సహజ ప్రేమ తత్వంతో కాపాడుతున్న బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: పవన్

నివాసం: హైదరాబాద్

సాయి బంధువులకి నమస్కారం. నా పేరు పవన్. బాబా లీలను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.

మేము చిన్నపుడు మా నాన్న ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. చాలా తక్కువ జీతం వచ్చేది.

మా తల్లిదండ్రులకి మేము నలుగురు పిల్లలము. అయినా గాని మా నాన్న ఆయనకి వచ్చే తక్కువ జీతంతోనే మా నలుగుర్ని ఎంతో కష్టపడి చాలా పెద్ద చదువులు చదివించారు.

మా అందరి చదువులు పూర్తి అయ్యేసరికి, మేము చాలా ఆర్దిక ఇబ్బందుల్లో వున్నాము. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము.

ఇంతలో మా నాన్న గారికి ఆరోగ్యములో సమస్యలు మొదలయ్యాయి. హాస్పిటల్ కి తీసుకెళ్ళితే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వున్నాయి, ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నారు.

ఆయన ఆఫీస్ కి కూడా వెళ్ళలేక (ఎంతో నొప్పితో గట్టిగా అరుస్తూ) ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

అప్పుడు నాకు ఇంట్లో పరిస్థితులు చూసి చాలా బాధ వేసింది. అప్పుడప్పుడే నా చదువు పూర్తి అయ్యింది. నాకు ఉద్యోగం కూడా లేదు.

ఇలాంటి పరిస్థితులలో మా పక్క ఇంటి వారు “సాయి లీలామృతం” పుస్తకం ఇచ్చారు.

ఎప్పటినుంచో నేను ఆ పుస్తకము చదవాలి అని అనుకుంటూ వున్నాను. కాబట్టి వెంటనే చదవడం మొదలుపెట్టాను.

ఆ పుస్తకం చదవడం అయిపోయిన వెంటనే ఎలాగైనా శిరిడీ వెళ్ళి ఒకసారి సాయి బాబా దర్శనం చేసుకోవాలి అని చాలా గట్టిగా అనిపించింది.

మా స్నేహితుడు దగ్గర 2000 రూపాయిలు అప్పుగా తీసుకొని మొట్ట మొదటిసారిగా శిరిడీ బయలు దేరాను. మూడు రోజులు శిరిడీలో వుండి అక్కడే మళ్ళీ ఇంకోసారి పారాయణ పూర్తి చేశాను.

శిరిడీ నుండి బయలుదేరుతూ మశీదు ముందు నిల్చోని బాబాను చూస్తూ కన్నీటితో వేడుకున్నాను, మా నాన్నకు ఆరోగ్యము ప్రసాదించి, నాకు మంచి ఉద్యోగము ఇవ్వమని.

నేను శిరిడీ నుండి నేరుగా ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ చేరుకొని, అక్కడే కొన్ని రోజులు వుండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొని  ఆ తరువాత ఇంటికి వెళ్ళాను.

నేను శిరిడీ వెళ్ళేటప్పటికి మా నాన్న మంచంలో వున్నారు. నేను హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న రోజు ఆఫీసుకి వెళ్ళి వస్తున్నారు.

అప్పుడు నేను ఆ విషయము అంతగా పట్టించుకోలేదు. ఏదో మందులు వాడటం వలన ప్రస్తుతానికి తగ్గిందేమో, కాని ఎప్పటికైనా ఆపరేషన్ చేయించాలి కదా, అని అనుకున్నాను. ఢాక్టర్ గారు కూడా అలానే అనుకున్నారు.

ఆ తరువాత కొన్ని రోజులకి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత చిన్నగా ఆర్దికఇబ్బందులలో నుంచి కోలుకున్నాము.

ఆశ్చర్యం ఏమిటంటే నేను శిరిడీ వెళ్ళి వచ్చినప్పటి నుంచి  ఈరోజు వరకు (15 సంవత్సరములు) మా నాన్న ఏ రోజూ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడలేదు. కొన్ని రోజుల తరువాత, డాక్టర్ గారు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు.

ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తేగాని తగ్గదన్న జబ్బు చిన్న మందులకే ఎలా తగ్గిపోయిందా అని. ప్పుడు అర్ధమయ్యింది ఆ సాయినాధుడు మా నాన్నని (ఆరోగ్యం), నాకు (ఉద్యోగం), మా కుటుంబాన్ని ఏ విధంగా కాపాడారో అని.

ఇది నా జీవితంలోకెల్లా మరిచిపోలేని సాయినాధుని లీల. ఆయన చేసిన ఈ లీలని నేను చాలా ఆలస్యంగా గమనించాను.

కాని బాబా మాత్రం ఆయన సహజమైన ప్రేమతత్వంతో మమ్మల్ని కాపాడుతూనే వున్నారు. నేను ప్రతిరోజు బాబా పూజా చేయడం మొదలుపెట్టాను.

    ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

 

“రండి బండ్లకొలది ఊది తీసుకుపోండి”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles