బాబాకి మొక్కినంతనే పరీక్షలో విజయం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: సాయి మురళీ

 నివాసం: చీరాల

నేను ఇంటర్ లో ఉన్నప్పుడు చదువులో చాలా వెనకపడి ఉండే వాడిని.

అప్పుడు పరీక్షలలో మ్యాథ్స్ లో 29 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాను.

నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం.

అసలు బుర్రకి ఎక్కేవి కావు. ఒక రోజు చీరాల సాయిబాబా గుడికి అనుకోకుండా వెళ్ళాను.

అదే ఫస్ట్ టైం బాబా గుడికి వెళ్ళడం. అప్పుడు బాబా విగ్రహాన్ని మొదటిసారిగా చూసాను.

మామూలుగా అన్ని గుడులలో విగ్రహాలు తెల్లగా ఉంటాయి కదా! మొదటి సారిగా బాబా విగ్రహం నల్లగా  ఉండడం చూసి అబ్బా యెంత బాగా ఉన్నారు బాబా అని అలానే చూస్తూ ఉండిపోయాను.

అప్పుడు మధ్యాహ్నహారతి అవుతుంది. అందరు హిందీలో హారతి పాడుతున్నారు.

అందరికి హిందీ వచ్చా? నాకే రాదా! అనిపించింది.

సరే అని అప్పుడు నేను మ్యాథ్స్ సప్లమెంటరీ పాస్ అయితే కొబ్బరికాయ కొడుతాను అని మొక్కుకున్నాను.

పరీక్షకి కొన్ని ముఖ్యమైనవి ఒక 20, 25  ప్రశ్నలు మాత్రమే చూసుకుని వెళ్ళాను. కరెక్ట్ గా నేను చూసుకున్నవే పరీక్షలో వచ్చాయి, సంతోషంగా రాసాను.

తరువాత 87 మార్కులతో పాస్ అయ్యాను. తరువాత ఇక నాకు చదువు అబ్బదని, డిగ్రీలో జాయిన్ అవకుండా మానాన్న గారి స్నేహితుని దగ్గర వ్యవసాయం చేయడానికి కర్ణాటకకు వెళ్ళిపోయాను.

 అలా 3 సంవత్సరాలు బాబా కి కొబ్బరికాయ కొట్టలేకపోయాను, అని నా మనసులో పీకుతుండేది.

ఒకరోజు ఇక ఎలాగైనా వెళ్ళాలి అనుకుని, మా నాన్నకి చెపితే వద్దు అంటాడు అని, మామూలుగా నాకు ఇంటికి వెళ్లాలని ఉంది, వెళ్లి అందరిని చూసి వస్తాను, అని చెప్పి ఊరికి వచ్చాను.

రాగానే స్నానము చేసి చీరాల వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చాను. అప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపించింది.

      ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

*** సాయిసూక్తి:

                “చరాచర సృష్టి యావత్తు నా అధీనంలోనే ఉంది

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “బాబాకి మొక్కినంతనే పరీక్షలో విజయం

Sunny

Baba so many iam facing help also iam doing but people are making me bad that all are tension no happy for me baba

murali

Sir, this is my experience thank you very much for sharing, but one small correction Anni gudulalo vigrahalu nallaga untayi identi baba vigraham tellaga undi Chala andanga undi

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles