Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: సరిత
నివాసం: హైదరాబాద్
సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు సరిత. నేను బాబా గారి మరొక అద్భుత లీలను మీతో పంచుకుంటున్నాను.
బాబాగారు పిలిస్తే పలికే దైవం అని, ప్రేమతో మీరు ఏదైనా సమర్పిస్తే అది స్వీకరిస్తానని నిదర్శనంగా చూపించడం కొరకేమో బాబాకు ఏది సమర్పించిన స్వీకరించారు. 30.12.2008 రోజున నా బాబాకు పూరి, ఖీర్, పాలకూర, పప్పుచారు మద్యాహ్న భోజనం లో నివేదించాను.
28.12.2008 రోజున జరిగిన భజన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది.
కింద పరచిన చీరపై బాబా పాదాల గుర్తులు రావడం, అక్కడక్కడా విభూతి రావడం నిజంగా ఒక అద్భుతం.
అప్పుడు ధ్యానంలో ఉన్న నా శరీరం చల్లబడిపోవడం, వైబ్రేషన్స్ అదే సమయంలో బాబా వారి విగ్రహం ముందు పసుపు, కుంకుమలు కనిపించడం చాలా ఆనందంగా అనిపించింది.
బాబా నీ ప్రేమ తప్ప నాకేమి వద్దు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు వద్దు. బాబా నేను నీ మార్గాన్ని అనుసరిస్తాను.
నా చేయి మాత్రం విడవకు. ఒకవేళ తెలిసో, తెలియకో నా చేయి జారినా, నీవు మాత్రం నా చేయి విడువకు తండ్రి, నాకు నీ ప్రేమ కావాలి బాబా అని విన్నవించుకున్నాను.
నాకెప్పుడు ఏది కావాలో అది మీరు ఇస్తారని ఆరోజు నేను బాబాకు సర్వస్వశరణాగతి చెందాను. అప్పటి నుండి ఇప్పటి వరకు బాబా లీలామృతంను ఆస్వాదిస్తూనే ఉన్నాను.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయి సూక్తి:
“నా భక్తుల కోరికలను నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను”.
Latest Miracles:
- నేను నీ గుడికి రాను , నీ హారతులు వద్దు ,నువ్వు వద్దు
- విషం ఏక్కకుండా చెయ్యి, నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరు—Audio
- ఆమె కాలికి చేయికి ఉన్న కట్టు మీద బాబా చేయి పెట్టేసరికి,కట్టులు వూడి పడిపోయాయి.
- ” ఏమ్మా! ఏమైంది, ఇంకా ఎన్నాళ్ళు పడతావమ్మా ఈ కష్ఠాలు, నీ కష్ఠాలు చూడలేకపోతున్నాను. బాబా నీ నమ్ముకోమ్మా నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. ”
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా నీ ప్రేమ తప్ప నాకేమి వద్దు”
maruthi
May 22, 2019 at 9:44 pmసాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా 🙏