పరాకుసేయుట పాడిగాదురా! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 5



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తన భక్తులు చేయుటకు వేరు వేరు పనులను ఏర్పాటు చేసేవారు.

ఒక సామాన్య భక్తునిచే భగవంతుడు ఎంతలేసి కైంకర్యములు చేయించుకున్నాడో అల్లూరి వెంకట్రాద్రిస్వామి జీవిత చరిత్ర తెలుపుతుంది.

వేంకటాద్రిస్వామి బాల్యంలో అడవిలో ఆవులను మేపుతూ ఒక చెట్టు క్రింద నిద్రించాడు.

కొమ్మల సందుల నుండి ఎండ పడుతుంటే ఒక కృష్ణ సర్పం పడగ విప్పి నీడ పట్టింది.

కలలో వేంకటాద్రికి విల్లుమ్ములు ధరించిన ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ, కోతి కనిపించారు.

ఆ ఇద్దరు పురుషులలో పెద్దవాడు వేంకటాద్రి నాలుకపై బీజాక్షరాలు వ్రాశాడు. నిద్రనుండి లేచిన వెంకట్రాది వారే సీతా, రామ, లక్ష్మణ, హనుమలుగా  గుర్తించి, నమస్కరించారు.

దేహాన్ని, ఆత్మను శ్రీరామర్పణం చేయదలచాడా బాలుడు.

వేంకటాద్రి భజన చేస్తుంటే, అతని భక్తికి మెచ్చిన తూము నరసింహదాసు గారు వేంకటాద్రి కాళ్ళకు గజ్జలు కట్టి, తంబూర, కరతాళాలిచ్చి భజనను కొనసాగింపుమని దీవించి, తారక మంత్రోపదేశం చేశారు.

అయన కంచిలో వరదరాజస్వామి పేరుందేవి తాయార్లకు పుష్పములు సేకరించి మాలలు చేసి సమర్పించే వాడు. ఒకనాడు పుష్పసేకరణ చేయుచుండగా కృష్ణ సర్పం కాటువేసిందాయనను.

ఇతరులు అది చూచి చికిత్స చేయించటానికి పూనుకొనగా, అయన అంగీకరించక, పన్నగ శయనుని పానుపు నన్నేమి చేస్తుంది? అని తులసి తీర్థం తీసుకున్నారు. అంతే!

వరదరాజస్వామి ఆయనకు స్వప్నంలో కనిపించి రత్న ఖచిత కిరీటం సమర్పించమని కోరాడు.

ఆయన చెన్నపట్టణం పోయి, బిచ్చమెత్తి కిరీటాన్ని చేయించి సమ్పరించాడు.

ఆ నాటి రాత్రి కంచి వరదుని దేవేరులు స్వప్నంలో కనిపించి “తండ్రికైతే సమర్పించావు, తల్లులను మరచినావా?” అన్నారు.

ఆయన మరల కైంకర్యపరుల నుండి ధనమును సేకరించి అమ్మవార్లకు సమర్పించాడు.

ఒకనాడు కావేరీ తీరవాసియైన రంగడు అతని స్వప్నంలో కనిపించి ఒమ్మచ్చు అనే ఆభరణం కోరాడు.

మరల వేంకటాద్రి ధనాన్ని సేకరించి ఒమ్మచ్చును తయారు చేయించి కాలినడకన శ్రీరంగం వెళుతూ ఒకనాటి రాత్రి శిష్యులతో కలసి ఒక సత్రంలో విశ్రమించాడు.

దొంగలు రాళ్లు రువ్వసాగారు. ఈ లోగా ఒక రాజకుమారుడు భటులతో వచ్చాడు. “మీరు నిశ్చింతగా నిద్రించండి” అన్నాడు ఆ రాజకుమారుడు.

వేంకటాద్రి, శిష్యులు భయమును వీడి సుఖంగా నిద్రించారు. తెల్లవారింది.

ఆ రాజకుమారుడూ లేడూ, భటులు లేరు. అయ్యో! రంగనాధుడు ఆ రూపంలో వస్తే గుర్తించి పాద పూజ చేయనైతినే అనుకున్నాడు.

ఒమ్మచ్చును రంగనికి సమర్పించాడు వేంకటాద్రి. సన్యాసం స్వీకరించి తిరువెంగడం రామానుజ జియ్యరు అయ్యాడు.

ఆయన అభరణాలే కాదు, ఆంధ్ర, తమిళ భాషలలో కీర్తనలు వ్రాసి, ఫిబ్రవరి 5, 1877న దేహాన్ని త్యజించారు. నేడు ఫిబ్రవరి 5. ఆయన వ్రాసిన కీర్తనలలోని చరణాన్ని స్మరిద్దాం! తరిద్దాం!!

“పరాకుసేయుట పాడిగాదురా – పరమ పురుష వరద…”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles