Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు ప్రసాద్. మేము హైదరాబాద్ దోమలగూడ లో ఉంటున్నాము. నేను చిన్నప్పటి నుండి శివ పూజలు, సుబ్రమణ్య స్వామిని కొలుస్తుండేవాడిని.
నేను పెద్దవాడిని అయ్యాక నాగపూర్ లో ఉద్యోగం లో చేరాను. కొద్ది రోజుల తర్వాత మా నాన్న గారిని నా తోటివాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు ఎప్పుడు పెళ్ళి చేస్తావు అంటూ అడిగాను.
అనుకోకుండా మా పెద్దమ్మ గారి అబ్బాయి మరదలిని నేను చూడడానికి వెళ్ళటం ఆమె నాకు నచ్చటం జరిగింది. ఆమె బాబా భక్తురాలు. తను షిరిడి వెళ్ళి వచ్చాక మా వివాహం జరిగింది.
పెళ్ళి అయిన తర్వాత కొంత కాలానికి ఆఫీస్ తరపు నుండి నాకు నాగపూర్ నుండి బొంబాయి వెళ్ళటానికి అవకాశం వచ్చింది.
నేను బయలుదేరుతుంటే మా ఆవిడ నేనూ వస్తానంది. అక్కడి నుండి శిరిడి దగ్గర కాబట్టి వెళదాం అనుకుని ఇద్దరం వెళ్ళాము. ఇది 1995 లో జరిగింది.
అప్పటి శిరిడి నాకు చాలా చికాకు కలిగించింది. ఎక్కడ చూసినా పందులు, బురద. అదంతా చూసి నేను చాలా అసహ్యించుకుని నేను ఇంకెప్పుడూ శిరిడికి రాను, అని అనుకున్నాను.
లైన్లో బాబా దర్శనానికి వెళ్ళాము, మా ఆవిడ దండం పెట్టుకుంటుంది, నేను ఎదో మొక్కు బడి గా దండం పెట్టాను. తిరిగి వచ్చేసాము.
ఆ తర్వాత మాకు బాబు పుట్టాడు. మా బాబుకి పది సంవత్సరాల వయస్సు వచ్చేదాకా నేను శిరిడికి వెళ్ళలేదు.
2004 సంవత్సరంలో నేను తిరిగి ”శిరిడి” లో అడుగుపెట్టాను. అప్పుడు ఖండోబా గుడికి వెళ్ళాలనిపించింది.
ఎందుకంటే ”బాబా అక్కడ మొదటిసారి శిరిడికి పెళ్లిబృందంతో వచ్చినప్పుడు గుర్రం బండిలోనుంచి దిగాడు” అంటూ మా పిల్లలకి మా ఆవిడ చూపించాలి అని అక్కడికి వెళ్దాం అంది.
అప్పటికి మాకు పాప కూడా పుట్టింది. సరే అని అనుకుని బయలుదేరాం.
దారిలో మాకు ఒక ముసలాయన కనపడ్డాడు. మాకు నిజంగా ఆ ఖండోబా గుడి ఎక్కడో తెలియదు. మేము ఆ ముసలాయనను ఖండోబా గుడి ఎక్కడా? అని అడిగాము. ఆయన మా ఆవిడ్ని బాగా తిట్టడం మొదలుపెట్టాడు.
ఆయన అలా ఎందుకు తిట్టాడో మాకు అర్ధం కాలేదు. ఆ ముసలాయన నోట్లో కిళ్ళి నములుతున్నాడు.
ఆయన మాట్లాడుతుంటే ఆయన నోట్లోంచి తుంపరలు మా ఆవిడ మీద పడుతున్నాయి. (నా మీదా పడ్డాయి కానీ, మా ఆవిడ మీద ఎక్కువగా పడ్డాయి).
బాగా తిట్టాక ఇంకా కోపంగానే ”మీ అబ్బాయిని నువ్వు కొడుతున్నావు, అతన్ని అలా కొట్టకు” అన్నాడు. సరే కొట్టను అంది మా ఆవిడ.
”కొట్టవు కదా!” అన్నాడాయన కోపంగానే. ఈ లోగా మా పాప చిన్నది, రోడ్డు పైకి అలా వెళ్ళిపోయింది, దాన్ని తీసుకురావటానికి నేను వెళ్ళాను, మళ్ళీ వెనక్కి చూసేసరికి మాకు ఆ ముసలాయన కనపడలేదు.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మేము ఇద్దరము మొదటి సారి షిరిడికి వచ్చినప్పుడు, అప్పుడే తను నెల తప్పినట్లు తెలుసుకున్నాము.
అందుకే బాబాయే మాకు కనపడి ”మీ వాడు ఇక్కడే ప్రాణం పోసుకున్నాడు”, కాబట్టి వాడ్ని జాగ్రత్తగా చూడండి అంటూ చెప్పారు కాబోలు.
ఖండోబా దర్శనం, ద్వారకామాయి దర్శనం అయిన తర్వాత అప్పుడు మేము సమాధి మందిరం దర్శనం కోసం వెళ్ళాము.
బాబాను చేసేసరికి ఆయన నన్ను చూసి నవ్వుతున్నట్లు ‘‘ఎరా! వచ్చావా పది ఏళ్ళు పట్టిందా మళ్ళీ రావడానికి” అని అన్నట్లుగా అనిపించింది.
మా ఆవిడకి పిల్లలకి కూడా అలాగే అనిపించిందట. అప్పటి నుండి మాకు బాబా మీద గురి కుదిరింది.
నాకు నాగపూర్ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి బెంగుళూర్ కి ట్రాన్ఫర్ అయ్యింది. అక్కడి నుండి శిరిడి కి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో నాకు తెలియదు.
ఏవో మాట్లాడుతూ మా బావమరిదిని అడిగితే ”ఏముంది బావగారు! ”దోండ్” లో దిగితే మీరు చాలా ఈజీగా శిరిడి కి చేరుకోవచ్చు” అని చెప్పాడు.
సరే అంత బావమరిది చెప్పాడుగా అనుకుంటూ మేము పిల్లలతోటి బయలుదేరి తెల్లారేసరికి దోండ్ లో దిగాము.
అది అంత ఎడారిగా వుంది, జనం ఎవ్వరూ లేరు, ఎవరైనా బెదిరించి మాకు ఏదైనా హాని చేస్తారేమో అని నేను భయపడుతున్నాను.
అటువంటి భయం మనసులోకి రాగానే నేను నా బావమరిదిని తిట్టుకున్నాను.
తెలిసి చెప్పాడో, తెలియకుండా చెప్పాడో తెలియని వాడు అయితే ఊరుకోవాలి గాని ఇలా ఎందుకు చెప్పడం. ఇప్పుడేం జరుగుతుందో ఏమిటో? అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం బస్సు ఇక్కడికి వస్తుందో లేదో అంటున్నాను.
ఈ లోపులో ఒక ముసలాయన ”ఇలా రా ఇక్కడ నిలబడు” అంటూ మాకు అర్థమయ్యేటట్లు మరాఠీ భాషలో చెప్పాడు.
సరేనని అక్కడ నిలబడి ఉన్నాం. ఎంత సేపైనా బస్సు రావటం లేదు. మా పిల్లలు ఆకలేస్తోంది అంటున్నారు.
ఈ లోపు మరో ముసలాయన అక్కడికి వచ్చారు. ”శిరిడి” వెళ్తున్నారా అని అడిగాడు. అవును అన్నాను.
పిల్లల్ని చూస్తూ ఆకలేస్తోందా అని అన్నారు, అవును అన్నాను, అన్నీ బస్సులోనే దొరుకుతాయి, బస్సు వస్తుంది అన్నారు.
ఈ లోపు బస్సు రావటం, మేమా బస్సు ఎక్కడం రెండు జరిగిపోయాయి.
బస్సులో పెద్దగా జనం లేరు, కాసేపటికి అహ్మద్ నగర్ వచ్చింది, సమోసాలు బస్సులోకి అమ్మకానికి వచ్చాయి.
అందరం ఆ సమోసాలు కొనుక్కుని, తిని ఆకలిని చల్లార్చుకున్నాము. ఆ సమోసాలు చాలా రుచిగా ఉన్నాయి.
ఆ తర్వాత ఆ దారిలో ఎన్ని సార్లు వెళ్ళినా సమోసాలు దొరకలేదు. కానీ మేము ఆ రోజు వేడి వేడి సమోసాలు తిన్నాము.
అప్పటినుండి మా కుటుంబం సభ్యులు నలుగురం కాస్త ఐదుగురం అయ్యాము బాబాతో కలిపి.
అప్పటి నుండి బాబాకి చెప్పి బయటికి వెళ్ళటం, ఇంట్లో హారతులు ఇవ్వటం చేస్తున్నాము .
ఒకసారి మా అబ్బాయి డాబా మీద ఆడుకుంటున్నాడు, మా ఆవిడ బాబాకి హారతి ఇస్తోంది, ఇంతలో మా అబ్బాయి ”అమ్మా! అమ్మా!” అంటూ కిందకి దిగి వచ్చి ”అమ్మా, నేను బాబాని చూసాను” అని అన్నాడు.
వాళ్ళ అమ్మ తెల్లబోయి చూస్తుంటే ”నిజం అమ్మా, బాబా మన ఇంట్లోకి రావటం నేను కళ్ళారా చూసాను అని అన్నాడు.
ఇంకా మా ఆవిడకి అర్ధం కాలేదు, జోలే ఉంది ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు అని మా వాడు చెప్తున్నాడు.
ఈ లోగా నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను, విషయం తెలిసి నాకు ఆశ్చర్యం కలిగింది.
ఆ రాత్రంతా అందరం నిద్రపోలేదు మా వాడిని నిద్రలేపి మరీ బాబా గురించి వాడు ఎలా చూసాడో, ఎలా ఉన్నాడో ఆ వివరం మేము అడుగుతూనే ఉన్నాము వాడు చెబుతూనే ఉన్నాడు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- ” మా వస్తువులు మాకు దొరక్కపోయినా ఫర్వాలేదు, మా బాబా మాకిక్కడున్నాడు”
- మా బాబుకు ప్రాణ బిక్ష పెట్టిన బాబా వారు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్న మామయ్య మనసు మార్చి, మా కుటుంబ ఇలవేల్పు అయినా బాబా వారు.
- బాబా రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే మా ప్రయాణాన్ని ఆపి కాపాడారు..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments