Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
సుభాష్ గంగాధర్, సాయి క్లినిక్, జగదని…
కీ:శే: మా తండ్రిగారైన శ్రీ గంగాధర తుకారాం జగదని(గురూజీ) అక్టోబర్, 11 .1918 రాహురిగ్రామం, అహమ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్రలో జన్మిచారు. చెప్పుకోదగ్గ విషయమేమంటే మా తండ్రిగారు జన్మిచిన ఐదవరోజు అనగా అక్టోబర్ 15, 1918 లో బాబా మహాసమాధి చెందారు.
1940 వ సం:లో యువకుడైన మా నాన్న గారు ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా శిరిడిలో నియమించబడ్డారు. ఇది నిజంగా సాయిలీలే.
బాబా గారు తన భక్తుడిని భక్తి అనే తాడుతో కట్టి తన పాదాల చెంతకు లాక్కున్నారు. బాబా భక్తిలో లీనమై అలాగే చూస్తున్న మా నాన్నగారికి ఎంత సమయం గడిచి పోయేది కూడా ఆయనకు తెలిసేది కాదు.
ఒకరోజు పాఠశాలలో మీటింగ్ లో వున్న మా నాన్నగారి చూపు గోడమీద గల బాబా మోకాలు ముడుచుకొని కూర్చున్న ఫోటో మీద పడింది.
ఆయనకీ చాలా రోజుల తర్వాత బాగా తెలిసిన వ్యక్తిని చూసినట్లు అనిపించింది. నిస్తేజమైన మనస్సులో ఆలోచనలు మొదలయ్యాయి. మీటింగు అయిపొయింది. మరియూ మా నాన్నగారికి తన చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి. కలలో వారు పశువులను మేపడానికి తీసుకొని వెళ్లారట. అప్పుడు ఎవరో ఒకాయన దగ్గరకు పిలిచి బడిలో కూర్చోపెట్టుకొని రెండుపైసలు ఇచ్చి ముద్దుపెట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు సాయి బాబానే. ఈ కాలే మా నాన్నగారి జీవితంలో మార్పును తెచ్చింది.
అప్పటి నుండి బాబాతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధమే మా నాన్నగారి జీవితంలో ఒక భాగమైంది.
అబ్దుల్ బాబా , చోటే బాబా, అమీరుశక్కర్ మొదలైన బాబాతో ప్రత్యక్ష సాన్నిహిత్యంగల భక్తుల యొక్క సత్సంగము, సాయి ప్రేమ యొక్క అర్ద్రత సద్గురువుకు చేరువగుట, వీటన్నిటి ద్వారా మా నాన్న గారి జీవితం సాయి లీలలతో ప్రకాశింపబడింది.
మా నాన్న గారు కేవలం సాయి కరుణ యొక్క బలంతో జీవితం యొక్క కష్టాల మధ్యలో కూడా ఉన్నతమైన మనస్సుతో ఉన్నతమైన జీవితం జీవించారు.
ఉదయం కాకడ ఆరతి, రాత్రి శేజ్ ఆరతి, ఉదయం సాయంత్రం సాయిసచ్చరిత్ర పారాయణ చేసేవారు. ఇదే సంస్కారం మా పదిమంది కొడుకులతో నరనరాలలో,రక్తంలో ప్రవహిస్తోంది.
చూస్తూ ఉండగానే బాబా భక్తిలో లీనమైన మా నాన్నగారు పెద్ద వారైపోయారు.
1975 లో మా నాన్నగారు పదవీవిరమణ చేశారు. తరువాత వంద సాయిభజనాలను పూలమాలాగా (పుస్తకంగా) తయారు చేశారు.
ఈ భజనాలన్నీ బాబా ద్వారా ఇవ్వబడిన ఆధ్యాత్మిక మార్గానికి ఖజానా. సాయిభజనలలో మునిగిన మా నాన్నగారికి సాయి భజన లేకపోతె అన్నము రుచించదు. ఆయన పరిపూర్ణమైన సాయిభక్తులైనారు.
గురువారం 5 -11 -1992 వేకువఝామున 5 గంటలకు సాయిభజన పాట పాడుతూ పాడుతూ సాయి పాదాల చెంత చేరారు.
ఆ సంవత్సరం శ్రీరామనవమి నుండి మా నాన్నగారి స్మృతి చిహ్నంగా ‘సాయి ప్రభమండల్ రాహురి’ అనే సంస్థను స్థాపించి రాహురి నుండి సాయి పల్లకిని శిరిడీ వరకు తీసుకొని వచ్చే కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుచున్నది.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా జీవితం సాయి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది – విక్రం
- సాయి సేవకే నా పూర్తి జీవితం …..!
- సాయి కృపతో షుగర్ కంట్రోల్
- శ్రీ సాయి కృపతో వివాహము–Audio
- మాతాజీ జీవితం లో మరో ఆణి ముత్యం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments