సాయి కృపతో షుగర్ కంట్రోల్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: నిడిగొండ జనార్దన్ సులోచనాబాయి

నివాసం: హైదరాబాద్

నియా కరా చారని ఠెవిలామదా! పరిసానీ వినంతా మాఝే పండరినాథా !

చేతులు జోడించి నీ పాదాలపై నా శిరస్సు ఉంచాను. ఓ సద్గురునాథా నా ప్రార్ధననుమన్నిస్తూ నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్న ఓ శిరిడినాథ నీకు నా మనః పూర్వకమైన కృతజ్ఞతా సుమాంజలి.

సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు నిడిగొండ జనార్దన్ సులోచనాబాయి. మాది యాదగిరి గుట్ట దగ్గర రాజపేట్.

ఇప్పుడు నా వయస్సు 75 సంవత్సరాలు. నేను హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం రాంనగర్లో ఉంటున్నాను.

ప్రతి రోజు హారతులకు హాజరవుతాను. బాబా గారి దయవలన  నాకు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాలేదు.

ఇది కేవలం ఆయనకు నాపైన, నా కుటుంబం పైన ఉన్న కృప “సాయి కృప” మాత్రమే.

ఈ మధ్యనే అనగా జనవరి 2017 లో నా భార్యకు అనుకోకుండా అనారోగ్య పరిస్థితి ఎదురైంది. హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. వారం రోజులు అయినా షుగర్ తగ్గట్లేదు. “480” షుగర్ చూపిస్తుంది.

డాక్టర్ లు రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్ లు ఇవ్వాలి అన్నారు. ఇది తప్పదు తనకి ఇక షుగర్ కంట్రోల్   కావట్లేదు అన్నారు.

నేను బాబా దగ్గరికి వెళ్లి హారతి సమయంలో బాబాకు చెప్పుకున్న.

బాబా నాకు ఇంజక్షన్ లు ఇవ్వడం రాదు. డాక్టర్లేమో నా భార్యకు మూడు పూటలా ఇన్సులిన్ ఇవ్వాలంటున్నారు. ఏంచేస్తావో నాకు తెలియదు.

బాబా నువ్వే చూసుకో! ఈ వయసులో నా భార్య హాస్పిటల్ లో ఉండి బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్న నువ్వే చూసుకో అని మనస్ఫూర్తిగా నా మనసులోని బాధను ఆ సాయిశ్వరుడికి చెప్పుకున్నా.

అదే రోజు రాత్రి తెల్లవారు జామున నాకు ఒక స్వప్నం వచ్చింది.

బాబా గారు కాషాయ వస్త్రాలు ధరించి, భుజముకు జోలె సటకాతో నా దగ్గరకు వచ్చారు. బాబా దగ్గరకు వెళ్లి నమస్కారం చేశా,

బాబా “ఏం బాధపడకు నీ భార్యకు ఏమి కాదు. ఏదో కర్మఫలం అనుభవిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా! దిగులు పడకు” అని చెప్పి మాయం అయ్యారు.

అంతలోనే మెలుకువ వచ్చింది. హాస్పిటల్ కు వెళ్ళాను బాబాను స్మరించుకుంటూనే, ఆశ్చర్యం ఏమిటంటే నా భార్య షుగర్ 480 నుండి 180  కు వచ్చేసింది.

డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం ఒక్క రోజులో ఇది ఎలా జరిగింది అని. అంతా ఆయన   “కృప” కల్లోకి వచ్చి తన మాటను తాను నిరూపించుకున్నారు.

ఇప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా లేకుండా నా భార్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ వయసులో ఆరోగ్యం కన్నా ఇంకా ఏం కావాలి. బాబా ఆరోగ్యంను డాక్టర్ గా నాకు అందిస్తూ నాకు తోడుగా, నీడగా ఉన్నారు.

     ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

“ఆమెకి నాకు మూడు జన్మల  బంధం ఉంది. అందుకే ఆమె తెచ్చిన భోజనం నాకు అంత ప్రియమైనది”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles