Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి బొంబాయిలో మా ఆఖరి అల్లుడికి ఏదో ఆఫీస్ పని ఉందంటూ బయలు దేరాడు.
మా అమ్మాయి దాని కొడుకు కూడా అతనితో పాటు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు.
అక్కడ నుండి శిరిడికి వెళ్ళవచ్చనే ఆశతో నేనూ వాళ్ళతో పాటు బయలుదేరాను.
బొంబాయి వెళ్ళాక అక్కడ రెండు రోజుల పాటు ఒక టాక్సీ మాట్లాడుకొని ఊరంతా తిరిగి చూస్తూ, షాపింగ్ కోసం ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపి ( మా అల్లుడికి కొంచెం షాపింగ్ పిచ్చి ఉండటాన )
అదే రోజు శిరిడి వెళ్లాలని తెలిసి కూడా, ట్రైన్ టైం అయిపోతున్నా కూడా షాపింగ్ కి వెళ్లి 40,000 రూపాయలు విలువగల సామానులు కొనుక్కొని వచ్చి,
కార్లో పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరి కొంచెం దూరం రాంగానే, మరో షాపింగ్ మాల్ కనపడగానే, మా అల్లుడు మా హారిక ఇద్దరూ దిగి, నన్ను కూడా రమ్మన్నారు.
నేనూ కూడా వెళ్ళాను నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఉంది. ఆ టాక్సీ వాడికి మేము డబ్బులు కూడా ఏమీ ఇవ్వలేదు.
మేము 40,000 రూపాయల విలువగల సామానులు అందులోనే ఉంచి సొంత కారు దిగి వెళ్లిపోయినట్లు లోపలికి వెళ్ళిపోయాము.
ఆ టాక్సీవాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ కారులో ఇంకా మా హారిక బ్యాగ్ అందులో సెల్ ఫోన్, ఇంకా మేమారోజు వెళ్ళవలసిన శిరిడి ట్రైన్ టికెట్స్ ఉన్నాయి.
మేము కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి, మాకు విషయం అర్థం అయి బయటకి వచ్చి చూసాము. మాకు మా సామాన్లు పోయాయన్న విషయం అర్థమైంది.
మాకు ఆ టాక్సీ నెంబర్ తెలియదు, అతని పేరు తెలియదు. అది మన ప్రాంతం కూడా కాదు. మాకేమీ పాలు పోవటం లేదు.
మా హారిక సెల్ ఫోన్ పోయిందని, శిరిడికి వెళ్ళవలసిన టికెట్స్ పోయాయని ఏడుస్తూ కూర్చుంది.
అప్పుడు మా అల్లుడు తన దగ్గర క్రెడిట్ కార్డు ఉందని, రైలు కాకపోతే బస్సులో శిరిడికి వెళదామని దానిని ఓదారుస్తున్నాడు.
ఆ చుట్టు పక్కల షాపుల వాళ్ళు విషయం తెలుసుకొని, వాళ్ళకి తోచిన సలహా వాళ్ళు ఇస్తున్నారు. నేను బాబాని తలచుకుంటూ అడుగులు వేస్తున్నాను.
మా అమ్మాయి అల్లుడు ముందు నడుస్తున్నారు. నేను బాబాని వేడుకుంటూ ‘ బాబా 40 వేల రూపాయల విలువైన సామాను, అన్నీ పూజకి సంబంధించినవే నువ్వు ఏమీ చేస్తావో నాకు తెలియదు.
మేము నీ దర్శనానికని బయలు దేరుతుంటే ఇలా జరగడానికి వీలు లేదు బాబా ‘ అని అనుకుంటూ కిందకి చూసుకుంటూ అడుగులేస్తున్నాను.
ఇంతలో నాకు ఒక చెట్టు కింద రెండు అడుగుల బాబా విగ్రహం కనపడింది. నేను వెంటనే ” హారికా! ఇక్కడ బాబా ఉన్నాడే! ” అంటూ గట్టిగా అరిచాను.
నా అరుపుకి ఒక్కసారిగా హారిక వెనక్కి తిరిగి చూసి పరుగున వచ్చి అక్కడ బాబాని చూసి కళ్ళనీళ్ళతో బాబా ముందు మోకాళ్ళమీద రోడ్ మీద కూర్చుండి పోయింది.
దాని వెనకాలే మా అల్లుడు కూడా అక్కడికి వచ్చి బాబాని చూసి తాను కూడా కళ్ళ నీళ్లతో మోకాళ్ళమీద కూర్చుండిపోయాడు.
ఆ నిమిషాన ” మా వస్తువులు మాకు దొరక్కపోయినా ఫర్వాలేదు, మా బాబా మాకిక్కడున్నాడు” అనిపించింది.
అక్కడ వున్న వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చాలా వింతగా చూస్తున్నారు . ” ఎవరేమనుకుంటే మాకేంటి మా బాబా మాకున్నాడు ” అనుకున్నాము.
ఇంతలో మమ్మల్ని అక్కడ వదిలి వెళ్లిన టాక్సీ వాడు అక్కడికొచ్చాడు. వాడ్ని చూస్తూనే మా అల్లుడు తన జేబులోనుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి వాడి చేతిలో ఉంచాడు.
అది తీసుకొని వాడు వేరే బేరం వస్తే వెళ్లాను, మీ సామాను ఇందులో ఉండిపోయిన విషయం నేను గమనించలేదు అని సంజాయిషీ చెప్పాడు.
ఏది ఏమైతేనేమి మా సామాను మా శిరిడి ట్రైన్ టికెట్స్ మాకు చేరాయి.
మేము సురక్షితంగా శిరిడి చేరి బాబా దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాము.
The above telugu TEXT typed by : Mr. Sai Krishna (Active Devotee of Baba)
Latest Miracles:
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- బాబా అంటే ఎవరో తెలియకుండా తనని ద్వేషించుకున్న మాకు తాను ఎవరో తన మహిమ, ప్రేమ, దయ ఎలాంటిదో చూపించి మా గమ్యాన్ని మార్చిన బాబా గారు.
- మా మీద దయతో మా కుటుంబ సభ్యునిగా మారిన బాబా వారు ……!
- మన మనస్సుని గమనించే బాబా
- బాబా యే పండు ముత్తయిదువ రూపంలో కనపడి మా హారిక కోరిక తీర్చాడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments