Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా అబ్బాయికి ఆరు, ఏడు సంవత్సరాల వయస్సు అప్పుడు బాగా జ్వరం వచ్చింది. వళ్లంతా కాలిపోతోంది.
డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే డాక్టర్ కి, మందులకు డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు.
ఆ సమయం లో మా ఆవిడ బాబా ముందు కూర్చొని బాబా మేము నిన్నే నమ్ముకున్నాము,
నువ్వే మాకు దిక్కు, నువ్వే నిజంగా సత్యమైన దేవుడిగా మాయందుంటే మా అబ్బాయి జ్వరం తీవ్రత తగ్గించాలి, సాయంత్రానికి తగ్గిపోవాలి. అంటూ మా వాడి వొంటి నిండా ఊదీ రాసింది.
అంతే సాయంత్రానికల్లా జ్వరం తగ్గిపోయింది . కులాసాగా ఆడుకున్నాడు .
ఒకసారి మా ఆవిడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలో మా బావమరిది కొడుకు పొలం గట్టుమీద వాళ్ళ తాతకి టీ తీసుకువెడుతున్నాడు.
పొలం గట్టుపై ఉండే పగుళ్ళలోంచి ఒక పాము బయటికి వచ్చి అతన్ని కాటేసింది.
ఇతను బాబోయ్, బాబోయ్ అని అరుస్తున్నాడు. మా పినమామయ్య వెంటనే పరుగున వచ్చి విషయం తెలుసుకొని కాలికి విషం ఎక్కకుండా గుడ్డకట్టి ఇంటికి చేతుల మీద మోసుకు వచ్చారు.
అక్కడ మా ఆవిడ కూడా ఉంది. విషయం తెలిసాక మా ఆవిడ బాబా ముందు నిలబడి, బాబా నువ్వు మాయందుంటే నిజంగా సత్యమైన దేవుడివైతే హాస్పిటల్కి వెళ్ళేదాకా వాడికి ఏమి అవ్వకూడదు అనుకుంది.
కారుతెచ్చారు. బోజిడి నుండి కోపర్ గావ్ కారులో వెళ్లారు. దారంతా వాడితో మా ఆవిడ మాట్లాడుతూనే ఉంది.
సాయి రాం, సాయిరాం అని నామస్మరణ చేస్తూనే ఉంది. హాస్పిటల్ కి వెళ్ళాక డాక్టర్స్ విషయం తెలుసుకుని విషం పైకి ఎక్కకుండా ఇంజక్షన్ చెయ్యాలి అని ఆ ఇంజక్షన్ కోసం హాస్పిటల్ అంతా వెతకాల్సి వచ్చింది.
చాలా సేపటికి కనపడింది. ఇంజక్షన్ చేసాక కొంచెం కుదుటపడింది. మా బావమరిది కొడుక్కి పాము కరిచింది అన్న విషయం ఊర్లో అంతా తెలిసిపోయి ఊరంతా హాస్పిటల్ కి చేరుకున్నారు.
ఇలా ఊరు వారంతా చేరారు అంటే ఇలాంటి పేషెంట్ ని ఇప్పటి వరకు చూడలేదు అన్నాడు డాక్టర్.
ఇంకా మీ యందు ఏ దేవుడు ఉన్నాడో కానీ అతను ఇంత దూరం వచ్చి మేము ఇంజక్షన్ ఇచ్చేదాకా అతను ఎలా బ్రతికాడో మాకు అర్ధం కావడం లేదు అన్నారు. పది రోజులు హాస్పిటల్ లో ఉన్నాడు.
మా అబ్బాయి 10 th క్లాస్ చదువుతున్నాడు. వాడు సరిగానే చదివేవాడు కానీ భయపడే వాడు.
పరీక్షల ముందు బాబా కి ఇలా దండం పెట్టుకున్నాడు – బాబా నేను సరిగ్గా చదవలేదు, ఏం రాసానో ఏమో నాకేం తెలియదు, నువ్వే నన్ను పాస్ చేయించాలి.
పరీక్షలు వచ్చాయి. మా వాడు బాబా బాబా అంటూ బాబా నామస్మరణం చేస్తూ ఏదో రాసి వచ్చాడు.
వీడేం రాశాడో వాడికి తెలియదు. బాబాకి తెలుసు. 81 % మార్కులు వచ్చాయి.
మా అమ్మాయి బాబా ని బాగా నమ్ముతుంది. మా అమ్మాయికి ఒక సంభందం వచ్చింది. ఆ సంభందం అందరికి అన్ని విధాలా నచ్చింది.
ఆ సంభందం ఎలాగైనా కుదర్చమని బాబాను ప్రార్ధించింది. అదే సంభంధం కుదిరింది. నిశ్చితార్ధం అయ్యింది ఈ మధ్యనే.
ఒక దీపావళి రోజు మా ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఒకటుంది. ఆ ఫోటో లో సాయంత్రం 7 . 30 కి శరీరమంతా ఆంజనేయ స్వామి మొహం మాత్రం సాయిబాబా లాగా మా అమ్మాయికి కనపడింది.
ఆ తర్వాత మా అబ్బాయికి చెప్పింది. వాడికి అలాగే కనపడింది.
వాడు వాళ్ళమ్మకి చెప్పాడు. నేను సాయంత్రం డ్యూటీ అయ్యాక ఇంటికి వెడితే నాకు చెప్పాడు. నేను చూసాను. నాకు అలాగే కనపడ్డాడు.
అలా మాకు దీపావళి పండగ రోజు బాబా దర్శనం అయ్యింది.
మా ఆవిడకి కొన్ని రోజుల క్రితం కడుపులో గర్భసంచికి పుండులాగా వుండ వచ్చింది. చాలా నొప్పి వస్తుండేది. చాలా బాధపడుతుండేది.
ఏ డాక్టర్కి చూపించినా ఆమెకి ఆపరేషన్ చెయ్యాలనే చెబుతున్నారు. నేను బాబాని ప్రార్ధించాను.
బాబా ఏమిటీ పరీక్ష? ఆమె చాలా కష్టపడుతుంది. చాలా బాధ పడుతుంది.
ఆపరేషన్ అంటున్నారు. డబ్బులు చాలా అవుతాయి. ఆపరేషన్ అంటే ఆమె తట్టుకోలేదు. ఏదైనా నువ్వే చూడాలి బాబా అనుకున్నాను.
మా ఊర్లోనే ఒకాయన ఆయుర్వేదం డాక్టర్ ఉన్నాడు. ఆయనది చాలా పెద్ద వయసు. ఒకసారి నాకెందుకో ఆయనకి చూపించాలని అనిపించింది.
వెళ్లి ఆయనకు వ్యాధి, పరిస్థితి రెండు వివరించాను. రిపోర్ట్స్ కూడా చూసాడు. ఆయన కూడా బాబా భక్తుడు.
ఆయన దగ్గర పెద్దదైన బాబా ఫోటో ఉంది. ఆయన బాబాకి దండం పెట్టాకనే ఏ ట్రీట్మెంట్ అయినా చేస్తాడు.
మా ఆవిడని మరునాడు తీసుకురమ్మన్నాడు. తీసుకు వెళ్ళాను.
ఆవిడ్ని చూసి నీకు 5 ఇంజెక్షన్లు పొట్టపైన రోజు మార్చి రోజు చేస్తాను అన్నాడు.
అలాగే రోజు మార్చి రోజు ఇంజెక్షన్స్ చేసాడు. ఒక నెల రోజుల తర్వాత టెస్ట్ చేయిస్తే పుండు లేదు. నొప్పి కూడా తగ్గిపోయింది.
అప్పటికి ఆ పుండు మూలాన ఆమెకి జ్వరం కూడా వస్తూ ఉండేది . ఇప్పుడు అది కూడా తగ్గింది.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- “బాబా మీరు చెప్పక ముందే, మాకు కలలో వచ్చి చెప్పారు.”
- మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఏమో కానీ, ఇతనికి జీవితాన్నిచ్చి మీరందరిని బ్రతికించాడు ఆ దేవుడు.
- ఏ ఉద్యోగం లేదు అని బాధ పడుతున్న నాకు, తన గుడిలోనే ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
- స్వయంగా బాబా వారి పేరు మీద ఉన్న కాకడ ఆరతి టికెట్స్ మాకు ఇచ్చారు.
- బాబా స్వప్నంలో మా ఇంటికి వచ్చి మేము ఇచ్చిన కాఫీని స్వీకరించారు-17
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments