సమాధిలో ఉన్నా , నా ఎముకలు బదులిస్తాయి అన్నారు బాబావారు ..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

దేవుడే ప్రత్యక్షమయితే ?

ఈ నూనె వర్తకులు నన్ను యిబ్బంది పెడుతున్నారు , అన్నారు సాయి ..

పామర బాషలో చెప్పాలంటే అయినదానికీ , కానిదానికీ తీర్చేవాడొకడున్నాడని క్షణం విరామమివ్వకుండా , భౌతికమైనకోర్కెలతో పట్టిపీడించే జనాలు అధికమైనప్పుడు బహుశా అలా అని వుండవొచ్చు ..

ప్రతిరొజూ ఉదయాన్నే దీపం వెలిగించి , ఏ కాయో , పండో నివేధనచేయడం హిందువులకు అబ్భిన సంస్కృతి …

మనసుండో , లేకో ప్రతి నిత్యం ఇలా చెయడం వలన దేవుడి అనుగ్రహంవలన అంత మేలు జరుగుతుందనేది ప్రతి హిందూకుటుంబాలలో ఒక ప్రఘాడ నమ్మకం …

ఆచారాలను పాటించే కొన్ని ఇళ్లలో వేకువనే స్నానానంతరం మడికట్టుకోని దేవుడి గదిలోకి ప్రవేశించడం ఒక ఆనవాయితి ..

ఆచారవంతుడైనా , ఒక సాధారణ కుటుంభీకుడైనా స్నానంచేసి , కనీసం ఉతికిన పంఛనుకట్టనిదే , దేవుడిగదిలోకి ప్రవేశించరు ..ఇది అనాదిగా అందరూ పాటించే ఆచారం.

స్నానం చేయనిదే యింటిలోనేకాక ఆలయాల్లో ప్రవేసించడం నిషిద్ధమని దర్మ శాస్త్రాలుకూడా తెలుపుతాయి ..

ఆరాధన అనేది కేవలం ఒక ఆనవాయితీగా జరిగితే అదో తంతుగా మిగిలిపోతుందంటారు .

కాస్త దృష్టిని సారించడం మొదలయితే చదివే అష్టోత్తరంలో ప్రతి మంత్రార్ధాన్ని గ్రహిస్తే  కొలిచేదైవం  స్థాయిని  గుర్తెరుగుతుంది మనసు …

దేహానికి ప్రతి పూటా స్నానం ఎంత అవసరమో , ఆద్యాత్మిక చింతనకు మనోప్రక్షాళనకూడా అంతకన్నా అవసరమనే ప్రజ్ఞ క్రమంగా మేల్కొంటుంది ..

అంతవరకూ ” ఓం సర్వాంతర్యామినేనమః * అని చదివిన మంత్రం పూజగదికే పరిమితమౌతుందితప్ప , సర్వేసర్వత్రా ఆ రూపం నిండియున్నదన్న ప్రజ్ఞ మనసు గ్రహించలేదంటారు ..

అప్పుడప్పుడు చూసే సినిమాలో కథానాయకుడు వొచ్చాడని తెలిస్తె ఊపిరాడకుండా తొక్కిసలాట మొదలౌతుంది ..

కనీసం కాస్త అందరితో చనువుగా ఉంటూ ఆదరించే ఒక ఎం ఎల్ ఎ అవకాశమిస్తే , లేని అవసరాలు కూడా గుర్తుకు తెచ్చుకొనిమరీ నిద్రపోయే అవకాశం ఇవ్వకుండా , రాత్రీపగలూ తేడాలేకుండా మూగిపోతారు జనాలంతా ..

మరి పిలిచినంతనే పలికే అవకాశం దేవుడి విషయంలొ ఎదురైతే అందరూ కోరుకొనేది అల్లావుద్దీన్ అద్భుతదీపాన్నేతప్ప , మోక్షాన్ని కోరుకొనే వాళ్ళను వేళ్ళమీద లెక్కించాల్సివొస్తుంది ..

బాగా ఉన్నవాడు , బిడ్డలమీద మమకారంతో అతి గారాభంచేసి , అడిగిందల్లా అందిస్తూ , వాడి భవిష్యత్తును అజ్ఞానంతో అంధకారినిచేయవొచ్చు ..

ఒక సద్గురువు ప్రకటం కావడం , లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించేందుకే ..

ఒక నమ్మకం ప్రబలాలంటే కొన్ని మహిమలు అనివార్యం ..

నమ్మకం మొదలయ్యాక బోధన ప్రారంభమౌతుంది ..

మహిమలమీదే దృష్టిని కలిగినవాడు తన అవసరాలను తీర్చుకొనే నెపంతోనే తిరుగుతుంటాడు ..

అలా అయాచితమైన కోర్కెలతో చేయిచాచే సంఖ్య నూనె వర్తకుల్లా వేధించడం మొదలుపెట్టారు ..

అందుకే ఆయన మహిమలు వెల్లడైన అనతికాలంలోనే శరీరాన్ని వొదులుతూ , తండ్రికి తగ్గ బిడ్డలుకండి , ఎవరు నాపై విశ్వాసముంచి , నన్నే స్మరించుచుందురో, అట్టివారికి సమాధిలో ఉన్నా , నా ఎముకలు బదులిస్తాయి అన్నారు ..

ఆయన కనిపించాడు , కనిపించాలనే కోర్కెలకన్నా , ఆయన ప్రబోధాలను నెమరువేసుకొంటూ , ఆచరించే ప్రయత్నం వలన మనసే ఆయన ప్రతిరూపంగా మారుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహపడాల్సిన అవసరంలేదని పెద్దలమాట ..

జయ్ గురు సాయి సమర్థ
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles