Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
కీర్తిశేషులైన మా నాన్నగారు బల్వంత్ సి.కొహూజ్కర్ మామ్లత్ దార్ గా రిటైరయ్యారు.
మా నాన్న 1911లో శిరిడీ వెళ్లి బాబాను దర్శించారు.
బాబా ఆయన పిత్రువాత్సల్యంతో ఆదరించారు.
బాబా ప్రేమగా మా నాన్న వీపుతట్టి “మఠంలోనే(శిరిడీలోనే)ఉంటావా?” అని అడిగారు.మా నాన్న శిరిడీలో సుమారు వారంరోజులు గడిపారు.
సెలవు తీసుకొనేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు “నీవు ఎక్కడికైనా వెళ్ళు.నేను నీ వెంటే ఉంటాను”అని అన్నారు.
అప్పటినుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు.కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు.అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు.మా నాన్న ఒక్కసారి మాత్రమె శిరిడీ వెళ్ళారు.
1911లో మా నాన్న శిరిడీలో ఉన్నప్పుడు దత్తజయంతి వచ్చింది.
ఆరోజు సాయంత్రం సుమారు ఐదుగంటల సమయమప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చోని ఉన్నారు.
ఉన్నట్టుండి బాబా “నాకు ప్రసవ నొప్పులోస్తున్నాయి,బాధభరించలేకుండా ఉన్నాను.నేను ప్రసవించబోతున్నాను!” అన్నారు.
బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయమాతతో తాదాత్మ్యం చెంది ప్రసవవేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమైంది.
సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరిని బయటికి వెళ్ళమని ఆదేశించారు.భక్తులందరూ బయటికి వెళ్ళారు.
కొంతసమయం గడిచిన తరువాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు.
ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు.
అప్పుడు భక్తులందరూ లోనికి వెళుతుండగా,మా నాన్న మాత్రం వేరుగా మసీదు లోపలికి వెళ్ళారు.
అక్కడ బాబా గద్దపై బాబాకు బదులు మూడు శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు.
ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది.తిరిగి చూసేసరికి బాబా యథారూపంలో కఫ్నీదారియై కనిపించారు.
పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యాసమయంలోనే! ఇది చూసిన తరువాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనైవుంటారో ఊహించవచ్చు.
ఆయనకు బాబా దత్తస్వరూపులని నిదర్శనం దొరికింది.
తరువాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు,ఊది తీసుకొని రోడ్డుకు,మసీదుకు మధ్యనున్న వీధులు,ఇళ్ళు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరాడు.
అప్పుడు మా నాన్న మదిలో,బాబాను చూడటం ఇదే చివరిసారవుతుందేమోననే తలంపు వచ్చింది.“మరొక్కసారి వారిని చూస్తే బాగుండును కదా!”అని కోరుకుంటూ లెండీ కంచె నుండి తొంగిచూస్తే బాబా ముఖం కనిపించింది.
అద్భుతాలలోకెల్లా అద్భుతం! బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు.
బాబా తనతోపాటుగానీ,తనను అనుసరించిగానీ రాలేదు.
అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరమున్న లెండీ వద్ద బాబా రూపం కనిపించింది.మా నాన్న బాబాను చూడటం అదే చివరిసారి.
అందుకే బాబా మా నాన్నతో “వెళ్తున్నావా? మంచిది,వెళ్ళు “అన్నారు.
అప్పుడు నేను మా నాన్నతో శిరిడీ వెళ్ళలేదు కానీ పై అనుభవాన్ని ఆయన నాకు,మరికొందరికి చెప్పాడు.
బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే.చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకొని ఉండేవాడిని!అప్పటినుండి నా చదువులో,జీవితంలో అంతా మంచే జరిగింది.
తరువాత ఆ ఫోటోను మా చెల్లికిచ్చాను.నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను.
1903లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది.నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్ళనుకొని ఫినాయిల్ ను త్రాగేసాను.ఇది ప్రమాదానికి దారితీసింది.
నాలుగు రోజులు స్పృహలేకుండా పడి ఉన్నాను.నాకు చికిత్స చేస్తున్న డాక్టరు చిష్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు.
నాలుగు రోజుల తరువాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది.
పహిల్వానులా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకొని ఉన్న గది గోడలను,నేలను బెత్తంతో కొడుతూ కన్పించాడు.
నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్థారించుకున్నాను.
1934లో నాకు శిరిడీ వెళ్లి బాబా సమాధిని,ద్వారకామాయిని దర్శించాలని ప్రేరణ కలిగింది.
శిరిడీ వెళ్లి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరమంతా విద్యుత్తు ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది.ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను.’భగవంతుడు ఇక్కడే ఉన్నాడు’అన్న భావనతో నా మనసు నిండిపోయింది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
మనం పొందేది ఏదైనా మన ప్రయత్నం వల్ల కాదు…అది కేవలం ‘అనుగ్రహం’వల్లనే-బాబూజీ
శిరిడీ నేలపై అడుగుపెట్టిన వారెవరైనా,వారి కష్టాలు కడతేరుతాయి-సాయిబాబా
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సహజ ప్రేమ తత్వంతో కాపాడుతున్న బాబా
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- నేను ఉద్యోగం కోసం వెతికి వెతికి, ఇంక ఒక్కసారి శిరిడీ వెళ్దాం అనుకున్నాను. డబ్బులు వాళ్ళను, వీళ్ళను అడిగి తెచ్చుకొని వెళ్ళాను.
- మా అమ్మ నాన్న హ్యాపీ గ ఉంటేనే కదా నేను హ్యాపీ గ ఉంటాను.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments