Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబాకు కబీరుకు సంబంధం ఉందని సాయి సాహిత్యం తెలుపుతొంది. సాయి కబీరు అవతారం అని కొందరంటే, సాయి కబీరు శిష్యుడని మరికొందరంటారు.
దాదూ దయాల్ జననం గురించి, కులం గురించి అనేక అభిప్రాయాలున్నాయి.
దాదూ 18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు, ఒక సాధువు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించాడు దాదూ.
ఆ సాధువు “నన్ను ఆహ్వానించావు సరే, దైవం నీ కోసం వేచియున్నదనే విషయం నీకు తెలియదు” అన్నాడు.
ఆ సాధువు పాదాలపై పడి దాదూ తనకు దీక్ష నిమ్మని కోరాడు. ఆ సాధువు దాదూకు దీక్షనిచ్చాడు.
ఆ సాధువు కబీరు కుమారుడైన కమల్ అని కొందరు, కబీరు శిష్యుడైన బుద్దా అని మరికొందరంటారు. ఏదేమైనా ఈయన కబీరు వలన ప్రభావితుడయ్యాడు.
ఒకసారి ఆయన పొడ గిట్టని వారు, దాదూ ధ్యానం చేసుకుంటుండగా, ఆయన చుట్టూ ఇటుకపై ఇటుక పేర్చి సమాధిని కట్టారు.
కొంతకాలం తరువాత ఆయన ధ్యానం వదలి స్పృహ తెచ్చుకున్నప్పుడు తనకు ఎవరో దుండగులు సమాధి కట్టారని గ్రహించాడు. మరల దైవ ధ్యానంలోనికి వెళ్ళిపోయాడు దాదూ.
కొంతకాలం దాక ఆయన కనపడకపోతే ఎవరో దుండగులు ఆయనకు అపకారం చేశారని ప్రజలు గ్రహించారు.
క్రొత్తగా కట్టబడిన సమాధిని చూచి దానిని మెల్ల మెల్లగా తీసివేశారు. లోన దాదూ కనిపించాడు.
ఆయన ధ్యానం ముగిసిన తరువాత, ఆ దుండగులను శిక్షిస్తామన్నారు ఆ ఊరి వారు. ఆయన అంగీకరించలేదు.
వారు సమాధి కట్టడం వలననే మరింత సమయం దైవ సన్నిధిలో గడిపే అవకాశం కలిగిందని, వారు తనకు మేలు చేశారని, వారిని శిక్షించవద్దని అన్నారు.
అంతటి క్షమా హృదయం కలిగిన దాదూను అందరు దాదూ దయాల్ అని ఆప్యాయంగా పిలిచేవారు.
ఆయన బ్రహ్మ లేక పరబ్రహ్మ సంప్రదాయాన్ని నెలకొల్పారు.
అందరినీ, అన్ని మతాల వారిని ఏకం చేసేందుకే ఆయన ఆ సమాజాన్ని నెలకొల్పారు.
బ్రహ్మను అందరూ ఆరాధించటమే ఆ సమాజ ఆశయం. అందరూ కలసి కూర్చుని ప్రార్ధించటం చేయవచ్చు. అన్ని వేళలా భగవద్బావనలో నిమగ్నులై ఉండాలి అనేవారాయన.
ఒకసారి ఆయన అక్బరు కొలువుకు వెళ్ళాడు. కాజీలు ఆయనను “ఈ విషయాలన్నీ ఏ గ్రంథము నుండి గ్రహించారు?” అని ప్రశ్నిస్తే
” ఈ శరీరమే నా గ్రంథం. దయాళుడైన ఆ ప్రభువే దీని మీద వ్రాశాడు” అన్నారాయన.
అటుపిమ్మట అక్బరు చక్రవర్తి దేశ నాణెముల మీద తన పేరును తీసివేసి, భగవంతుని నామాన్ని ముద్రించాడు.
ఈయన జన్మదినం ఫాల్గుణ శుక్ల అష్టమి (సుమారు మర్చి నెలలో వస్తుంది).
దాదూ దయాల్ కోరినట్లు మన దేహాన్ని దేవాలయం చేసుకుందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తానొకడైనా తనకొక రూపై… …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 10
- రాముడైన ….రహిమైన ….దేవుడొక్కడే …. మహనీయులు – 2020… అక్టోబరు 1
- దేహమే దేవాలయం… …. మహనీయులు – 2020… ఆగస్టు 8
- భక్తి సామ్రాజ్యం … .మహనీయులు – 2020… అక్టోబరు 7
- ఒకటి కోసమే రెండు… మహనీయులు @2020 – జనవరి 10
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments