Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భారత దేశపు ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తన చిన్నతంలో దేవరహా బాబా వద్దకు ఆయన తాతగారు తీసుకుపోయేవారు.
ఒకసారి బాల్యంలో ఉన్న రాజేంద్రుడు దేవరహా బాబాపై శ్రద్ధ ఉంచకుండా అటు, ఇటు దిక్కులు చూస్తున్నాడు. తాతగారు మందలించారు. ఆలా మందలించటాన్ని దేవరహా బాబా అంగీకరించలేదు.
రాజేంద్ర ప్రసాదును ఎప్పుడూ ‘రాజా’ అని పిలుస్తుండేవారు దేవరహా బాబా.
ఒకసారి రాజేంద్ర చిన్నతనంలో, తన తాతగారిని “ఎన్ని ఏండ్లనుండి నీవు దేవరహా బాబాను సేవిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. “నీ అంత ఉన్నప్పటి నుండి” అని తాతగారు చెప్పారు.
దేవరహా వయసు 250 ఉండవచ్చని అంచనా. దేవరహా బాబాకు అన్ని మతములు, సాంప్రదాయములు అంగీకారమే. అన్ని జీవరాసులు ఒకటే ఆయన దృష్టిలో ఆయన కన్నుల నుండి కరణ ప్రవహించేది.
అది 1989వ సంవత్సరం. ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతొంది. ఆ సందర్భంలో ఎందరో మహనీయులు, సత్పురుషులు, సద్గురువులు విచ్చేశారు. ప్రసంగాలనిచ్చేవారు.
దేవరహా బాబా కుటీరానికి మూడు కిలోమీటర్ల దూరంగా మొరారీ బాపు కుటీరం ఉంది. అక్కడ అనేక వందలమంది మొరారీ బాపు ప్రసంగాలను వింటున్నారు.
దేవరహా బాబా, దగ్గర ఉన్న శిష్యుణ్ణి పిలచి మూడు రాళ్ళను తెమ్మన్నారు. ఎందుకు అని అడగకుండా తెచ్చాడు.
దేవరహా బాబా మొదటి రాయిని విసిరాడు గంగలోకి, కొంచెంసేపాగి రెండవ రాయిని విసిరాడు, మరి కొంచెంసేపు అయిన తరువాత మూడవ రాయిని కూడా విసిరాడు దేవరహా బాబా గంగలోకి. ఇక ఊరుకున్నాడు దేవరహా బాబా.
కొంత సమయం గడచినా తరువాత మొరారి బాపు వచ్చి కృతఙ్ఞతలు తెలిపాడు, తన కుటీరాన్ని, ఇతరుల కుటీరాలను అగ్నికి దగ్ధం కాకుండా చేసినందులకు దేవరహా బాబాకు.
దేవరహా బాబా మొదట రాయి విసరగానే సగం అగ్ని మాయమైంది. రెండో రాయి విసరగానే అగ్ని లేనేలేదు. మూడో రాయి విసరగానే కేవలం పొగ మాత్రమే మిగిలింది.
దూరాన్నుండి అగ్నిని అదుపులోనికి సాయి తెచ్చిన సంఘటన ఉంది.
1962 హరిద్వార్ లో జరిగిన కుంభమేళాకు దేవరహా బాబా కూడా వెళ్ళారు.
ఒక మహంత్ యొక్క ఏనుగు, మావటివాని మాట వినటంలేదు. అందరు భయభ్రాంతులయ్యారు.
దానిని కాల్చివేయమని పోలీసు అధికారి అక్కడ ఉన్న సుబేదారు భన్వర్ సింగ్ కు ఆజ్ఞా పత్రాన్ని పంపాడు.
భన్వర్ కు జీవహింస ఇష్టంలేదు. ఈ సంగతిని దేవరహా బాబాకు చెప్పాడు. దేవరహా బాబా సూచన ప్రకారం, ఆ ఏనుగుకు సాష్టాంగ నమస్కారం చేసి, రెండు చేతులలో రెండు మామిడి పండ్లను పట్టుకుని, ఒక పండును ఏనుగుకు ఇచ్చాడు తినమని.
అది తిని, రెండవ పండుకై ప్రయత్నించింది ఏనుగు. “ఈ పండును నిన్ను దేవరహా బాబా తినమన్నారు” అని చెప్పాడు.
అది తిని ఎంతో బుద్దిగా ప్రవర్తించ సాగింది. పోలీసు అధికారి తన ఉత్తరువును రద్దుచేశాడు.
దేవరహా బాబా మే 19 (1990)న మహాసమాధి చెందారు. ఆయనను స్మరించి తరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం అర్హం నమః… మహనీయులు – 2020 – జనవరి 21
- రాముడే చూసుకుంటాడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 19
- బ్రహ్మర్షి దైవరాత…. మహనీయులు – 2020… ఆగస్టు 13
- ఆదినాథుడు – ఆది భిక్షుకుడు…. మహనీయులు – 2020… మే 22
- నానారాజ్య సందర్శనం …. మహనీయులు – 2020 – జనవరి 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments