బాబా వారు, డాక్టర్ అవినాష్ రూపంలో వచ్చి మా రాతలను మార్చారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


2007 వ సంవత్సరంలో మా ఆవిడకి ఏదో బలహీనత వల్ల కంటినరాలు దెబ్బతిని చూపు మందగించి,  తరువాత కనపడకుండా పోయింది.

కాకినాడలో మొత్తం మూడు హాస్పిటల్ లో చూపించాను. కేట్రాక్టు కాకపోయినా కేట్రాక్టు అని ఆపరేషన్ చేసారు. క్రమంగా చూపు పూర్తిగా తగ్గిపోయింది.

UVITIS అన్నారు. దానికీ ట్రీట్మెంట్ చేసారు, ఏ గుణం కనపడలేదు. L . V .ప్రసాద్ హాస్పిటల్, హైదరాబాద్ ప్రతి మూడు నెలలకి వెళ్ళి రావటం చేస్తూ వచ్చాము.

కానీ ఏ మందులు వాడినా, ఎటువంటి గుణం కనపడలేదు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ రెండు రోజులో, నాలుగు రోజులో ఏ చుట్టాలింట్లోనో ఉండటం ఇబ్బందిగా మారింది.

అందుకని ఆ హాస్పిటల్  వైజాగ్ లో ఉంటే అక్కడికి రాసిమ్మని, అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్పి అక్కడికి మార్పించుకున్నాము.

మా ఆవిడ చాలా కష్టపడుతుండేది.  ఆవిడ కష్టం మాకు చాలా బాధగా ఉండేది. వైజాగ్ లో L V ప్రసాద్ హాస్పిటల్ కి మార్పించాము.

మేము రోజూ బాబాకి మొక్కు కుంటూనే ఉండే వాళ్ళము. నా కంటే ఎక్కువ నా భార్య ”నాకేమి అవ్వదు, బాబా ఉన్నాడు, మనల్ని చూస్తూనే ఉంటాడు, మీరు అనవసరంగా కంగారు పడకండి” అని నాకే ధైర్యం చెబుతూ ఉండేది.

వైజాగ్ లోనూ మా ఆవిడని డాక్టర్ అవినాష్ పరీక్షించి టెస్టులు చేసి, అప్పటిదాకా జరిగిన ట్రీట్మెంట్ అంతా పరిశీలించి, ” ఇప్పటి దాకా మీ కంతా తప్పు ట్రీట్మెంట్ జరిగింది.

ఆ డాక్టర్ ఏమనుకున్నారో ఇప్పటి దాకా వాడిన మందుల వల్ల ఈ విధంగా మారింది. దాని వల్ల మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు,

మీరు కొంచెం ”ఓర్పు, సహనం’తో ఉంటే తప్పక చూపు వస్తుంది, ఏమి ఫరవాలేదు, కంగారు పడకండి” అన్నారు.

రెండు కళ్ళకి ఇంజక్షన్ ఇవ్వాలి, ఇప్పుడు ఒక కంటికి ఇస్తాను, కొన్ని రోజుల తరువాత మరో కంటికి చేయించుకోండి అని ఒక కంటికి ఇంజెక్షన్ చేసాడు.

ఒక్క ఇంజక్షన్ కే ఆ కన్ను కొంచెం కనిపించడం మొదలుపెట్టింది. కాస్త కనపడుతోంది కదా అని మరో కంటికి ఇంజక్షన్ చేయించుకోవడంలో కొంచెం అశ్రద్ధ చేసాము.

ఒక రోజు హాస్పిటల్ కి వెళ్ళేటప్పటికి డాక్టర్ అవినాష్ ఉన్నాడు, కళ్ళు టెస్ట్ చేసి నేను రెండు కళ్ళకి ఇంజక్షన్ చేయించాలని చెప్పాను, రెండో కంటికి ఇంకా ఎందుకు చేయించలేదు? నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను.

వెళ్ళాక ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, రేపు ఉదయం తప్పని సరిగా వచ్చి ఇంజక్షన్ చేయించుకోండి, కొంచెం కనపడుతుంటే చాలా? పూర్తిగా చూడవద్దా? అలా చేస్తే ఎలా? అంటూ మమ్మల్ని బాగా చివాట్లు పెట్టారు.

ఆయనకీ చాలా కోపం వచ్చింది. అంతే మర్నాడే ఇంజక్షన్ చేయించాము. ఆ తరువాత బాబా దయ వలన చూపు పూర్తిగా వచ్చేసింది. అంతా బాబా దయ.

హైద్రాబాద్లో చుట్టాలింటికి మొదట్లో ప్రతి వారం, తరువాత 15  రోజులకొసారి, ఆ తరువాత నెలకొసారి, ఆ తరువాత మూడు నెలలకొసారి ఇలా కొన్నాళ్ళు గడిచింది.

వైజాగ్ వచ్చాక Dr . అవినాష్ రూపంలో బాబా వచ్చి మా రాతలు మార్చాడు

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “బాబా వారు, డాక్టర్ అవినాష్ రూపంలో వచ్చి మా రాతలను మార్చారు.

Sai Baba

బాబా వారి సర్వజ్ఞతకి ఈ లీల నిదర్శనము. మనకి ఏ డాక్టర్ అయితే సరిగా వైద్యం చేయకలుగుతారో వారినే ఆ సమయానికి అందుబాటులో ఉంచుతారు.

Sai Baba

We all know that Baba is a omnipresent and omniscient. Baba set the doctor, is only available who can treat us properly

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles