కృష్ణప్రియ రూపం లో అతి వ్యసనాలకు బానిసలైన తన భక్తులను రక్షించుకున్న సాయి నాథులు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సాయి నాథులు కృష్ణప్రియ రూపంలో చేసే చిత్ర విచిత్ర మైన లీలలు ఎవ్వరికి అంతు చిక్కేవి కావు.

ఈ వింతలు చూసేదానికో వచ్చిన వారు అతి సంతుష్టులై సాయి నాథుని ముందు,  కృష్ణప్రియ ముందు నతమస్తకం అయ్యేవాళ్ళు.

వాళ్లలో,మంచివాళ్ళు,వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఉండేవాళ్ళు.  అంతేకదా, దైవసాన్నిధ్యానికి అందరూ మంచివాళ్లే రారు.

తనభక్తులను ఎలా మంచివాళ్లగా మార్చాలో మన సాయిబాబా కు బాగా తెలుసు. సాయి చరిత్రలో కూడా ఉన్నాయి ఇలాంటి ఉదాహరణలు.

అందుకే తన బిడ్డలను బాగు చెయ్యాలని ఆ గురు దేవులు విశ్వప్రయత్నం చేస్తారు.

ఆ వచ్చే వాళ్లలో శెట్టిగారు,  అని ఇంకా ఇద్దరు, ముగ్గురు ఉండేవాళ్ళు.

వాళ్ళు అందరూ బాబా భక్తులే. అక్కడ భజన తరువాత కృష్ణప్రియ అందరిని బయటికి పంపి తను , దేవుడి గది లో ధ్యానం లో కూర్చునేది.

ఆరోజు కూడా అలాగే ఆమె మెడపైన దేవుడి గది లో తలుపు వేసుకుంది ధ్యానం లో కూర్చుంది.

అంతే, ఇంకా ఆమె బయటికి రాదు అనుకోని ఈ శెట్టిగారు, “చిరోట్” అనే చుట్టాలు , బీడీలు,మద్యం తీశారు, అక్కడే చెట్టు కింద కూర్చున్నారు.

అన్ని తాగుతున్నారు.

ఆ సాయి నాధులు వీళ్లకు బుద్ది చెప్పాలని కృష్ణప్రియ రూపం లో వాళ్ళ పక్కనే నలుగురు ఆడవాళ్ళతో , “సాయిబాబా షిర్డీ లో ఉండగా ఎలా తన భక్తులను రక్షించింది” చెప్తువుంది.

వీళ్ళు ఆమెను చూసి, అరె, ఇప్పుడే దేవుడి రూమ్ లో ఉంది కదా,  అని పైకి చూసారు,అక్కడ ఉంది, మెడపైకి వెళ్లి దేవుడిగది లో చూసారు,అక్కడవుంది.

“ఇందు కలడందు లేడని సందేహము వలదు ,చక్రి,సర్వోపగతుండు” అన్నట్లుగా అన్ని చోట్లా ఆ సాయిబాబా కనపడ్డారు.

ఇంకా వాళ్ళు భయం తో, ఇది బాబా గారి లీల, అని గ్రహించి, అన్ని చుట్టలు, బీడీలు, మద్యం వదిలి ఇంకా ఎప్పుడు వీటిని ముట్టుకొము అని బాబా కు మాట ఇచ్చి తిరుగుమోఖం పట్టారు.

ఇంకొక భక్తుడు నరంబు నాథన్ పిళ్ళై, ఇతనికి స్త్రీ వ్యసనం చాలా ఉండేది.

కానీ బాబాకు,కృష్ణప్రియ కు చాలా భక్తుడు. ఆమె ,బాబా నే ,అని చాలా నమ్మేవాడు. ఆమెను బాబా అని పిలిచేవాడు.

ఇతను ధవళేశ్వరం నందు superintending engireer గా పెద్ద ఉద్యోగం లో ఉండేవాడు. ఈయన కింద చాలా మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు.

ఆఫీసర్ మెప్పు పొందాలని, ప్రోమోషన్ ఇస్తాడని , రోజుకొక వేశ్య ను సాయంత్రం అయ్యేసరికి తెచ్చేవాళ్ళు.

బాబా తన భక్తులను మంచిమార్గం లో పెట్టాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు.

దానిలో ఒక భాగంగా,ఆ వచ్చిన ప్రతి వేశ్య పిళ్ళై కి కృష్ణప్రియ గా కనపడడం మొదలెట్టింది.

ఆ పిళ్ళై దీన్ని చూసి ఆశ్చర్యం తో,అయ్యో బాబా,మీరా, అనేవాడు. సిగ్గుతో తలవంచుకునే వాడు.

ఇలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, బాబా, నన్ను క్షమించు, తప్పు జరిగిపోయింది, అని విలవిల లాడాడు.

తన భక్తుడిని మంచివాడిగా మార్చలనేగా బాబా ప్రయత్నం. ఈ విధంగా బాబా అందరి బాగోగులు చూసేవారు. అందుకే ఆయన సర్వాంసహచక్రవర్తి.

సర్వం సాయి నాతర్పణమస్థు.

పచ్ఛిమడి ఆశ్రమమే గోలోకంగా మార్చిన సాయి నాథుడు,వచ్చేభాగం లో చూడండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

21 comments on “కృష్ణప్రియ రూపం లో అతి వ్యసనాలకు బానిసలైన తన భక్తులను రక్షించుకున్న సాయి నాథులు.

Radha

Om sai sri sai jaya jaya sai.super madhavi.

Pramadha

Bhale undhi.endhuku aapesaru.

Harini

Bhale raasavu.sairam

Smitha

Baagundhi.aunty.om.sai ram

Radhika J

Om Sai Sri sai jai jai sai with ugadi wishes

Amith

Om sairam.

Rajgopal

Sairam.Wish u happy ugadi to all saileelas.com.group

Vijayakka

Chala baagundhi.maasesavu.endhuku? Raayi.om sai ram

Srikanth

బాగుంది.సాయిరాం

Srimati

చాలా బాగుంది.అక్క

Haripriya

Chala baagundhi.mathaji story

Sailaja

Om sai ram.

Jyothi

ఓం సాయిరాం

Arunavalli

Chala baagundhi.madam.

Jayanthu

Super vundhi.baba leela.

Krishnaveni

Sairam.fantastic.leela.

Hari

Chala bagundhi.aunty.

Vani

Sairam.aunty

Rohith

Baagundhi.aunty.sairam

Satwika

Om sai ram.om sai syam.

Vidya

Bagundi Pinnama … Sai ram

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles