Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: శిరీష
నివాసం: హైదరాబాద్
బాబాకి తన భక్తుల మీద ఉండే ప్రేమ అపారమైనది. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన మన తప్పులను మన్నించి, మనల్ని ప్రేమిస్తారు. నన్ను ఆయన మందిరానికి ఆయనే రప్పించుకున్నారు.
హైదరాబాద్ లో వెంగళరావునగర్ లో ఉండే బాబా గుడి అంటే నాకు చాలా ఇష్టం.
ఆ గుడిలో కింద ద్వారకామాయిలో ధుని ఉంటుంది. పైన గుడిలో బాబా, వినాయకుడు, దత్తుడు, సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉంటారు.
2013 లో గురు పౌర్ణమి ముందు రోజు భక్తులు అందరు ధుని గదిని క్లీన్ చేస్తున్నారు. నేను కూడా వారితో కలిసి సేవ చేస్తున్నాను.
ఆ గదిలో ధునికి ఎదురుగా ఉండే ద్వారకామాయి ఫోటో అంటే నాకు చాలా ఇష్టం.
బాబా ఫోటోలోపల లైటింగ్ ఉండి చుట్టూ మందిరంలాగా ఉంటుంది. లోపల గదిలో ద్వారకామాయి ఫోటో ఉంటుంది.
ఆ రోజు అందరితో కలిసి ధుని క్లీన్ చేస్తున్నప్పుడు, ప్రతిభ అక్క బండమీద కూర్చుని ఉండే బాబా పెద్ద ఫోటోకి గంధము, ఇంకా కుంకుమతో బొట్టు పెడుతుంది.
అది చూసి అక్కడే ఉండే ద్వారకామాయి ఫోటోకి గంధంతో బొట్టు పెట్టాలనిపించింది. మారుతిని అడిగాను, తాను పెట్టొచ్చు అని చెప్పింది. కానీ, మొత్తం క్లీన్ చేసాక పెట్టు అంటే సరే అన్నాను.
కానీ, అదే రోజు మా తమ్ముడు నా దగ్గరకు వస్తున్నాడు. ఫోన్ చేసి అక్క నేను వచ్చాను, నువ్వు రా అంటే వెళ్ళవలసి వచ్చింది.
అయితే బాబాకి బొట్టు పెట్టాలి ఎలా అనుకొని గంధంతో ఓన్లీ నుదుటున బొట్టు పెట్టి వెళ్ళాను. ఇక ఆ రోజు నుండి ప్రతి బుధవారం ఆ ద్వారకామాయి ఫోటోకి గంధంతో బొట్టు పెట్టె ఛాన్స్ నాకు లభించింది.
ఒకసారి నేను సచ్చరిత్ర పారాయణ చేస్తుంటే, అందులో ఒక అధ్యాయంలో డా.పండిట్ బాబాకి గంధంతో బొట్టు పెడతారు.
అప్పుడు కేల్కర్ బాబాని అడుగుతారు మేమెవరమైన పెడదామంటే ఒప్పుకోవు కదా! అతను పెడితే ఏమి అనలేదు ఎందుకు బాబా అని అడిగితే, “అతను మనస్ఫూర్తిగా నన్ను తన గురువుగా భావించి బొట్టు పెట్టాడు. అతని ప్రేమను నేనెలా కాదనగలను” అని ఉంది.
అది చదివాక నేను బాబాకి గంధంతో బొట్టు పెట్టడం గుర్తుకు వచ్చింది.
బాబా మీద ప్రేమతో మనస్ఫూర్తిగా ఏ పని చేసినా బాబా కాదనరు. అని అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఆరోజు నుండి ప్రతి బుధవారం ఆ ద్వారకామాయి ఫోటోకి అలకరించే ఛాన్స్ నాకు ఇచ్చారు బాబా. అందుకు బాబాకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
బాబా ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే నేను నామనసులో ఏదైనా సేవ చేయాలి, అనుకోగానే నేను చేయాలనుకున్న సేవ నాతో చేయించుకునే వారు బాబా.
నేను జీవితం లో మరిచిపోలేని రోజులు నేను బాబాతో ఆ గుడిలో గడిపిన రోజులు.
Latest Miracles:
- బాబాకి మొక్కినంతనే పరీక్షలో విజయం
- భగవంతుని కృప లేకుంటే గురు సందర్శనా భాగ్యం కలుగదు
- ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడు
- బాబాకి అసాథ్యమన్నది లేదు–Audio
- సమస్యను బాబాకి చెప్పుకున్నంతనే చికిత్స మొదలు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “బాబాకి గంధాలంకరణ భాగ్యం”
sirisha
May 30, 2019 at 12:33 pmSai baba sai baba sai baba sai baba sai baba
sirisha
May 30, 2019 at 12:36 pmThank you saibaba and
sirisha
May 30, 2019 at 12:37 pmThank you saibaba meru naku meku gandham alankarinchey bagyam ichinandhuku