సాయి దండిగా నీ సాధన నను చేయనీ.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

నిరతము నిను తలచువారి పరిచయాలనీయవే, కడచూపులో నీ స్మరణలే మది తలవగనీయవే, నిండుగా ఆయుషీయరావే ! సాయీ ! దండిగా నీ సాధన నను చేయగనీయవే

**

శకుని యుక్తి , కుయుక్తులు , దుర్యోధనుడి అహంభావం , మూర్ఖత్వంతోపాటు ధర్మరాజుకున్న జూదమనే ఏకైక బలహీనత , వెరసి మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది ..

యుద్ధ నివారణకు సంధిచేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగినా , రాయభారి సందేశాలు రుచించక , మూర్ఖపు పట్టుదలతో యుద్ధం అనివార్యమైంది .

తమ భాగం తమకు దక్కితేచాలని ఒకవర్గం , కుదరదు అంతా మాదే అంటూ ఒకవర్గం..

రెండువర్గాలు ఒక యింటపుట్టినవే , ఒకే అంతఃపురంలో వొక నీడన పెరిగినవే ..అయినా ఒకే యింట రెండు విభిన్నమైన మనస్తత్వాలు ,, ఒకటి మనది అంటోంది , ఒకటి నాది అంటొంది ..

ఒకటి రాజ్యకాంక్షతో రగిలిపోతోంది , ఒకటి ధర్మంకోసం చేయిచాస్తోంది ..

ఒకటి తనా , మనా మరచి యుద్ధానికి సిద్ధమైంది ..మరొకటి బాణం ఎక్కుపెట్టగానే , వావి వరుసలు గుర్తుకొచ్చి , విల్లును సంధించలేకపోయింది …

రామ , కృష్ణావతారాలు ధర్మోద్ధరణకు అవతరించినా , అధర్మానికి ప్రతీకలైన రాక్షసగణాన్ని అంతమొందించకతప్పలేదు ..

చిన్న తప్పును ఒక మందలింపుతో సరిచేయవొచ్చు .. అది ముదిరి లోకానికే హానికరంగా మారితే, థర్మాన్ని ప్రబోధించె భగవంతుడైన సంహరించేందుకు వెనుకాడడు ..

ఒక వర్గం హద్దుమీరితే అది లోకానికే అరిష్టం .. అందుకే వాలిపోతున్న ధనుస్సుకు ధర్మాధర్మ విచక్షణకు సంధిగా భగవద్గీత ప్రబోధంజరిగి థర్మాన్ని నిలబెట్టింది ..

కాలానికి అణుగుణంగా అవతారపురుషులకైనా, మనిషులకైనా బాల్యావస్థనుండి వృధ్యాప్యంవరకూ శరీరం తన ధర్మాన్నిపాటించి అంతరించిపోవలసిందే ..

శరీరం ఎదిగేకొద్దీ గతవ్యవస్థను పొందలేదు .శరీరం ఉన్నంతవరకూ మనసు పెత్తనం చలాయిస్తుంటుంది..

నేను , నాది అనే బ్రమలో ముంచేది మనసే.ఏది నీదో , ఎవరు నీవో అని అప్పుడప్పుడు సూలంతో గుచ్చినట్టు హెచ్చరించేది మనసే ..

ఇది పదేపదే గతాన్ని గుర్తుచేస్తుంటుంది .. అజ్ఞానంలో విహరిస్తూ , ఎదుగుతున్న వయసుకు ఆధారమైన శరీరానికి కలగబోయే విపత్తును గుర్తించక , మాయలో దొర్లుతుంటుంది …

అర్జునుడికి భగవద్గీత మార్గోపదేశంతో తనా , మన చిత్తభ్రమలన్నీ మబ్బులాకరిగి , ధర్మయుద్ధంలో విజయాన్ని సాధింపచేసింది ..

నేను , నాదన్న అజ్ఞానానికి రధ సారధ్యంనెరిపి , మనసుకు పట్టిన చాంచల్యాన్ని తొలగించి ఉత్తమగతులను అందించేది ఆద్యాత్మిక ప్రబోదాలే అంటారు ..

జరగాలి అని కొరుకోడంలొ దొషం కనిపించదు , మనసున్న మనిషికది సహజాతి సహజం ..

జరిగితీరాలని కొరుకోడం , తలచింది జరగకుంటే ఆందోళనకు గురికావడం అది మానసికంగానేకాక శరీర వ్యవస్థమీద కూడా ప్రభావం చూపకతప్పదు ..

సాధన అంటే అనేక ఎత్తుపల్లాలను అధిగమించితేకానీ , అమృతఫలం చేతికందదు ..

ఆశలు హద్దుదాటితే ఎదురవ్వేవంతా ఆకర్షించే మాటల మాంత్రికులే ..

వేసే ప్రతి అడుగులో విచక్షణ , సరిఅయిన నిర్ణయాలు లేకుంటే , కేవలం భౌతికభోగాలతోనే జన్మ , కాలానికి ఆహుతైపోగలదని పెద్దలమాట …

శ్రీ గురుబ్యోనమః
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “సాయి దండిగా నీ సాధన నను చేయనీ.

Prathibha sainathuni

Nice…sahajangane manasu appudappudu alochana lekunda paristitulaku anukulanga bavodwegalaku lonavutuntundi…alantappudu ilanti manchi matalu manasuki vivekaanni,vichakshanani nerchukuni tadwara Sai margamlo sarigga aduguveyadaniki sahakaristayi…anduke naku prakasham gari writings nachhutai…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles