ధర్మాన్ని రక్షించు ……ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ధర్మాన్ని రక్షించు ……ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.

**

పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నదని ఒక సామెత ..

పులికి జన్మతహా గోధుమ రంగు శరీరానికి , అక్కడక్కడా నల్లటి చారికలు అందంగా , హుందాతనంగా కనిపించడం ప్రకృతిపరంగా అబ్బినవే సింహం పులి కాలేదు .. గాడిద గుఱ్ఱంకాలేదు .. సృష్టి నిర్మాణమే ఒక మహా అద్భుతం ..

మనిషి అతీతమైన మేథస్సుతో సాంకేతికంగా ఎంతో ప్రగతిని సాదించవొచ్చు కానీ సృష్టి మర్మాన్ని చేదించేందుకు , ప్రకృతితో పోటీపడినా , ప్రళయంవొచ్చి సృష్టికార్యం సమసిపోవొచ్చుకానీ , పరిమితికి లోబడిన ప్రజ్ఞతో సాధించుకొనే విషయంలో మనిషి ఎన్నటికి సృష్టి ఆధ్యాంతాలను సంపూర్ణంగా సాధించడం దుర్లభమే అంటారు ..

పెద్దవారి సలహాలలో వెతికి చూస్తే ఎంతో లోతయిన అర్దాలు స్పురిస్తుంటాయి ఆసక్తితో విశ్లేషించుకొంటే…

ఒక విషయం ప్రస్తాపనకు వొచ్చినప్పుడు కొందరిలో అనేక సందేహాలు రేకెత్తుతూఉంటాయి.అర్ధంకానప్పుడు అడిగి తెలుసుకోడం ఒక పద్ధతి ..అయినా నివృత్తి కానప్పుడు , తరచి తరచి అర్ధమయేంతవరకూ పదిమందికలిసి చర్చించుకొని ఒక మేలైన భావనకు రావడం ఒక పద్దతి ..

వాదన చేయకుంటే కొన్ని నిజాలను రాబట్టడం కష్టం ..

వాదనలో ఎవరికివారు నెగ్గాలని ప్రయత్నంచేస్తె , అది అహంకారానికి మూలమౌతుంది తప్పయదార్దాన్ని ఎన్నటికి గ్రహించలేరు ..

రామ , కృష్ణావతారాలు ముగిసినా , యా అవతారాల విశిష్టత , ధర్మాలను తెలియపరిచే రామాయణ , భాగవతాది గ్రంథాలు మిగిలాయి ..

అవతారాలలో వారి పోలికలు ఇలా ఉంటాయని వర్ణించబడ్డాయి , అందుకు అనుగుణంగా వారి రూపాలను చెక్కి ఆలయాలలో ప్రతిష్ఠించుకొని ఇది రాములవారు , ఇది శ్రీకృష్ణులవారు అని గ్రంధాలలోని వర్ణనుబట్టి గ్రహించగలుగుతున్నారు , ఎంతటి సాటిలేని మేటి భక్తులుకూడా యా ధర్మాలను అనుసరించి , మోక్షం పొంది చరిత్రలో మిగిలిపోయినవారు ఉన్నారుకాని , ప్రత్యక్ష దర్శనమైందని అసత్యప్రచారాలు చేసుకుని చాటుకొన్నవారు ఎవరూ కనిపించరు .

రూపం మనోనిగ్రహంకోసం అంటారు.

శ్రద్దగా , నిష్టగా గ్రంధాన్ని పారాయణచేసినపుడు , ఆ రూపం అందించిన థర్మాన్ని మనసు గ్రహిస్తుంది .. మునుపటి సంస్కారాలురూపుమాపి , ఉత్తమ సంస్కారాలను అందించడమే ఆ గ్రంథంలోని లక్షణం .. అదే అత్యుత్తమైన అనుభవంకూడా అంటారు ..

నిండు కుండలు తొణకవు , నిజ సాధకులెవ్వరూ దేనికి చలించరంటారు ..

ఎవరి యొగ్యతనుబట్టి వారికానుభవాలు సిద్ధిస్తుంటాయి .. యోగ్యతలు మరచి పోటీలు మొదలయితే అసత్యాలు మొలకెత్తుతాయి , లేని అనుభవాలను చాటుకొనే వ్యక్తిత్వాలు మొదలౌతాయి.అనుకరణలు పెరిగి , ఆచరణలు కనుమరుగౌతాయి …

రాతిని చెక్కితే శిల్పమౌతుంది .

శిల్పంలోని ఆకారం ప్రబోధించిన థర్మాన్ని మనసుగ్రహించి , ఆచరిస్తే మనిషి ఉత్తగతులను సాధించుకునే ప్రయత్నంలో పడతాడు ..

అల్పజ్ఞానంతో అనుకరణ మొదలుపెడితే తానేకాక , తనను అనుసరిచేవారినికూడా, తెరచాపలేని నావలా నడిసముద్రానికి బలిచేసినవాడు కాగలడని పెద్దలమాట …

శ్రీ సాయి చరణార్పణమస్తు
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles