Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: లక్ష్మీ సౌజన్య
నివాసం: హైదరాబాద్.
ఒక రోజు నాస్నేహితురాలు నాకు 11PM కి కాల్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అంటే చెప్పడం లేదు. బాగా బాధపడుతుంది. నేను తనని ఆపలేకపోయాను. నాకు ఏడుపొస్తుంది.
తాను ఇలా చెప్పడం మొదలు పెట్టింది. అమ్మ కి ఏమి బాగా లేదు అంది. ఏమైంది అని అడిగితే ఇలా చెప్పింది.
లాస్ట్ టైం తలకి దెబ్బ తగిలినది కదా! అందువలన మొత్తం తలలో ప్రాబ్లెమ్ అయింది అని చెప్పింది.
హాస్పిటల్ కి వెళ్ళాము 6 లక్షలు అవుతాయన్నారు. అమ్మను జాయిన్ చేసాము. ముందు మూడు లక్షలు మిగిలినది తరువాత కట్టవచ్చు అన్నారు.
మేము కట్టాము, మిగిలిన మూడు లక్షలు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అని అన్నారు. మేము డబ్బులు కట్టినా అమ్మకు ఏవిధమైన ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదు. అడిగితే మాకు ఇంకా గవర్నమెంట్ నుండి మనీ రావాలి, వచ్చిన వెంటనే చేస్తాము అంటున్నారు.
తలకి ప్రాబ్లెమ్ అయితే ఎంతైనా గవర్నమెంట్ వాళ్లే ఇస్తారు. కానీ హాస్పిటల్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పింది.
నీకు బాబా అంటే నమ్మకం కదా! ఈ సమస్య నుండి మమ్ములను సేవ్ చేయమని బాబాకి చెప్పు అని చెప్పింది. సరే చెపుతాను అన్నాను.
ఆ రోజు నైట్ నేను బాబా గుడికి వెళ్లి బాబాకి చెప్పి వచ్చాను. మా ఇల్లు బాబా గుడికి జస్ట్ మూడు ఇళ్ల దూరం అంతే.
మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు మా ఫ్రెండ్ కాల్ చేసి అమ్మకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు అని చెప్పింది.
నాకు చాలా హ్యాపీ అని పించింది. ఎగిరి గంతువేసి బాబా గుడికి వెళ్లి బాబాకి థాంక్స్ చెప్పాను. ఇప్పుడు నా స్నేహితురాలి కుటుంబం అంతా బాబాకి భక్తులు.
Latest Miracles:
- బాబాకి గంధాలంకరణ భాగ్యం
- బాబాకి వందల సార్లు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను–Audio
- బాబాకి పేద, ధనిక, కులం, మతం, తేడాలు లేవు, కావలసింది కేవలం బాబా మీద భక్తి, ప్రేమ, శ్రద్ధ మాత్రమే!
- బాబాయే తన భక్తుని మొర విని సమస్యను పరిష్కరించారు
- నిరుపేద విద్యార్థిని డాక్టరును చేసిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments