కాషాయానికి వన్నె… …. మహనీయులు – 2020… మార్చి 27



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు” అంటారు సాయిబాబా.

వేలప్ప ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ బాలుని తల్లి కంచంలో అన్నం పెట్టి పిలిచింది భోజనం చేయటానికి. రాకపోవటంతో, వేలప్పను చేతితో తట్టింది. ధ్యానం భంగమైంది. ఆ కోపంలో ఆ కంచాన్ని నెట్టివేశాడు వేలప్ప.

వేలప్ప 1885 ఫిబ్రవరి 27 న కేరళలో జన్మిచాడు. ఆయనే అనంతరం మళయాళస్వామి అయ్యారు.

భారత దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ, తిరుమలకు వెళ్ళాడు. ఆ యాత్రనంతా చెప్పులు ధరించకుండానే చేశాడు.

ఎవరైనా పెడితే తినేవాడు. ఒంటిపూట భోజనం చేసేవాడు. అదీ కుదరకపోతే పిండాలను తీనేవాడు.

గతం ఒక్కసారి ఆయన మనస్సులోకి వచ్చింది. …తల్లి ప్రేమతో పెట్టిన ఆహారాన్ని తిరస్కరించిన సంఘటన.

తిరుమలలో తిరువేంకటాచార్యులు ఆయనకు నిత్యం ప్రసాదం అందే ఏర్పాటు చేసాడు.

మూడు రోజులపాటు విపరీతమైన వాన కురవటంతో మళయాళస్వామి ప్రసాదానికి పోలేదు.

ఆనాటి రాత్రి వెంకటేశ్వర స్వామి సుబ్బరామ శెట్టి అనే వ్యక్తికి స్వప్నంలో కనిపించి, మళయాళస్వామికి ఆహారం పెట్టమని ఆదేశించాడు…. ప్రసాదం అందింది.

నారు పోసిన దేవుడు నీరు పోయడా?

ఈయన తొమ్మిది ఏండ్లు తపస్సు చేసినా ఫలితం రాలేదు. 12 ఏండ్లు తపస్సు చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని స్వప్నంలో సందేశం అందింది. ఆయన అలానే చేసి ఆత్మసాక్షాత్కారం పొందాడు.

ఈయన కాషాయ వస్త్రాలను ధరించునపుడు “కాషాయం ధరింపనున్న నా ద్వారా వేదాంత సాంప్రదాయ యశస్సు ఇనుమడింప చేయుము” అని ప్రార్ధించారు.

ఆయన సన్యాసాశ్రమ నామము శ్రీ అనంగానందగిరి. ఐనా మళయాళస్వామిగానే ప్రఖ్యాతులు.

అందరకూ భగవత్ ప్రాప్తికి అడ్డు నిలచే అడ్డంకులు తొలగాలని ప్రయత్మించేవారు.

 స్త్రీలకు, ఇతరులకు ప్రణవాన్ని బోధించారు. స్త్రీకి సన్యాసం దీక్షనిచ్చి చరిత్ర సృష్టించారు.

ఏర్పేడులో వ్యాసాశ్రమం స్థాపించారు. ఆయనకు శిష్యులెందరో ఉండేవారు. విద్యానందగిరి, విద్యాప్రకాశానందగిరి, రామేశ్వరానందగిరి, సముద్రాల లక్షణయ్య…ఇలా ఎందరో.

ఈయన సాధించిన సిద్దులు. మహత్యాలు గుప్తంగా ఉంచేవారు.

స్వప్న సాక్షాత్కార మిచ్చి శివగిరి గోవిందస్వామికి ఆరోగ్యం ప్రసాదించారు. గాయకుడు వెంకటస్వామి గొంతును సరిచేశారు. కోటంబేడులో కలరా వ్యాధిని జంతువుల, పిల్లసరను వ్యాధిని నివారించారు.

మానవుల ఉద్దరణ జరిగేందుకు ఎన్ని జన్మలనైనా పొందుతానని, తనకు మోక్ష మక్కరలేదన్నారు.

నేడు మార్చి 27. మళయాళస్వామి జన్మదినం. స్వామిని స్మరించి, ముందు ఆత్మోన్నతిపొంది తరువాత జనోద్ధరణ చేద్దాం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles