గురు చరిత్ర మహిమ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను “గురు చరిత్ర”  21 రోజులు పారాయణ చెయ్యాలి అని మొదలుపెట్టాను. ఏ రోజుది ఆరోజు చదువుతున్నాను.

అలా  16 రోజులు గడిచాయి.  17వ రోజు ప్రొద్దున  4గంటల,  15  నిమిషాలకు నాకు ఒక కల వచ్చింది.

అది ఏమిటంటే, ఎక్కడో తెలియదు నేను ఏదో ఊరు వెళ్ళాను. అక్కడ నాకు బాబా గుడికి వెళ్ళాలి అనిపించింది.

అప్పుడు అక్కడ ఉన్న వారిని గుడి ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఎవరు చెప్పడం లేదు. ఎవరో ఒకరు అక్కడ దూరంగా ఒక గుడి ఉందికానీ, ఆగుడి చాలా పాతపడి పోయింది అని చెప్పారు.

నేను వెళ్ళాను. అది చూడడానికి ఒక ఇల్లులా చాలా గదులు ఉన్నాయి. నేను ఒక్కో గది వెతుకుతున్న, బాబా విగ్రహం కనపడలేదు.

అక్కడ చాలా చెత్త పేరుకుపోయి  ఉంది. ఆచెత్తలో నుండి లోపల ఒక పాము పాకుతున్నది. కానీ నేను ఏదో చెత్తకదా! నడుస్తున్న కదా! ఆకదలిక అనుకున్నా కాని కాదు. ఆపాము నాకన్నా ముందు వేరే గదిలోకి వెళ్లి పడగవిప్పి ఉంది.

నేను వెళ్ళేటప్పటికి అది నా బొటన వేలు మధ్యన కరిచింది. వెనకకు తిరిగితే బాబా విగ్రహం కనిపించింది. బాబాని చూసి నన్ను నేను మరిచిపోయాను.

ఆవిగ్రహం  చాలా బాగుంది. వెళ్లి బాబా పాదాల మీద పడ్డాను. అంతటితో కల ముగిసింది.

కానీ ప్రొద్దున నేను స్నానం చేసేటప్పుడు చూసుకుంటే నా చేతి మీద పాము కాటు ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. కలలో జరిగింది ఇలా ఉండడం ఏమిటి అనుకున్నాను.

మళ్ళీ నేను 9 గంటలకు గుడికి వెళ్లి “గురు చరిత్ర” పట్టుకుని చదవడం మొదలుపెట్టా. దానిలోఆరోజు మొదటి అధ్యాయం పాముది వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

నా పాము కాటు మాగుడిలో అందరు చూసి చాలా ఆశ్చర్యపోయారు.

మళ్ళీ రాత్రి“సాయి పాత్(Saileelas.com)” వాట్సప్ గ్రూప్ లో నేను కలలో ఏదైతే పామును చూశానో అదే పాముని బాబా వారి మేడలో వేసినట్టున్న ఫోటో పెట్టారు.

అది చూసి నేను వాళ్ళకి కాల్చేసి అడిగా,ఎందుకు ఇలా పెట్టారు ఈరోజు ఏంటి అని. వాళ్ళు మాకు పెట్టాలి అనిపించి పెట్టాము అన్నారు.

చూసారా! నా దోషం బాబా అలా తీసేసారు.

~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

 *** సాయి సూక్తి :

 

“నిన్ను కాపాడడానికి నేను ఇక్కడ ఉండగా నీకేల చింత”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles