సాయి సేవకే నా పూర్తి జీవితం …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


2018 సంవత్సరం నాటికి బాబా మహా సమాధి పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది.

ఆ సందర్భంగా బాబాకి నేను వజ్రాలు, వైడూర్యాలు, మరకత, మాణిక్యాలు ఎలాగూ ఇవ్వలేను.

ఈ దేహాన్ని ఇచ్చిన బాబాకి ఈ గొంతు ఉన్నందుకు, నేను పాడగలిగి ఉన్నందుకు 100 గంటలు శ్రీ సాయి నామం షిరిడీలో జరపాలని నా కోరిక.

ప్రతి ఏడాది ఒక రోజు ఏకాహం షిరిడీలో ప్రస్తుతం చేస్తున్నాము, 2 సంవత్సరాలు అయింది. 2016 – 3 సంవత్సరం ఈ నెల ఫిబ్రవరి 27 న జరగనుంది.

నేను ప్రైవేట్ స్కూల్ లో పనిచేసాను, కొన్ని కారణాల వల్ల అది మానేసాను, కానిస్టేబుల్ అవ్వాలని చాలా కోరిక ఉండేది.

మా వరంగల్ గుడిలో ఒకాయన నా గురించి బాబాని అడిగారట – ”వాడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నిస్తాడుట బాబా ప్రయత్నించమంటావా?, వాడి ప్రయత్నం ఫలిస్తుందా? ” అని అడిగారట.

దానికి బాబా ”కుక్కలాగా తిరిగే ఉద్యోగం వాడికి వద్దు, నా సేవకే ఉండిపొమ్మని చెప్పు” అని బాబా అన్నారుట.

ఆ సంగతి ఆయన నాతో చెప్పాడు, అప్పటినుండి నేను ఉన్న ఉద్యోగం మానేసాను, వేరే ఏ ఉద్యోగ ప్రయత్నాలు మానుకున్నాను.

15 సంవత్సరాలు అయింది. నేను ఎవ్వరికీ ఒక్క నయా పైసా ఇవ్వనక్కరలేదు, ఎవరైనా భజనలు చేయమని పిలిస్తే వెళతాను, ఎక్కడా నేను డబ్బులు తీసుకోను.

డోలక్ నేనే తీసుకువెళతాను, మైక్ కిరాయికి తెస్తుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని బ్యాంకులో లోన్ పెట్టి మైక్ సెట్ కొన్నాను,

మైక్ కావాలంటే పెడతాను, మైక్ కి డబ్బులు కట్టే వాడిని కాబట్టి ఆ లోన్ తీరేదాకా ప్రతి ప్రోగ్రాముకి 500 రూపాయలు తీసుకున్నాను, ఇప్పుడు ఆ అప్పు తీరిపోయింది, ఇప్పుడు ఉచితంగానే చేస్తున్నాను.

ఇప్పటివరకు వరంగల్ మరియు హన్మకొండలో మాత్రమే చేశాను, ఏదైనా బాబా సేవ అయితే చాలు, ఎక్కడికైనా పోవాలని, ఎంతైనా చేయాలని అనిపిస్తుంది.

నాకు అందరిలో ఆ సాయి కనిపిస్తుంటాడు, అందుకని అందరినీ ”సాయి” అని పిలుస్తుంటాను.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles