ధిక్కారము సైతునా?…. మహనీయులు – 2020… మార్చి 16



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ఏమిటి? ఒకటి, రెండు రోజుల ఉపవాసానికే తట్టుకోలేకపోయావా? నేను 12  సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను” అన్నారు సగుణ్ మేరు నాయక్ తో.

బీబీ హజ్రాకు మహమ్మద్ ప్రవర్త స్వప్నంలో కనిపించి ఆమెకు పుట్టబోయే బిడ్డకు అహ్మద్ అని పేరు పెట్టామన్నారు. హజ్రత్ ఆమె బిడ్డకు ఆలీ అహ్మద్ అనే పేరు పెట్టింది.

ఆమె తన కుమారుని సోదరుడైన ఫరీద్ గంజ్ షక్కరు వద్దకు తీసుకుపోయి మత పరమైన బోధనలను చేయమన్నది.

పేదరికం వలన వారికి తిండి సరిగా లేదని భోజనపు ఏర్పాటు చేయమన్నది సోదరున్ని.

ఫరీద్ ఆమె ముందే ఆలీ అహ్మద్ తో “వంటశాలను నీ అధీనంలో ఉంచుకుని, ఆహార పదార్దాలను నీవే అందరును ఇవ్వు” అన్నారు.

తల్లి సంతోషంగా వెళ్ళిపోయింది, ఆధ్యాత్మికతతో పాటు ఇంత భోజనం కూడా కుమారునికి దొరుకుతుందని.

పన్నెండేండ్లు గడిచాయి. తల్లి మరల సోదరుడైన ఫరీద్ వద్దకు వచ్చింది.

కుమారుడు భోజనశాలలో ఒక్కపూట కూడా భుజించలేదని, అడవికి పోయి ఆకులలములు తింటున్నాడని తెలుసుకున్నది.

“ఇలా జరిగిందేమిటి, అన్నా?” అన్నదామె ఫరీద్ తో. ఫరీద్ ఆలీ అహ్మద్ ను పిలచి విషయం అడిగాడు.

“మీరు నాకు వంటశాలను, భోజనశాలను ఇచ్చారు. కానీ నన్ను భోజనం చేయమనలేదు. మీ ఆజ్ఞ లేనిదే నేనెలా తినగలను?” అన్నాడు ఆలీ అహ్మద్.

ఆలీ తన మేనమామను గురువుగా భావించేవాడు. అతడు ఆకులలములు తిన్నా, 12  ఏండ్లు ఎలా ఉన్నాడు? అనేది దైవ రహస్యం.

ఆ దైవమె ఆలీకి ఆహారాన్నుండి వచ్చే శక్తి బదులు, దైవ శక్తిని ఇచ్చింది. ఇదంతా ఆ గురు శిష్యులకు తెలుసు.

అప్పటినుండి ఆలీ అహ్మద్ ను ఆలీ అహ్మద్ సబీర్ అని పిలిచేవారు. సబర్ అంటే ఓర్పు.

ఆలీ అహ్మద్ కు గురువు అనుగ్రహమే కాదు, దైవ రక్షణ ఉన్నదనేది ప్రతి సంఘటనలోను వ్యక్తమయ్యేది.

తల్లి చివరి క్షణాల్లో ఉంది. తల్లి దగ్గరకు చివరి క్షణాల్లోనయినా పోయిరా అన్నారెందరో. అయినా పోలేదు.

గురువు నాకు ఇచ్చిన పనుల కంటే అమ్మ ఎక్కువగాదని తల్లిని చివరి క్షణాలలో కూడా చూడటానికి పోలేదు. అది గురుభక్తి అంటే.

గురువు ఆయనను కలియారి అనే ఊరికి ఖలీఫాగా పంపారు. ఆలీ వెళ్ళాడు.

గురువైన ఫరీద్ ఆజ్ఞను ఆ ఊరివారు (కలియారీ ప్రజ) తిరస్కరించినందుకు ఉగ్రుడయ్యాడు కలియారి మంటలలో కలిసిపోతుందన్నాడు. అలాగే జరిగింది.

నా మరణానంతరం ఎవ్వరూ నాకు అంతిమ సంస్కారం చేయవద్దన్నాడు సబీర్.

ఎవరో ముసుగులోనున్న మనిషి వచ్చి అన్నీ చేసి వెళ్ళబోతుంటే ఎవరో “మీ పేరేమిటి?” అని అడిగారు ముసుగు మనిషిని.

ముసుగు తీసి చూపాడు – అయన ఆలీ అహ్మద్ సబీర్ కలియారి. వెంటనే అదృశ్యమయ్యాడు.

ఆ దినం మార్చి 16, 1291. మనకు గురుభక్తి అలవాడు గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles