యదార్ధం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది , ఆలకిస్తే అందులోనే అమృత గుళికలు లభిస్తాయి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


 సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా..సాయి బాబా

Author: Kota Prakasam Garu

 

రోజులు గడిచేకొద్దీ రాజులు మారిపోతూంటారు, తరానికి తరానికి మద్య జనాల ఆలొచనలు మారిపోతుంటాయి.

ఎప్పుడొ అమలుపరచిన ఒకే దర్మం , ఒకే న్యాయం చెక్కుచెదరక వ్యవస్థలో గాడితప్పక అనుసరించే వ్యక్తిత్వం , అందరికి ఉంటె, పథే పథే చట్టాలలో, శాసనాలలో మార్పుచేయవలసిన అవసరం అసలు కలగదేమో.

 సృష్టిలో మనిషికి ఉన్న మేథస్సు మరొ ఇతర ప్రాణులకు ఆపాదించబడలేదు

అడవిలొ జింక , నక్క తదితర జంతువులకు , ఒక్కొ ప్రాణికి పుట్టుకతో అబ్బిన లక్షణం , అవి పోయేంతవరకు ఆ లక్షణాలతోనే వాటి జీవనవిధానం అనాదిగా గడిచిపోతోంది తప్ప, సింహం వేటను మాని గడ్డిమేయడం, జింకలాంటి జంతువులు గడ్డి తినడం మాని, మాంసంకోసం వేటమొదలుపెడితే అది అటవీక ధర్మానికే గ్లాని కలిగించక తప్పదు.

 వేదం, కళ్లకు గోచరించని సృష్టికర్తకు మరొ రూపం, యుగాలు మారినా, విచ్చలవిడిగా మనుషుల మనోధర్మాలలో విపరీతమైన స్వార్ధచింతన చోటుచేసుకున్నా, వేదధర్మం మాత్రం ఎప్పటికి తటస్థనంగానే ఉంటుంది .

ఎన్నో అవతారాలు వొచ్చాయి, ఎందరో మహాత్ములు వ్యవస్థలో ప్రకటమౌతూ, కేవలం మనుషుల మనోనైజాన్ని మాత్రమే ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్క మనిషి ఉద్ధరింపబడితే, వాడి కుటుంబ సంస్కారాలు ఉన్నతంగా ఉంటాయి, వాడి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచగలుగుతాడు, అది సమిష్టిగా ప్రయత్నం మొదలయితే , సృష్టి దర్మం మరలా రామరాజ్యాన్ని తలపింపచేయగలదు.

రామాయణంలో, రాముని నడతను అర్థం చేసుకొంటే, దర్మం అంటే ఎమిటో ప్రబోధించబడుతుంది భగవద్గీత పరమాత్మ చేత నేరుగా ప్రబోధించబడింది..

వీటిని శ్రద్దగా అధ్యయనంచేసి, ఆ అనుభూతిని అందించగల సమర్థులు ఉండవొచ్చుకానీ, వారు రామ , కృష్ణులతో సమoకాలేరు ..

బాబా సచ్చరిత్ర , ఆయన ఆమోదంతో హేమాద్రిపంతుచే లిఖించబడింది.

ఎందరో ఆనాడు బాబాను ఆశ్రయించినా , ఆ కార్యాన్ని హేమాద్రికి అప్పచెప్పడం , ఆయనకున్న శ్రద్దా ,జిజ్ఞాసలవల్లనే ఆ ఫలం సిద్ధిoచి ఉండవొచ్చు.

 తత్వాన్ని ఆదరించి , ఆచరిస్తె ఆ తత్వాన్ని అందించిన రూపం యొక్క ఆశయాన్ని నెరవేర్చి , మరొ తరానికి .మార్గదర్శకులుకాగలరు ..

 ఆ తత్వసారం కూడా నాలుగు మూలలకు వ్యాప్తిచెంది, అది సృష్టిధర్మానికి తోడ్పడగలదు ..

ధర్మాభిలాషకలవాడు తనలా అందరూ ఉద్ధరింపబడాలని ప్రచారకర్తగా నడుంబిగించవొచ్చు.

చరిత్రలో తుకారాం , త్యాగయ్య , అన్నమయ్య లాంటివారు అధెపంధాలో బ్రతికినవారే ..వీరంతా సృష్టిధర్మానికి ప్రతీకలుగా , మార్గదర్శకులై నిలిచినవారేతప్ప , వారు సృష్టికర్త స్థానానికి పోటీపడినవారుకాదు ..

 తత్వాన్ని ప్రచారం చేసేవారు భోదించే విదానాలు బిన్నంగా అగుపించవొచ్చు కానీ మనసుపెట్టి ఆలకిస్తే మూలధర్మం ఒక్కటే.

 ఆ మూలమైన దానిపై దృష్టిపెట్టక , ప్రచారకుల ఆరాధనకు పరిమితమయితే , అది ఒకనాటి మూలధర్మానికే చేటును కలిగించవొచ్చని పెద్దలమాట.

జయ్ సాయి గురు సమర్థ

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles