మందిరం కట్టు…. మహనీయులు – 2020… మార్చి 15



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒక సంప్రదాయంలోని వారికి జన్మించినా, ఆ శిశువు పెద్దవాడైన తరువాత అదే సంప్రదాయంలో ఉండనక్కరలేదు.

వివిధ సంప్రదాయంలోని సత్యము ఒకటే అని తెలిసిన వారు అలాగే చేస్తారు.

శైవాచార జంగములకు చెందిన పుణ్య దంపతులు, నాగేంద్రుని పూజింపగా, జన్మించిన బిడ్డకు నాగేంద్రయ్య అని పేరు పెట్టారు.

తొట్టెలో పరున్న పసి బిడ్డ దగ్గరకు, నాగ సర్పము రాగా, తల్లి భయపడినది. ఆ బిడ్డడు గొప్ప యోగ జాతకుడవుతాడన్నారు దైవజ్ఞులు.

తనకు పెండ్లి వద్దని తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినక వివాహం జరిపించారు.

భార్యతో వైవాహిక జీవితం ఆరంభించక పూర్వమే, సన్యసించటానికి అనుమతిని అడిగాడు నాగేంద్రుడు.

ఆమెకు భర్త  సన్యసించటం ఇష్టం లేదు. కానీ భర్త దత్తాత్రేయునిగా దర్శన మిచ్చాడు. ఆమె భర్త సన్యసించటానికి అంగీకరించింది.

దత్త సంప్రదాయంలో శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతులు సన్యసిస్తామన్నా, మొదటగా వారి తల్లులు అంగీకరింప లేదు.

మహంత్ మహారాజ్ ఈ నాగేంద్రునకు దీక్ష నిచ్చి దత్తగిరి మహారాజు అని నామమిచ్చాడు. దత్తగిరి మహారాజు దిగంబరుడైనాడు.

దత్తుని వెంట కుక్కలు ఉంటాయి. ఈ దత్తగిరి మహారాజు  చెంత కూడా కుక్కలు ఉండేవి.

ఆ కుక్కలు ప్రక్క వారి పొలములోనికి పోయి, గోతులు త్రవ్వేవి. ఆ కుక్కలు తనకు నష్టం కలిగిస్తున్నాయని ఆ కామందు చెప్పాడు.

కుక్కల వలన నష్టము ఉండదని, అధిక రాబడి వస్తే, తనకు ఇస్తావా? అని దత్తగిరి మహారాజు అడిగాడు. “సరే” అన్నాడు ఆ కామందు.

ఆ సంవత్సరం ఆయన (భూ కామందు)కు మూడు రేట్లు పంట పండింది. కామందు మాట నిలుపుకోవటమే కాదు, శిష్యుడయ్యాడు కూడా.

సత్పురుషులు ఇటువంటి మహత్తులు చూపేది, శిష్య గణాన్ని పెంచుకునేందుకు కాదు, వారిలో భక్తి బీజాన్ని నాటేందుకే.

ఒకసారి ఆయన మరో గ్రామానికి పోతున్నారు శిష్య బృందంతో. అది రాత్రి సమయం కాబట్టి దివిటీలు (కాగడాలు) వాడుతున్నారు.

దివిటీలలో పోసేందుకు నూనె అయిపోయింది. గంగమ్మను ప్రార్ధించారు ఆయన.

ఆ మంజీరా నది జలాలను కాగడాలపై పోశారు. ఇక నూనె అవసరం లేకపోయింది ఆ నాడు.

గాణుగాపురంలో ఈ దిగంబరియైన దత్తగిరి మహారాజును మందిరం లోనికి రానీయలేదు.

దత్తాత్రేయులు ప్రత్యక్షమై “గుడి కట్టు, నీతోనే ఉంటాను” అన్నారు. బర్దిపురంలో దత్తాత్రేయ మందిరం నిర్మించారాయన.

మాణిక్య ప్రభువలె ఆయన సజీవ సమాధి చెందారు.

ఆ దినం 15 . 3 . 1979 (గురువారం).

జయ జయ దత్త.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles