బాబా కనపడ్డాడు. తెల్లని బట్టలు వేసుకున్నాడు. నా వీపు మీద తట్టి ” ఏం పూజ మానేశారు, పూజ చెయ్యరా ? ”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బాబా అంటే ముస్లిం, ఆయన్ని మనం కలవడం ఏమిటి? మన కష్టాలు ఆయన తీరుస్తాడా? అని అనుకున్నాను.

నాలుగు రోజులయ్యాక నాకే అనిపించింది, దేవుడు ఏ దేవుడైతే ఏమిటి? ముస్లిం అయితే ఏమిటి  కడుపు నింపని మతాలు ఎందుకు? ఈ కష్టాలు తీరుతాయని చెప్పాడు కదా!

అయినా నిజంగా కావాల్సింది ఈ కష్టాలు తీరి పిల్లలు కడుపునిండా అన్నం తింటే అంతకంటే ఇంకేం కావాలి.

ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అనిపించి పిల్లలతో అన్నాను పోనీ పూజ చేద్దాం.  ఏమో ఎందుకు చెప్పాడో ఏమో అన్నాను బయటికి వచ్చాను.

అప్పటికి వెంకటేశ్వర స్వామి తో పాటు అమ్మ వారిని కూడా నేను పూజ చేస్తున్నాను. ఏ దేవతైనా కరుణించక పోదా అని.

నేను సంగీతం పాఠాలు ఇళ్ళకి వెళ్లి చెప్పేదాన్ని. రాబడి తక్కువ, ప్రయాస ఎక్కువగా ఉండేది.

నేను బాగా అలసిపోయేదాన్ని. అందులోనూ హైదరాబాద్ లాంటి సిటీ లో లంకమేత గోదావరి ఈత లాగా ఉంటుంది.

పిల్లలు స్కూల్ కి వెళ్లి వచ్చి హోమ్ వర్క్ చేసుకొని శుక్రవారం, శనివారం అయితే వంటిల్లు కడిగి వాళ్ళు పొద్దుటే పూజ కోసం పూజ గది కూడా కడిగి శుభ్రం చేసేవాళ్ళు సరే నేను బయటికి వచ్చి కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక షాపులో బాబా క్యాలెండరు కనపడింది.

నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఆ కొట్టు అతన్ని ఆ క్యాలెండరు ఎంత బాబూ అని అడిగాను. అతను 12 రూపాయలు అన్నాడు.

బాబూ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలకే ఆ క్యాలెండరు ఇచ్చేయి. అంటే వాడు 12 రూపాయలకు కొన్నాను అదే ధరకు నీకు ఇచ్చేస్తాను అన్నాడు.

అలాగా 2 రూపాయలు తర్వాత ఇస్తాను ఇప్పుడా క్యాలెండరు ఇస్తావా అని అడిగాను. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావో? ఎప్పుడు ఇస్తావో? నేను ఇవ్వనమ్మ అన్నాడు. బ్రతిమలాడాను వాడు ససేమీర అన్నాడు.

ఆ రోజు గురువారం బాబా పూజ చేద్దాం అనుకోని క్యాలెండరు అయితే తక్కువకి వస్తుంది విగ్రహాలు, ఫోటోలు అంటే ఎక్కువ రేట్ ఉంటాయి.

అందుకే క్యాలెండరు కొనడం కోసం ఇంత తంటాలు పడినా కొనటమే కుదర్లేదు ఈయన నా కష్టాలు ఏం తీరుస్తాడు అనుకుంటూ నిరాశగా ఇల్లు చేరాను.

ఇంట్లో తలుపులు తీసేసరికి లోపల అగరబత్తీ పరిమళాలు, కర్పూరం వాసనలు , కొబ్బరికాయ కొట్టినట్లు అన్నీ కనపడుతున్నాయి. పూజా మందిరం లో బాబా ఫోటో కూడా ఒకటి కనపడింది.

ఇవన్నీ ఎలా వచ్చాయని పిల్లల్ని అడిగాను ఆశర్యంగా!, అమ్మా నువ్వు బయటికి వెళ్ళగానే ఇంటి ఓనర్ గారి భార్య వచ్చింది.

ఏవేవో మాట్లాడుతూ మీ అమ్మగారు ఎక్కడికి వెళ్లారు అని అడిగారు మేము ఏమో మొన్న జరిగింది అంత చెప్పి, మా అమ్మ గారు మా కష్టాలు తీరడానికి బాబా కి పూజ చేయాలనీ బాబా ఫోటో తేవడానికి బజారుకు వెళ్లావని చెప్పాము.

ఆవిడ వెంటనే అయ్యో అలాగా అమ్మాయి నా దగ్గర మూడు ఫోటోలు ఉన్నాయి, కావాలంటే నేను మీకు ఒకటి ఇస్తాను అంది.

సరే ఇవ్వమన్నాము ఆవిడ ఇంట్లోకి వెళ్లి బాబా ఫోటో ఒకటి తీసుకువచ్చి మాకు ఇచ్చింది. కొబ్బరికాయ కూడా ఆవిడే ఇచ్చింది.

అమ్మా మాకు, ఎలా పూజ చేయాలో తెలియలేదు నువ్వు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఏమో అని మేమే పూజ చేసాము.

ఆ రోజు మా పెద్దమ్మాయి ఎందుకో స్కూల్ కి వెళ్ళలేదు. అదే ఇంట్లో దీపాలు వెలిగించి, బాబా ఫోటో పెట్టి, అగరబత్తిలు వెలిగించి, అక్షింతలు వేసి, పసుపు కుంకుమ లు వేసి, ఆరతి ఇచ్చి పటిక బెల్లం నైవేద్యం పెట్టాను అని ప్రసాదం పట్టుకువచ్చి నాకు పెట్టి అమ్మా కొబ్బరికాయ కొట్టాము కదమ్మా పచ్చడి చేసుకుందాం అమ్మా అంది.

నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమో! ముస్లిం ఫోటోని ఇంట్లోకి తెచ్చి పూజలు మొదలు పెట్టాం. ఈయన ఎలా తీరుస్తాడో మా కష్టాలు అనుకున్నాను.

ఆ రోజు నుండి పిల్లలే ఇల్లు కడిగి బుధవారం నాడు గురువారం బాబా పూజ కోసం, గురువారం నాడు శుక్రవారం చేసే అమ్మవారి పూజకోసము, శుక్రవారం నాడు శనివారం చేసే వెంకటేశ్వర స్వామి పూజ కోసము వంట గది, పూజ గది శుభ్రం చేసేవాళ్ళు.

ఒక 3, 4 వారాలు గడిచాయి. మా పిల్లలు గురువారం పూజ మానేసారు. ఆ సంగతి నాకు తెలియదు.

ఓ గురువారం నాడు రాత్రి పడుకున్న నేను మంచం మీద పక్కకి ఒత్తిగిలి పడుకున్నాను. నా వీపు మీద చెళ్ళున కొట్టినట్లు అయింది. కళ్ళు తెరిచాను.

అంత నిలువెత్తు విగ్రహం ఇంట్లో ఫొటోలో ఉన్నట్టే బాబా కనపడ్డాడు. తలకి గుడ్డ ఉంది. మెలి బెట్టి ముడి వేసింది. తెల్లని బట్టలు వేసుకున్నాడు. నా వీపు మీద తట్టి ” ఏం పూజ మానేశారు, పూజ చెయ్యరా ? ” అని అడిగాడు.

నిద్ర పోతున్న నాకు ఒక్కసారిగా మత్తు వొదిలిపోయింది. పిల్లల్ని కేకవేసాను. వేరే గదిలో పడుకున్న పిల్లలు పరుగున వచ్చి ఏంటమ్మా, ఏమైంది అని అడిగారు.

ముందు ఇది చెప్పండి, మీరు బాబాకి పూజ చేయడం లేదా అని అడిగాను.

లేదమ్మా మూడు రోజులు వరుసగా వంటగది, పూజగది అన్ని శుభ్రం చేయలేక కొత్తగా మొదలుపెట్టింది గురువారం కదా, శుక్రవారం శనివారం పూజలు ఎప్పటినుండో చేస్తున్నాం కదా!

అందుకని కొత్తగా చేరింది గురువారం కాబట్టి అది మానేస్తే బుధవారం నాడు ఇల్లు కడగక్కర్లేదు కదా అని పూజ చేయడం మానేసాం.

ఏం జరిగిందమ్మా అంది నా పెద్దకూతురు. ఒక్కటే ఏడుపు మొదలుపెట్టింది అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చింది.

అంత జరిగినా నాకింకా నమ్మ బుద్ధి కాలేదు ఇంకా అపనమ్మకంగానే ఉంది. నా వీపు పగిలినా ఇంకా నాకు భ్రమేనేమో అన్న అనుమానం.

పిల్లలు మళ్ళీ పూజ మొదలుపెట్టాక మా పరిస్థితి కొంచెం మెరుగైంది. మా వారు ఇంటికి తిరిగొచ్చి మళ్ళీ ఉద్యోగం లో చేరారు.

అంతా బాగానే ఉన్నా నాకింకా నమ్మకం కుదరటంలేదు, ఎందుకంటే నరనరాల్లో దేవుడంటే వేంకేటేశ్వర స్వామి, అమ్మవారు అని వేరే ఇంకెవర్నీ నా మనస్సు ఒప్పుకోలేదు. ఈ రకం గా నరనరాలలో నూ జీర్ణించుకు పోయింది.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles