సద్గురుసాయి పాద సన్నిధిలో అంతా శుభమే.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో ,కాలం , గ్రహస్థితులు ఎలాఉన్నా , సద్గురు పాద సన్నిధిలో అందరికీ శుభంకలగాలని మనసా , వాచా ప్రార్ధిస్తూ
**

చట్టరీత్యా ఎవరిని వారు రుజువుచేసుకొనేందుకు ఆధారుకార్డు , పానుకార్డు లాంటివి చూపకపోతే కనీసం లాడ్జీలలో గదులుదొరకడం కూడా కష్టమే .

బడికి వెళ్లే పిల్లలకు సైతం ఒక గుర్తింపుకార్డు లేకుంటే లోపలికి ప్రవేశం ఉండదు ..

ఎక్కడ కొత్తగా పరిచయం కావాలన్నా ఏదో గుర్తింపనేది లేకుండా ససేమిరా పట్టించుకోరు ..

గాడంగా ప్రేమించి , పెళ్లిచేసుకొనే విషయంలో కూడా ముందుగా ఎన్ని ప్రమాణాలు చేసినా అవి లెక్కలోకిరావు , పెద్దల సమక్షంలోనో , కనీసం ఏ రిజిస్టరు ఆఫీసులోనో మూడుముళ్ళుకట్టక భర్తగా గుర్తింపుపొందలేరు ..

లోకం గౌరవించాలన్నా , లోకంలో చెలామణికావాలన్నా , అధికారంచేతనో , ఘనమైన కార్యములవల్లనో గుర్తింపుపొందుతుంటారు ..

ఎందరో మహిమగల సాధువులుండవొచ్చు , నమ్మి ఆశ్రయించినవారికి ఏమాత్రం కొద్దికష్టాలను తీర్చినా , వారి ఆశయాలను నెరవేర్చిన ,లోకం గుర్తించి వారివెంటపడుతుంది ..

ఆలయాలు వేలకు వేలు ఉన్నా , కొన్ని ఆలయాల్లోనే మొక్కుకొంటే చాలు ఆశయాలు తీరిపోయంటే , బారులు తీరిపోతూంటారు ..

లౌకిక జీవనంలో ప్రతి చోటా గుర్తింపు అనివార్యమైపోయింది ..

బహుశా సృష్టిలో గుర్తింపుకోసం పాకులాడని పదార్ధాలు మూడే ఉన్నాయనిపిస్తోంది , మొదటగా జన్మనిచ్చినతల్లి , సృష్టికి మూలమైన పురుషుడు , సృష్టిలో ప్రతివాడి బాధ్యతను గుర్తుచేసి ప్రబోధించే సమర్ధుడైన సద్గురువు మాత్రమే ..

బాబా ఆ మసీదులో అడుగుపెట్టింది మొదలూ ఎన్నో సంవంత్సరాలు ఆయన కనీసం, షిరిడీలో ఉన్న జనాలే గుర్తించలేకపోయారు ..

ఆయన తనతానుగా గడిపాడేతప్ప , జనాకర్షణకు వ్యర్ధమైన మహిమలను ప్రదర్శించిన సందర్భాలు లేవు …

ఆయనెవరో లోకంచడం మొదలయ్యాక , ఆ గ్రామమే ఒక నిత్య జాతరలా తయారయ్యింది ..

భగవంతుడు గుర్తింపబడవొచ్చు , అమ్మ అంటే ఒక గౌరవం ఉండొచ్చు ..

బ్రతికినంతకాలం అమ్మను గౌరవించి , ఆదరించక , తల్లి ఋణం తీర్చుకోడం ఏజన్మకూ సాధ్యంకాదు ..

భగవంతుడి సర్వహృన్నిలయుడే అయినా , సత్కర్మలతో , ప్రబోధాలను ఆచరించి , తండ్రికి తగ్గ తనయులుగా సద్గురు హృదయాన్ని కొల్లగొట్టక , సద్గురు ఋణం కూడా ఎన్నటికీ నెరవేర్చడం కష్టమే అని పెద్దలమాట ..

జై శ్రీ గురుబ్యోనమః
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles