Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2007 సంవత్సరంలో నేను అప్పుడే షిర్డీ కి వెళ్లి ,ఒక విషయంలో నేను ఆయనపై బాగా అలిగి ”నేను నీ గుడికి రాను , నీ హారతులు వద్దు ,నువ్వు వద్దు ” అంటూ ఆయన మీద అలిగి హైదరాబాద్ వచ్చేసాను.
ఆగస్టు 22 బయల్దేరి 26 కి వచ్చేసాను ,” నీ షిర్డీ కి కూడా నేను రాను ” అంటూ అలిగి వచ్చేసాను.
ఆ సాయంత్రమే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది . లక్ష్మయ్య గారి అబ్బాయి శివ వైదేహి నగర్ సాయి బాబా గుడి పూజారి కణ్ణన్ కి ఫోన్ చేసి మన గుడికి ఒకతను కారులో వస్తాడు అతను ఎవరు ? [అప్పట్లో నేను నా క్లాసులు ఐన తర్వాత రాత్రి హారతికి కార్లోనే వెడుతుండేవాడిని ] అన్నాడట.
ఇతను ” భాను అండి” అన్నాడట . ”అతని ఫోన్ నెంబర్ నాకివ్వు నేను అతనితో మాట్లాడాలి ” అన్నాడుట . కణ్ణన్ నా నెంబర్ ఇచ్చాడట . ఆ శివ అన్నాయన నాకు పెద్దగా పరిచయం కూడా లేదు . ఎదో సందర్భంలో ఒకటి రెండు సార్లు చూసానేమో అంతే ! అతను అప్పుడే పూనా నుండి హైదరాబాద్ వచ్చి , ఎయిర్పోర్ట్ నుండి నాతో మాట్లాడాడు .”భాను నా ! అన్నాడు , నేను అవును అన్నాను .”
నువ్వు అర్జెంటు గా షిర్డీ వెళ్ళాలి ఎందుకంటే , గుడిలో విగ్రహ ప్రతిష్ట 31 న జరుగుతుంది కాబట్టి ,నువ్వు అక్కడి నుండి ” ధుని ” తీసుకురావాలి , నేను షిర్డీ లో మాట్లాడాను ” అన్నాడు.
నాకు కారులో ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడం అంటే చాలా ఇష్టం.నన్ను ఆయన కారులో వెళ్లి రమ్మంటున్నాడు . అంతకు ముందే నేను షిర్డీ కి కారులో వెళతానంటే మా నాన్న ఒప్పుకోలేదు.
అందుకని నేను వెళ్లలేక పోయాను . అయినా అంతకు ముందే నేను బాబా మీద అలిగి ,” ఇంక నేను షిర్డీ కి రాను నువ్వు వద్దు నీ హారతులు వద్దు ” అనుకున్నందుకు నేను వెంటనే షిర్డీకి కార్లో ఆఫర్ ఇచ్చాడు బాబా , నేను సరే అనక తప్పలేదు .
ఇంటికి వచ్చి మా నాన్న ని అడిగితే అంతకు ముందు వద్దు అన్నవాడు ఈ సారి వెంటనే ఒప్పుకున్నాడు . ‘ధుని ‘ తేవడం అంటే ఎదో చాలా మామూలు పని అనుకున్నాను .
అది ఒక పవిత్ర కార్యం అని నాకు తెలియదు . నా ఉత్సాహమంతా కార్లో అంత దూరం ప్రయాణం అంతే . వెళ్ళేటప్పుడు కావాలంటే మరో ఇద్దరిని నీ కూడా తీసుకు వెళ్ళమన్నాడాయన .
నేను వెళ్ళగానే అక్కడ నాకు ఒక చాక్లెట్ లాగా చేతిలో పెట్టేస్తారు , అది పట్టుకుని వచ్చేయటమే అనుకున్నాను . బయల్దేరేటప్పుడు ఒక రేకు డబ్బా ఒకటి తయారు చేసుకున్నాను బయలుదేరి వెళ్ళిపోయాము . నాతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకు వెళ్ళాను . 16 గంటల ప్రయాణం BHEL దాటగానే బాగా వాన మొదలైంది.
వానలోనే వెళ్తున్నాము .వానకి బయట అద్దం అంతా ఆవిరితో మూసుకు పోతోంది , కార్ కొత్త కాబట్టి నాకు వైపర్స్ ఎక్కడుంటుందో , ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు .
కొంత దూరం వెళ్లడం ఆపడం అద్దం తుడవడం , మళ్ళీ బయల్దేరడం ,ఇలా మధ్యాహ్నం హారతి అయ్యాక బయలుదేరితే మర్నాడు ఉదయం 8 గంటలకి షిర్డీకి చేరాము .
” నేను 2 గంటలు పడుకుంటాను 10 గంటలకి గుడికి వెళ్లి ‘ ధుని ‘ తీసుకొని బయల్దేరి పోదామని మా వాళ్ళకి చెప్పి పడుకున్నాను .
నాతో పాటు వచ్చిన వాళ్ళు కార్లో బాగా పడుకున్నారు , అందుకని వాళ్ళు దర్శనానికి వెడతామంటే ” నేను మళ్ళి డ్రైవ్ చేయాలి కాబట్టి కాసేపు పడుకుంటాను ”. 11 గంటలకి లేచి స్నానం చేసి 11 . 30 కి EO దగ్గరికి వెళ్ళాను .ఎవరు పంపించారని అడిగారు,నేను శివ కుమార్ అన్నాను . ఎవరా శివ కుమార్ అన్నాడు.
మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అన్నాను ఇంతకీ ఏం కావాలి ? అన్నాడు .” ధుని కావాలి ” అన్నాను .” ధుని ” ఎవరిస్తారని చెప్పారు ? ప్రెసిడెంట్ అఫ్ ఇండియా వచ్చినా కూడా ధుని ఇచ్చే ప్రసక్తే లేదు ” అన్నాడు.
నేను బయటికి వచ్చి శివ కుమార్ గారికి ఫోన్ చేశాను , ఆయన ఇవ్వడం కుదరదన్నారు అని . ”ఆయన అలాగే అంటాడు ఏం కాదు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ” అన్నాడు.
నేను ఈ లోపు షిరిడి లో బొగ్గు కొందామని అంతా గాలించాను , ఎక్కడా దొరకలేదు . ఊరంతా రెండు రౌండ్లు వేసాక ఒక చోట అరకిలో బొగ్గు దొరికింది . ఈ లోపు హారతి అయిపోయింది.
నేను మళ్ళీ EO ని కలిసాను . ఆయన నన్నీ సారి సాయంత్రం కలవమన్నాడు .సరే నని రూమ్ కి వచ్చి మళ్ళీ కాసేపు పడుకొని సాయంత్రం వెళితే అక్కడ ఎవరూ లేరు .గుడి ఇంచార్జి ని కలిసాము.
సమాధి మందిరంలో బాబా కి కుడి పక్కనో రూము , ఎడమ పక్కనో రూము ఉంటాయి .బాబా కాలి వైపునున్న రూమ్ లో ఉన్నాడాయన . నేను వెళ్లి ఆయనతో విషయం చెప్తాను.
ఆయన వెంటనే లోపలికి వెళ్లి రెండు అగరబత్తీలు వెలిగించి తీసుకువచ్చి మాకు ఇచ్చాడు . వాటిని ఆరిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్లమని వారి భావన , అది చూడంగానే నేను ఆయనతో
” నేను హైదరాబాద్ నుండి వచ్చాను , నా పేరు భాను , నాకిలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది , మా ఇంటి దగ్గర బాబా గుడి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది , దాని కోసం ” ధుని ” కావాలి , అందుకోసం గుడి వాళ్ళు నన్ను పంపించారు అని చెప్పాను.
ఆ ఇంఛార్జ్ వాళ్ళ అమ్మాయి ని కూడా కంప్యూటర్స్ లో చేర్పించాలని అనుకుంటున్నాడట ఆయన నాతో కొంత సేపు మాట్లాడి , ఆయనకున్న సందేహాలన్నీ తీర్చుకున్నాడు , అది అయిన తర్వాత ,
నాకు ” ధుని ” ఇస్తానన్నాడు . అంత దూరంలో బాబా కాలు ఊపుతూ కనపడ్డాడు ,నేనున్నానుగా అంటూ . ”ధుని ” దగ్గరికి వెళ్ళాము , లోపల నుండి కణ , కణ లాడే నిప్పు , పెద్ద పెద్ద రెండు పిడకలు , ఇంకా అగరబత్తీలు , కర్పూరం , అగ్గిపెట్టి తీసుకు వచ్చి నాకిచ్చాడు . నాకింక దుఃఖం ఆగలేదు . అక్కడ నుండి బయలుదేరాము .
మా దగ్గర షిరిడి లో కొన్న అరకేజీ బొగ్గు మాత్రమే ఉంది . అహ్మద్ నగర్ షిరిడి కి 80 కిలోమీటర్లు , అక్కడకి రావడానికి మాకు నాలుగు గంటలు పట్టింది . ఎందుకంటే మేము దారి పొడుగునా ప్రతి డాబా ముందు బొగ్గు కోసం ఆగి , అడుగుతూ వస్తున్నాము.
ప్రతి చోట లేదు అనే సమాధానమే వస్తుంది . రాత్రి 1 . 30 తర్వాత బాగా చలిగా ఉందని , ఒక చిన్న గుడిసె ముందు టీ దొరుకుతుందేమోనని ఆగాము , బొగ్గు కోసం కోసం ఆగి , అడుగుతూ వస్తున్నాము .
టీ తాగుతూ అక్కడ ఉండదని తెలిసినా ఎదో ఆశతో బొగ్గు దొరుకుతుందా ? అని అడిగాము . వాడు ఉంది అంటూ ఒక పావు బస్తాడు బొగ్గు తీసుకువచ్చి ఇచ్చాడు , డబ్బులు వద్దు అన్నాడు , కానీ బాబా ఏది ఊరికే తీసుకోకూడదు అన్నాడు అని , వాడికి కొంచెం ముట్ట చెప్పి బొగ్గు తీసుకొని బయలుదేరాము .
అక్కడ నుండి 150 కిలోమీటర్లు వచ్చేటప్పటికి 4 గంటలు అయ్యింది. కాసేపు టీ కోసం ఆపాము .టీ తాగి కాసేపు పడుకొని 5 గంటలకి కణ్ణన్ కి ఫోన్ చేశాను . నేను 12 గంటలకి అక్కడ ఉంటానని చెప్పాను .
అతను ” హారతి టైం అవుతోంది హారతి పాడతారా ?” అని అడిగాడు . నేను పాడతాను అన్నాను , ఫోన్ లో పాడాను కణ్ణన్ ఇక్కడ గుడిలో ఫోన్ కి స్పీకర్ ఆన్ చేసి మైక్ ముందు పెట్టాడంట .
మొత్తం కాలనీ అంతా నా గొంతు తో హారతి వినపడింది . నేను షిరిడి వెళ్లిన సంగతి అందరికి తెలుసు నా గొంతు మైక్ లో వినపడుతుంటే ధుని తీసుకొని నేను వచ్చేసాను అనుకున్నారు అందరూ . వెంటనే అందరూ గుడికి వచ్చేశారట .
కర్ణాటక బోర్డర్ చేరుకున్నాక ఇంకా అదే స్పీడ్ తోటి వెళితే హారతి సమయానికి నేను చేరుకోలేననిపించింది .
” బాబా కార్ స్పీడ్ పెంచేస్తున్నాను , కారులో ఉన్నది ముగ్గురం కాదు నలుగురం ఇక నువ్వే చూసుకో బాబా ”
అని అనుకున్నాను . స్పీడ్ బాగా పెంచేసాను ,కొంత దూరం వెళ్ళాక రోడ్డు ఒక సైడ్ బాగా కోసుకుపోయినది గుంటలు ఉన్నాయి , ఆ గుంటలలో పడితే టైర్ పేలిపోతుంది .
రోడ్డు మీద గుంటలని చూడంగానే [110 కిలోమీటర్ల స్పీడ్ మీద పోతుంది కార్ ]పక్కకి తిప్పాను , ఎదురుగ లారీ వస్తోంది .
నేను తిప్పడంలో అసలీ కార్ దాని కిందకి వెళ్ళిపోయి , అద్దాలు పగిలిపోవాలి , అసలు మేము కూడా మిగలకూడదు , కానీ 5 సెకండ్లలో ఏమైనదో తెలియదు .
కార్ మాములుగా రోడ్ పైన వెళ్తోంది . అద్దం లోంచి చూస్తే లారీ వెనక వెళ్ళిపోతోంది . కారులో ఉన్న ముగ్గురు ” ఏమైనది అన్నా! కార్ ఒక పక్కకి అయింది .” అన్నారు నిద్రలేచి .
ఆ 5 సెకండ్లలో బాబా ఏం చేశారన్నది నాకిప్పటివరకు తెలియనే లేదు . మొత్తానికి మమ్మల్ని బాబా సేవ్ చేసాడు . సికింద్రాబాద్ వచ్చేటప్పటికి 11 అయింది .
ఇంకా గంట సమయం ఉంది ఒక చోట లారీ బోల్తా పడి ట్రాఫిక్ జామ్ అయింది . అయినా ఎలాగో సందు చేసుకొని 110 స్పీడ్ లో వచ్చేసి గణేష్ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి 11 : 45 అయింది .
గణేష్ టెంపుల్ చుట్టూ కారుని 3 రౌండ్లు తిప్పాను , తీసుకువచ్చి తిన్నగా గుడి ముందు ఆపాను , అప్పుడు ఇంకా ఒక నిముషం ఉంది . అందరూ నా కాళ్లకి మొక్కుతున్నారు , నాకేం తెలియటం లేదు నాకు అప్పచెప్పిన పని నేను చేసుకు వచ్చాను , అనుకుంటున్నాను .
” భరద్వాజ మాస్టారి గారికి విద్యానగర్ లో గుడి కట్టినప్పుడు ఆయన అడిగితే ‘ ధుని ‘ షిరిడి లో ఇచ్చారట ,మళ్ళీ నీకిప్పుడు ఇచ్చారు భానూ !” అన్నారందరూ . అది బాబా దయ ! అంతే నాదేమీ లేదు .
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- బాబా నీ ప్రేమ తప్ప నాకేమి వద్దు
- “బాబా నాకు తెలియకుండానే నేను నీ అండన చేరాను. నీ ఒడి లోనే ఉంటున్నాను. నన్నెదుకయ్యా బాధ పెడతావు.”
- ” ఏమ్మా! ఏమైంది, ఇంకా ఎన్నాళ్ళు పడతావమ్మా ఈ కష్ఠాలు, నీ కష్ఠాలు చూడలేకపోతున్నాను. బాబా నీ నమ్ముకోమ్మా నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. ”
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు
- వద్దు, వద్దు!…..సాయి@366 జూన్ 29…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “నేను నీ గుడికి రాను , నీ హారతులు వద్దు ,నువ్వు వద్దు”
maruthi.sainathuni
February 6, 2020 at 5:03 pmSai Baba… Sai Baba🙏