Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నంద్యాల తాలూకా దేష్ పురం నివాసి వెంకటరామయ్య గారు, తమ కుమార్తె ప్రసవ సమయం దగ్గిర పడటంతో నంద్యాల వచ్చారు.
అది 1985వ.సంవత్సరం డిశంబరు 2వ.తే. దీ తమ కుమార్తెకు పురిటినొప్పులు రాత్రి 10గంటలకు మొదలయి ఉదయం 2గంటలవరకూ తగ్గకపోవడంతో భార్యభర్తలిద్దరికీ చాలా భయం వేసింది.
ఉదయాన్నే ఆమెని తమ యింటికి దగ్గరలోనే ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోం కి తీసుకొని వచ్చారు. వారితో పొరిగింటిలోనే ఉంటున్న కొండయ్యగారి భార్య కూడా తోడుగా వెళ్ళింది.
సాయంత్రం 4 గంటలయినా నర్సింగ్ హోం నించి ఎవరూ రాక అసలు విషయం ఏమీ తెలియకపోవడంతో కొండయ్యగారు చాలా ఆత్రుతతో ఉన్నారు.
తన భార్య కూడా ఆస్పత్రినుండి రాకపోవడంతో ఏమయిందోననే ఆందోళనతో కొండయ్యగారు సాయంత్రం ఆస్పత్రికి వెళ్ళారు.
అక్కడ వెంకటరామయ్యగారి అమ్మాయికి యింకా పురిటి నొప్పులు తగ్గకపోవడంతో అందరూ చాలా విచారంగా ఉన్నారు. అమ్మాయి పురిటినొప్పులు భరించలేక శోషించిపోయింది.
కానుపు అవడం చాలా కష్టమని వెంటనె ఆపరేషన్ చేయాలని లేడీ డాక్టర్ చెప్పింది .
వెంటనే రూ.2000/- కట్టమని లేకపోతే తానేమీ చేయలేనని చెప్పింది. అపుడు కొండయ్యగారికి సాయినాధులవారే గుర్తుకు వచ్చారు. ఇటువంటి యాంత్రిక జీవితంలో బాబా తప్ప మరెవరూ సహాయం చేయలేరనుకున్నారు. ఆయన దయే కనక లేకపోతే మనుగడే కష్టం.
ఆకలి వేసే పిల్లవాడికి ఆహారం కావాలి, దాహంతో ఉన్నవారికి మంచి నీరు చాలు, కష్టాలలో ఉన్నపుడు మాతృప్రేమ కావాలి. బాబా ఎప్పుడూ తన బిడ్దలకు ఎంత చిన్న కష్టమొచ్చినా తన మాతృప్రేమను కురిపిస్తారు.
కొండయ్యగారు తన భార్యతో అమ్మాయికి ఊదీ పెట్టమని అన్నపుడు ఆవిడ కాస్త సందేహిస్తూ చూసేసరికి, “ఊదీ యొక్క శక్తినే శంకిస్తున్నావా”? అని గట్టిగా అరిచారు.
కొండయ్యగారి భార్య, అమ్మాయి నుదుటిమీద ఊదీరాసి కొంత నోటిలో వేసింది .
ఇదంతా చూసిన లేడీ డాక్టరు అసహ్యించుకొని, మూఢ నమ్మకాలతో అటువంటి పిచ్చి పనులు ఏమీ చేయవద్దని చెప్పింది. ఇటువంటివాటి వల్ల ఏవిధమయిన ఉపయోగం లేదు వెంటనే ఆపరేషన్ కి డబ్బు కట్టమని చెప్పింది.
కొండయ్యగారు వెంటనే యింటికి వెళ్ళి బాబా ముందు కూర్చొని అమ్మాయికి సుఖప్రసవం కలిగేలా చేయమని ప్రార్ధించారు.
అపుడు సమయం మధ్యాన్నం గం.2.30ని.అయింది.
సాయంత్రం 4.గంటలు అవుతుండగా వెంకట రామయ్యగారి అమ్మాయి వచ్చి తన సోదరికి ఆపరేషన్ లేకుండా మగపిల్లవాడు జన్మించాడనీ , బాబు మంచి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పింది.
కొండయ్యగారు వెంటనే బాబును చూడటానికి ఆస్పత్రికి వెళ్ళారు.
ఇదంతా చూసిన డాక్టర్ కి చాలా అద్భుతమనిపించింది. వెంకటరామయ్యగారితో కనీసం 600 రూపాయలయినా బిల్లు కట్టమని చెప్పింది.
సాయిసుధ మాసపత్రిక
కొండయ్య
నంద్యాల
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా నమ్మకమే బాబా. నాకు ఉన్న దిక్కు కూడా తనే.
- భక్తుని బాబా ఎప్పుడూ విషమ పరిస్థితిలోనికి నెట్టివేయడు–Audio
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- సమస్యను బాబాకి చెప్పుకున్నంతనే చికిత్స మొదలు
- నిరుపేద విద్యార్థిని డాక్టరును చేసిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ నమ్మకమే ఎప్పుడూ జయిస్తుంది–Audio”
kishore Babu
August 22, 2016 at 5:23 pmThank you So much Sai Suresh..