Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అన్నిటికన్న ముందు శ్రీ సాయినాథ్ మహారాజ్ చరణకమలాలకు సాష్టంగా నమస్కారములు వినమ్రపూర్వకంగా సమర్పిస్తున్నాను.
సాయిబాబా అనంతమైన కృప నాపై వుంది.అందుకే అలోకికమైన అనుభవాలు నాకు కలిగిస్తున్నారు. వాటిని అన్నిటిని గుర్తుచేసుకుంటే నా హృదయకమలం ఆనందంతో విప్పారుతుంది.
ఆ సాయినాథుని లీలలు అగాధాలు. నాలాంటి ఒక సాధారణమైన మనుష్యులు ఎలా వాటిని వర్ణించ గలరు?
అయన మహిమను వర్ణించాలంటే కేవలం అ సాయినాథుని కృపవుంటేనే అవుతుంది.ఆ సాయినాథుని లీలలు, ఉపదేశాలు, అయన జీవిత చరిత్ర రాయడం మొదలు పెడితే వాటికి అంతమే వుండదు.
పూర్వజన్మలో చేసుకున్న అనేక పుణ్య ఫల ఫలితంగా, ఈ జన్మలో శ్రీ సాయినాథ్ మహారాజ్ భక్తి, ఆయన లీలలు రాసే శక్తి ప్రాప్తిస్తాయి.(ఇది మాత్రం సంపూర్ణ సత్యం)
నేను ఆగస్టు నెల 2007 లో నా officer ప్రకాష్ అగర్వాల్ ఆయన భార్య ఉత్పల అగర్వాల్ తో పాటు శిరిడీ దర్మించె అదృష్టం కలిగింది.
ఇప్పటి వరకు ఎన్నిసార్లు శిరిడీ వెళ్ళినానో అన్నిసార్లు ఆనందంగా, గుర్తు పెట్టుకునేటట్లుగా నా యాత్ర సాగింది.
సాయినాథ్ మహారాజ్ తన భాండాగారం నుంచి నాకు ఎన్నో అమూల్యమైన రత్నాలు ఇచ్చారు. దీని వలన నేను అనుకుంటాను, ఆయన సమాధి తరువాత కూడా చాలా అలోకికమైన లీలలు జరుగుతున్నాయి, మరియు సాయి జీవించి ఉన్నప్పటి లాగానే ఇప్పుడు కూడా లీలలు జరుగుతున్నాయి.దానిని మనము తప్పకుండా నమ్మలసిందే.
ఆయన సూక్ష్మ శరీరంతో ఇప్పటికి తన భక్తుల సమక్షంలో ఉన్నారు. అదే అనుభవాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను.
ఆ రోజు రాత్రి దగ్గర దగ్గర 11 : 45 నిమిషాలు సమయం అయివుంటుంది. నేను ఇంక ఎవరో ముగ్గరు , నలుగురు ద్వారకామాయిలో కూర్చొని వున్నాం. నేను సాయి స్మరణ చేసు కుంటున్నాను. మిగిలిన వాళ్ళు సాయి చరిత్ర పారాయణం చేస్తున్నారు.
ద్వారకామాయి వాతావరణం శాంతంగా వుంది. నేను కూర్చొని సాయి నామ స్మరణ చేసుకోవడం మొదలు పెట్టి 5 నిముషాలు అయింది.ఇంతలో నా చెవిలో ఏవో తియ్య తియ్యని శబ్దాలు వినిపిస్తున్నాయి.
నేను అనుకున్న, అక్కడ కూర్చొని వున్న వాళ్లలో ఎవరో బాబా స్మరణ చేస్తున్నారు అని అనుకున్నాను. చాలా సేపు అలా వినపడుతూనే వుంది.
నా చెవులకు ఎంత బాగా ఆ శబ్దాలు వినపడుతున్నాయంటే, నా చెవులలో ఎవరో అమృతం పోస్తున్నారు! అనిపించింది. ఆనందంతో నా శరీరం, మనసు రోమాంచితమైంది. నాకు అనిపించింది
నేను ఆ శబ్దాల ధ్వనితో పాటూ స్వర్గలోకం, దైవలోకం చేరుకున్నానా! అని అనిపించింది. నేను ఇంక వర్ణించలేనంత ఆనందాన్ని అనుభవించాను. ఆ ఆనందాన్ని వర్ణించడం అసంభవం.
ఇంక నన్ను నేను ఆపుకోలేక పోయాను. అక్కడే కూర్చొని వున్న సాయి భక్తులను అందరిని చూశాను, ఎవరన్నా, ఏదైనా దైవ నామ స్మరణ చేస్తున్నారేమో అని. కానీ అందరూ సాయి సచ్చరిత్ర చదువుకుంటున్నారు.
ఈ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి మరి, అని బయటికి వెళ్లి చూశాను. అక్కడ ఎవ్వరు లేరు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, శాంతిపూర్వకంగా వున్న ద్వారకామాయి కి వెళ్ళి మళ్ళీ అక్కడ వున్న అరుగుమీద కూర్చున్నాను.
ఆ శబ్దాలు ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పుడు sudden గా నాకు అనిపించింది, అరే, ఈ శబ్దాలు అంతరాత్మనుంచే వస్తున్నాయి. నేను విన్నాను, నా స్నేహితుని ద్వారా, ఆత్మ, పరమాత్మ కలిస్తే అలాంటి అలోకికమైన శబ్దాలు వస్తాయి అని.
ఆ ద్వని ని మనం పట్టుకోవాలి, నేను అదే చేశాను. నా అంతరంగం నుంచి వచ్చే ధ్వని తరంగాలను నేను పట్టేశాను.
అందుకే అంటారు, సదా భగవంతుని నామస్మరణ చేస్తే, ఆ భగవంతుడు మనకు నిజమైన గురువును ప్రసాదిస్తాడు.
భగవంతుని కృప లేకుంటే గురు సందర్శనా భాగ్యం కలుగదు.
ఏ భగవంతుని ఆశీర్వాదం నా మీద వుందో కానీ, సాయిలాంటి సద్గురు దర్శనం ద్వారకామాయిలో నాకు కలిగింది. సద్గురు దర్శనం లేకుంటే ఆధ్యాత్మిక ఉన్నతి కలగదు. ఆధ్యాత్మిక ఉన్నతి లేకుంటే మనుష్య జన్మ వ్యర్థమే.
ఇంతకు నాకు వినబడిన ధ్వని తరంగాలు చెప్పలేదు కదూ! అయితే వినండి.
“ముజే సదా జీవిత్ హిజానో! అనుభవ కరో ! సత్యకో పెహచావో”. అంతే నాకు నా సద్గురు శ్రీ సాయినాథుని దర్శనం శబ్ద తరంగాల ద్వారా అనుభవమైంది ద్వారకామాయిలో
ఆనంద భారతి,
ఢిల్లీ.
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- గురు చరిత్ర మహిమ
- బాబాకి గంధాలంకరణ భాగ్యం
- తనకి మెచూరిటీ లేకుంటే నాకైనా ఉండాలి
- సద్గురు కృప.
- ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
9 comments on “భగవంతుని కృప లేకుంటే గురు సందర్శనా భాగ్యం కలుగదు”
dillip
January 5, 2018 at 9:30 amexcellent miracle . madhavi mam .sai ram
Madhavi
January 5, 2018 at 9:41 amsaileelamrutham lo vunnatlu..Rege sreenarayanuni bhakthudu.srimannarayanude BABA nu chupinche.athane nee GURUVU..ani..cheppi baba nu chupinchi velathadu.andhuke antaru.nijamaina bhakthi..sadguru sandarsanaanni kaligistundhi…sainaathuni kanna sathguruvu evarunnaru..? jai sairam
subhalaxmi behera
January 5, 2018 at 10:06 amDivine experience
kajal
January 5, 2018 at 10:07 amWonderful experience…..sai ram
Prathibha sainathuni
January 5, 2018 at 10:13 amSo nice ..thank you Madhavi aunty and Srinivas murthy Garu for baba article’s…
Padala vln murthy
January 6, 2018 at 1:07 pmVery great experience. She is blessed one, that’s why she heard the voice of sai baba garu. Om sai ram.
b vishnu Sai
January 6, 2018 at 5:22 pmOm sai ram
kishore Babu
January 7, 2018 at 3:50 amఈ లీల రోజు నా జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది…నేను ఎప్పుడైనా బాబా నామము మర్చిపోతే ……ఆటోమేటిక్ గా నా మనసులో నుంచి నామము వినపడుతూ ఉంటింది.
అది….నా జీవితము లో రోజు జరిగే అద్భుతుమైన లీల.
మాధవి గారికి మన సాయి బాబా భక్తులు అందరూ రుణ పది ఉన్నాము….madam వ్రాసే లీలలు చాల అద్భుతము.
Vidya
January 7, 2018 at 10:28 amWow !!! Om Sairam