Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా మూడవ అమ్మాయి హారిక కి కూడా అలానే అనుకోకుండానే పెళ్లి జరిగిగింది. ఇది కూడా రెండవ నెలలో నెల తప్పింది.
కొంచెం నీరసంగా ఉండేది. ఈ లోపు వాళ్ళ అత్తగారింట్లో పని మనిషి మానేసింది.
ఇంటి పని, ఇంటిల్లి పాదీ బరువైన బట్టలు అత్తగారి ప్రోద్బలంతో ఉతకవలసి రావటంతో బాగా అలసిపోయి కడుపునొప్పి వచ్చేసింది హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి గర్భస్రావం అయిపొయింది.
మా హారిక చాలా భాదపడిపోయింది. డాక్టర్ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, కొన్నాళ్ళు సంతానం కోసం ఆగమంది,
వాళ్ళు సరే అన్నారు, మూడేళ్ళ తరువాత తిరిగి ప్రయత్నాలు చేసారు. కొన్నాళ్ళు చూసి తిరిగి డాక్టర్ ని కలిసారు.
ఆవిడ ఇద్దరినీ పరీక్షించి ఏ లోపము లేదని తేల్చి చెప్పింది. ఆలా 5 సంవత్సరాలు గడచిపోయాయి.
మా అమ్మాయికి దిగులు రోజు రోజుకి పెరిగిపోయి ఎప్పుడూ ఎదో పోగుట్టుకున్నట్లుగా, దిగులుగా దేనిమీదా ఆసక్తి లేకుండా తయారయ్యింది.
నేను రోజూ బాబాకి దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఉన్నట్టుండి ఒక రోజు మా అల్లుడు శిరిడికి వెడదామా అంటూ మా హారికని తీసుకొని రెండు రోజులు సెలవు పెట్టి ఇద్దరూ బయలుదేరి శిరిడి వెళ్ళారు.
బాబా దర్శనం చేసుకొని మా హారిక బాబా ముందు బాగా ఏడ్చేసిందట. తిరిగి ప్రయాణమై వచ్చేటప్పుడు ఒక బస్టాండులో ఇద్దరూ నిలబడి ఉంటే, ఒక పండు ముత్తయిదువ మా హారికనే చూస్తుందట.
హారిక కూడా ఆవిడను చూసిందట. ఎంతసేపైనా ఆవిడ అలానేచూస్తుందట, ఓహో! నాకు పిల్లలు లేకపోవడం మూలానే ఆవిడ నన్నలా చూస్తుంది కాబోలు అని అనుకుందట మా హారిక.
ఇలాంటి ఆలోచన రాంగానే ఇది మొహం పక్కకు తిప్పుకుందట. కాసేపు ఆగి హారిక మళ్ళీ ఆవిడ కోసం చూసిందట.
ఈసారి ఆవిడ దీన్ని దగ్గరగా రా అని పిలిచిందట. ఈవిడ ఎవరు నన్ను పిలుస్తుంది, సరే ఏమిటో కనుక్కుందామని దగ్గరకి వెళ్లిందట.
” ఏమ్మా! నీకు సంతానం లేదా? ” అని అడిగిందట ఆవిడ. దీనికి ఇంక దుఃఖం ఆగటంలేదు.
” పెళ్లి అయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎక్కడి నుంచి వచ్చారు? ” అని అన్నీ అడిగి తెలుసుకొని ” మీరు ఒక పని చెయ్యండి చిత్తూరు జిల్లాలో మదనపల్లి కి దగ్గరలో ఒక గ్రామం వుంది.
ఆ గ్రామం పేరు చెర్లో పల్లి. అక్కడ రెడ్డమ్మ కొండ అనే ఒక కొండ, ఆ కొండ మీద రెడ్డమ్మ అనే దేవత ఉంది.మీరు అక్కడికి వెళ్లి ఆ దేవతకి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టండి అని చెప్పి,
ఆ మరో సంగతి మీకు కలగబోయే సంతానానికి మీ కులం ఏదైనా రెడ్డి పేరు కలపండి అని దూరంగా నిలబడ్డ మా అల్లుడిని కూడా పిలిచి మరీ ఈ విషయం చెప్పిందట “.
అంతే వెంటనే వీళ్ళు హైదరాబాద్ రావటం మానేసి, సెలవు సంగతి కూడా ఆలోచించకుండా శిరిడి నుండి తిన్నగా తిరుపతి బస్సు ఎక్కి తిరుపతి నుంచి మదనపల్లి వెళ్లి, అక్కడనుంచి చెర్లోపల్లి వెళ్లేసరికి మరునాడు మధ్యాహ్నం 12 గంటల సమయం అయిందట
వీళ్ళకి ఒక పూజారి ఎదురువచ్చి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడట. వీళ్ళు అమ్మవారి దర్శనం కోసం వెళుతున్నామని చెప్పారట.
దానికి అయన గుడి మూసేసాము. ఇంక ఇప్పుడు పూజలేవి చెయ్యటం కుదరదు.
మీరు మెట్లు ఎక్కి వెళ్లి బయట నుండే అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడే షాప్ లో కొబ్బరికాయ కొని కొట్టండి అని చెప్పి, సైకిల్ దిగి దగ్గరకి వచ్చి వీళ్ళని తొందరలోనే మీ కోరిక ఫలిస్తుంది అని దీవించి, సైకిల్ మీద వెళ్ళిపోయాడట.
వీళ్ళు వెళ్లి అక్కడ బయట నుండే అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి తిరిగి హైదరాబాద్ వచ్చేసారు.
అక్కడ నుండి వచ్చిన రెండు నెలలకే మా హారిక నెల తప్పింది.
ఆ బాబా యే పండు ముత్తయిదువ రూపంలో కనపడి మా హారిక కోరిక తీర్చాడు.
The above telugu TEXT typed by : Mr. Sai Krishna (Active Devotee of Baba)
Latest Miracles:
- ” మా వస్తువులు మాకు దొరక్కపోయినా ఫర్వాలేదు, మా బాబా మాకిక్కడున్నాడు”
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- మా మీద దయతో మా కుటుంబ సభ్యునిగా మారిన బాబా వారు ……!
- బాబా వారు, డాక్టర్ అవినాష్ రూపంలో వచ్చి మా రాతలను మార్చారు.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments