Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా సాహిత్యంలో కబీరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కబీరు సాయిబాబాకు గురువుగా, సాయిబాబాయే కబీరు అవతారంగా భావిస్తారు సాయి భక్తులు.
ఒకసారి కబీరును సికిందర్ లోడీ రమ్మన్నాడు. “ఎందుకు ఆలస్యంగా వచ్చావు?” అని సికిందర్ అడిగాడు.
“నేనొక వింత దృశ్యాన్ని చూచి రావటంలో ఆలస్యం అయింది” అన్నాడు కబీరు.
“అది ఏమిటి?” అడిగాడు సికిందర్. “సూది కంటే సన్ననైన ఒక సందుగుండా వేల కొలది ఒంటెలు, ఏనుగులు, సునాయాసంగా వెళ్లిపోతుంటే చూస్తూ నిలబడ్డాను” అన్నాడు కబీరు.
“దీనికి అర్ధం చెప్పు” అడిగాడు సికిందర్. “మహారాజా చూడు ఈ భూమి సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఎలా తిరుగుతున్నాయో చూడు.
ఈ దృశ్యమంతటిని బహు సూక్ష్మ సూది బెజ్జమంతటి ఈ కనుపాప చూడగలగడ మొక వింత కాదా! ఎన్ని ఏనుగులు, ఒంటెలు, లక్షలాది జంతుజాలం” అన్నాడు కబీరు. కబీరు చమత్కృతికి ప్రభువు సంతసించాడు.
కబీరు గురువు రామానందుడని చెబుతారు. ఆ గురు శిష్యుల పలుకులను శిక్కుల మత గ్రంథమైన గురుగ్రంథ సాహెబ్ లో చోటుచేసుకున్నాయి.
కబీరు సాహిత్యం వేమన పద్యాలవలె, తుకారాం అభంగాలవలె మనుజుల హృదయాలలోనికి సూటిగా పోతుంది.
సాయి అన్నదానం చేసేవాడు. కబీరు అంతే.
“రామా! నాకు రోజు శేర్ల గోధుమ పిండి, గిద్దెడు నూనె సమకూర్చు, నా ఇంటి వారు, నా ఇంటికొచ్చేవారు తృప్తిగా భుజించాలి. నా ప్రార్ధనను విస్మరించి నన్ను దొంగను చేయకు” అని రాముని ప్రార్ధించేవాడు.
రాముడు తక్కువ వాడా? కబీరును, అతని కుమారుడైన కమాలును తోడుదొంగలుగా చేశాడు. ఐతే, చివరకు విడిపించింది కూడ ఆ దైవమె!
ఒకసారి కబీరు కాశీ మహారాజు కొలువులో ఉన్నాడు. దర్బారు జరుగుతోంది. ఉన్నట్టుండి కబీరు తన కమండలంలోని నీటిని కొంచెం నేలపై పోశాడు.
“కారణం ఏమిటి?” ప్రశ్నించాడు రాజు. “పూరీ జగన్నాధుని వంటవాని బట్టలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అతని శరీరం కాలబోతుంటే, ఆ మంటలను ఈ నీటితో ఆర్పాను” అన్నాడు కబీరు.
కాశీ మహారాజుకు అనుమానం కలిగి పూరీకి మనుష్యులను పంపాడు. కబీరు చెప్పినది నిజమే అని తెలిసింది.
కబీరు పోస్టల్ స్టాంపును అక్టోబరు 1, 1952లో భారత ప్రభుత్వం విడుదల చేసింది.
నేడు అక్టోబరు 1. కబీరును ఆయన మాటలలోనే స్మరిద్దాం!
“కలలోనైనా ఒక వేళ ఎవరన్నా రాం అంటే నా చర్మం అతనికి చెప్పులు చేయటానికి ఇస్తాను!”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి సామ్రాజ్యం … .మహనీయులు – 2020… అక్టోబరు 7
- కబీరు – సాయి…..సాయి@366 జూన్ 30…Audio
- దేహమే దేవాలయం …. మహనీయులు – 2020… మార్చి 10
- కాశీలో రామ నామం! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 4
- శ్రమ విలువ…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments