట్టాడు.
“ఈ నవ ద్వీపం (చైతన్యుల జన్మ భూమి)లోని ప్రతి ప్రాణి అతి పవిత్రమైనదే. నా కుక్కలు తినందే నేను తినను” అన్నారు బాబాజీ.
బీహారీలాల్ తానూ వెళ్ళగొట్టిన కుక్కలను వెదకి తిరిగి తెచ్చిన తరువాత ఆ కుక్కలు తన కంచం నుండి తింటుంటే సంతోషపడి “ఈ పవిత్ర ధామంలోని కుక్కలకు శుభం” అని పలికి తాను మరల భుజింపసాగాడు.
నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు తనను తానే మరచేవాడు. నూట ఇరవై ఏండ్ల వయసులో ఉన్నా, అర్ధచంద్రాకృతిలాగా వంగిపోయినా, కనురెప్పలను ఎవరైనా తెరిచినప్పుడు తన ఇష్ట దైనాన్ని చూసేవారు.
నామ సంకీర్తనం వినబడగానే బాలునిలా లేచి, ఎగురుతూ, నామ సంకీర్తనంలో పాల్గొనే వారు.
“ఓ! నిత్యానందా, ఎంతటి కమనీయమైన నామమయ్యా! ఎంత మధుర నామాన్ని మాకు ప్రసాదించావయ్యా” అని అయన శ్రీచైతన్య మహాప్రభును కీర్తించేవారు.
ఒకసారి అయన బృందావనంలో రోడ్లు ఊడ్చేవానిని అడిగి, ఒక రొట్టెను తీసుకుని సంతోషంగా తినసాగారు. దీనిని చూచిన కొందరు అంతటి గొప్ప వైష్ణవుడు ఆలా చేయటం నచ్చలేదు.
ఎవరో అడిగారు అలా ఎందుకు చేస్తున్నారు? అని. “ఈ బృందావనంలో మట్టి ఎంత పవిత్రమైనదో తెలుసా? ఈ మట్టిలో అణువుగా ఉండాలనుకుంటాడు బ్రహ్మ. అటువంటి మట్టితోనే (ఊడ్చే పని) చేస్తూ జీవిస్తున్న అతడెంత పవిత్రుడో ఊహించుకో” అన్నారు బాబాజీ.
ఒకసారి భక్తులవద్ద నుండి రెండు వందలు కానుకగా వస్తే, ఏంచేద్దామని బీహారీలాల్ ను అడిగాడాయన. విందు ఏర్పాటు చేద్దామన్నారు.
“కాదు రెండు వందల రూపాయల రసగుల్లాలు కొని, ఆవులకు, కుక్కలకు పెట్టు. అది పుణ్యదాయకం” అన్నారాయన.
ద్వాపర యుగంలో కృష్ణుడు ధర్మ సంస్థాపనాచార్యునిగా అవతరిస్తే, కలియుగంలో గౌరాంగుని (శ్రీ చైతన్య మహాప్రభువు)గా, కరుణామూర్తిగా అవతరించాడనేవారాయన.
ఆయనను వైష్ణవ సార్వభౌముడని కొందరంటే, భక్త సేనానిగా మరికొందరు భావించారు.
149 ఏండ్లు జీవించి, ఫాల్గుణ (సామాన్యంగా మార్చిలో వస్తుంది) బహుళ పాడ్యమినాడు చైతన్యులలో లీనమయ్యారు.
శ్రీ జగన్నాధాయ తే నమః
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- క్రియా యోగి…. మహనీయులు – 2020… నవంబర్ 30
- మందిరం కట్టు…. మహనీయులు – 2020… మార్చి 15
- తక్కువేమి మనకు? …. మహనీయులు – 2020… మే 5
- ఓం చితంబరాయ నమః…. మహనీయులు – 2020… మార్చి 7
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments