బాబా నా కాలు పోకుండా షుగర్ వ్యాధి బారి నుండి కాపాడారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగము

ఆ తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

మా చిన్న పాప అన్నప్రాసన దిల్సుఖ్ నగర్ బాబా మందిరములోనే జరింగింది.

ఆ తరువాత నేను గురువారములు తప్ప మిగతా రోజులలో ఎప్పుడూ బాగా మద్యము సేవించి ఇంటికి బాగా ఆలస్యముగా వస్తుండేవాడిని.

అప్పట్లో మా మామ గారు గవర్నమెంట్ లాయర్ గా పనిచేస్తుండేవారు.

నా వ్యసనాల వల్లనే అనుకుంటా నాకు షుగర్ వచ్చింది.

కాళ్ళు బాగా నొప్పులుగా ఉండేవి.

ఆ నొప్పులకు నాకు కాలు పైన అల్సర్ కూడా వచ్చింది.

నన్ను మా మామ గారు పలుకుబడితో మెరుగైన వైద్యం కోసం నిజామ్స్ ఆసుపత్రిలో డాక్టర్స్ కి చెప్పి, అందులో చేర్పించారు.

డాక్టర్స్ వస్తారు, చూస్తారు, వెళతారు ఏమి చెప్పడం లేదు.

ఏమి చేయాలి అన్న షుగర్ కంట్రోల్ కావాలి.

ఆలా కావాలి అంటే రోజు ఒక అరటి పండు తినమంటూ చెప్పాడో డాక్టర్ నాకు. మా ఆవిడా వద్దండీ!

అరటి పండు తింటే షుగర్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెబుతూనే ఉంది.

నేనే, నీకు డాక్టర్ కంటే ఎక్కువ తెలుసునా అంటూ ఆమెకి తెలియకుండా, చూడకుండా అరటి పండు తిన్నాను.

షుగర్ ఇంకా ఎక్కువ అయిపొయింది.

ఆ సమయం లో మా లలిత ఆఫీస్ లో తనతో పాటు పని చేసే వారు శ్రీ రమణా నంద శిష్యులు ఉన్నారు.

వారు మా లలితకి ఒక పుస్తకము స్వామి వారు స్వయముగా రచించినది తీసుకొని వచ్చి ఇచ్చింది.

ఆ పుస్తకాన్ని మా మామ గారు శివుడికి సంబంధించినది అయి ఉండటానా అయన వచ్చి వెళుతున్న ప్రతీసారి చదివి పూర్తి చేసారు.

15 రోజులు అలాగే గడిచిపోయాక, మా మామగారిని డాక్టర్స్ పిలిచి, మీరు లాయర్ కాబట్టి మళ్ళీ గొడవ చేస్తారు అని చెబుతున్నాము.

మీ అల్లుడు కాలు తీసేయాలి తప్ప తగ్గదు.

కాలు తీసేయాలి అంటే ఇక్కడ సాధ్య పడదు.

బయట వేరే హాస్పిటల్ లో చేర్పించుకోండి.

రేపే డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు. మరునాడు ఇంకా ఏంటికి నేను మా ఆవిడా బయలుదేరి వచ్చేస్తున్నాము.

ఆటోలో సగం దారిలో ఉండగా

” నాకు ఏంటి బాబా! ఈ విపరీతం, నేను కాలు లేకుండా మంచంలోనే ఉంటూ అందరిచేతా ఊడిగం చేయించుకుంటూ, అందరికి భారంగా ఉండాలా? ఇంకా నా పిల్లలకి పెళ్లిళ్లు కూడా చేయలేదు. ఇలా కుంటుకుంటూ నేను ఎక్కడకి వెళ్ళలేనేమో! ఉద్యోగమూ కూడా ఉండదేమో! ఏంటి బాబా ఈ పరిస్థితి? ఎందుకిలా జరిగింది? నేనేమైన నీకు అపచారం చేసానా? గురువారం నాడు మాత్రమే నేను త్రాగకుండా మిగతా రోజులంతా మద్యము సేవిస్తూ గుట్కాలు తింటూ ఉండడము బహుశా నీకు నచ్చలేదు అనుకుంటా!  అందుకే నాకీ గతి అయిఉంటుంది. నన్ను ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించు, నేనింకా మద్యము, గుట్కాలు రెండు ముట్టను. నాకేదయినా దారి చూపించు బాబా! “

అంటూ కళ్ళ నీళ్ల పర్యంతముగా ఆవేదన పడుతూ మనసులో నివేదించుకున్నాను.

ఇలా నేను ఆవేదన బాబా ముందు ఉంచానో లేదో, వెంటనే మా బావమరిది నుంచి ఫోన్ వచ్చింది.

భావ గారు! నేను హాస్పిటల్ కి వస్తున్నాను. మీరు ఏక్కడ ఉన్నారు? అని అడిగాడు.

మేము డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పాము.

వాళ్ళు అక్కకి ఫోన్ ఇమ్మని, అక్కా! మీరు మీ ఇంటికి వెళ్ళకండి, ఒకసారి మీరు మా ఇంటికి రండి, భావ గారికి ఆలా ఉంచుకుని నువ్వు మాత్రమూ ఇబ్బంది పడుతూ Dilsukhnagar వరుకు ఎందుకు అక్కా, అయినా మన ఇంటి దగ్గర ఒక డాక్టర్ గారు ఉన్నారు.

అయన ఉస్మానియా హాస్పిటలో పని చేసాడు.

నాకెందుకో ఆయనకు ఒకసారి చూపిస్తే బావుండునని అనిపిస్తుంది, అన్నాడు.

వాళ్ళక్క మాత్రం వద్దులేరా, మేము ఇంటికి వెళ్ళిపోతాము అంది.

లేదక్కా వద్దు ఎందుకు చెబుతున్నానో వినండి. ఒకసారి రండి నేను వచ్చేస్తున్నాను మీ ఆటోని వెనక్కి తిప్పి ఇంటికి రండి అన్నాడు.

సగం దూరం వచ్చేసిన ఆటోను మళ్ళీ వెనక్కి తిప్పించి విజయపురి కాలనీ లో ఉన్న మా మామ గారి ఇంటికి వెళ్ళాము.

మేము ఆటోనుంచి దిగుతున్నాము, మా భావ మరిది కూడా అప్పుడే ఇంటికి చేరుకున్నాడు.

నన్ను డాక్టర్ అసలు నడవ వద్దు అన్నాడు, మా మామ గారు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు.

పై నుండి ఒక కుర్చీ తీసుకొని వచ్చి దానిలో నన్ను కూర్చో పెట్టి పైకి తీసుకు వెళ్లబోతుంటే, ఈ లోపు మా భావ మరిది మళ్ళీ భావ గారిని పైకి ఎక్కించాక మళ్ళీ దింపడం కష్టం అందుకే ఏకంగా ఒకే సారి డాక్టర్ దగ్గరికికూడా వెళ్లి వచ్చాక వెక్కిద్దాము అక్కా, అయన ఇప్పుడు ఉంటాడు అయన దగ్గరికి ఇప్పుడే వెల్దాము అంటూ తాను వెళ్లి ఒక ఆటో ను పిలుచుకొని వచ్చాడు.

మళ్ళీ నన్ను ఆటో ఎక్కించి క్లినిక్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు, అయన క్లినిక్ బాగుంటుంది.

అక్కడ ఇన్ పేషెంట్స్ ఎవరు లేరు మేము వెళ్లిన సమయం లో డాక్టర్ గారు ఉన్నారు.

ఆయనకు నన్ను చూపించారు, అన్ని రిపోర్ట్స్ చూపించాము.

అయన అన్ని పరిశీలించి, నేను ఈ పుండు తగ్గించ గలను, కానీ సమయం పడుతుంది.
వెంటనే మాత్రమూ తగ్గదు అన్నాడు.

పెద్ద పెద్ద డాక్టర్స్ చేతులెత్తాశారు, ఈయన వాళ్ళ ఏమవుతుందని నేను అనుకున్నాను.

సరే ట్రీట్మెంట్ మొదలు పెట్టమన్నాము, మీరు ఏక్కడ ఉంటారు అని అడిగారాయన, DilShuknagar లో అని చెప్పాము.

రోజు అంత దూరం నుండి మీరు రాలేరు, అలాయితే నేను ఏమి చేయలేను అన్నాడు.

రోజు రావాలి అన్నాడు, మూడు నెలలు పట్టా వచ్చు అన్నాడు.

అప్పటికి అప్పుడు మా బావమరిది, మా ఆవిడా అలోచించి అయన మేయుడు నెలలు సమయం కూడా మేము మా అత్తగారి ఇంట్లోనే ఉండేటట్లు, ఆ డాక్టర్ గారే మా మావ గారి ఇంటికి వచ్చి నన్ను చుసేటట్లుగా ఏర్పాటుఅయింది.

మేము మా మామ గారింట ఉండిపోయాము. మా పిల్లలని మా భావ మరిది రోజు స్కూల్ లో దింపడం, తీసుకు రావడం చేసేవాడు, మా ఆవిడా నన్ను చూసుకుంటూ అక్కడే ఉండి పోయింది.

ఊరికే ఉండక మా ఆవిడా ఇంతక ముందు ఆఫీస్ లో ఇచ్చిన ‘సాయి బాబా’ పుస్తకము పూర్తి చేసింది.

మూడు నెలల్లో పుండు తగ్గిపోయింది, ఎటువంటి ఆపరేషన్ కాని, కాలు తీసివేయడం కానీ లేకుండా బాబా కృపతో నడవ కలుగుతున్నాను.

బాబా దయ వలన ఆ సంఘటన తర్వాత నేనింకా, మద్యము కాని, గుట్కా కానీ ముట్టుకోలేదు.

“బాబా నా కాలు పోకుండా కాపాడారు. అంతే కాకుండా ఎప్పటినుంచో నాలో పేరుకుపోయిన చెడువ్యసనాలని దూరం చేసారు”.

బాబా నన్నిలా కటాక్షించినందుకు నాకాయన పైన అపారమైన భక్తి, ప్రేమలు పెరిగిపోయాయి.

తర్వాతి భాగము (బాబా వారు వారికీ తర్వాత చేసిన లీల)

సంపాదకీయం : లక్ష్మి నరసింహారావు గారు రచించిన నేటి సాయి భక్తుల గాధలు.

వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

5 comments on “బాబా నా కాలు పోకుండా షుగర్ వ్యాధి బారి నుండి కాపాడారు

సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…
నీ నామం తప్ప, మీ లీలలు తప్ప, మీ గానం తప్ప వేటిమీదికి మా మనసులు పోకుండా ఆశీర్వదించండి…Baba…

Sai sresta

Saai raam…saai raam….

gviswanadham

What is the actual meaning of” Sai Baba

gviswanadham

Anybody please answer sir.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles