ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బస్టాండ్ కి వెళ్ళాము. బస్సు డ్రైవర్ ని అడిగాము. మీకెందుకు సార్ ఉదయం ఆరు గంటల కల్లా బస్సు శిరిడీ లో వుంటుంది అన్నాడు.

బస్సు ఎక్కాము. మేము ఎక్కిన బస్సు లో వేరే తెలిసి ఉన్న కుటుంబం వారు కూడా బస్సు ఎక్కారు. బస్సు బాగా తీరికగా మరునాడు ఉదయం 11 గంటలకి తీసుకువచ్చాడు శిరిడీకి.

9 గంటలకి ఇంటర్వ్యూ కి రమ్మన్నారు. బస్సు 11 గంటలకు శిరిడీ బస్టాండు చేరింది.

నేనేం చేయాలి. మాతో కూడా హైదరాబాద్ నుండి ఒక కుటుంబం వచ్చారుగా వారితో మా ఆవిడను రూమ్ వరకూ పంపించి నేను ఇంటర్వ్యూ సంగతి చూద్దామనుకున్నాను.

కాలేజీ ఎక్కడో తెలీదు అయినా తెలుసుకున్నాను. ఎవరో అన్నారు అక్కడ అన్నీ పద్దతి ప్రకారం జరిగిపోతాయి. హారతులు ఎలా పద్దతి గా సమయ పాలన వుంటుందో అన్నీ అలాగే సమయం ప్రకారం అవుతాయి.

ఈ పాటికి ఆ ఇంటర్వ్యూలు అయిపోయివుంటాయి అన్నారు. సరే చూద్దాం అనుకున్నాను. మొహం కూడా కడుక్కోలేదు.

సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్లాను. లోపల పెద్ద హాలు ఉంది. అందులో ముప్పై మంది కూర్చొని వున్నారు.

ఇంటర్వ్యూ అని అడిగాను. ఇంకా అవలేదు. ఎవరో డైరెక్టర్ ను పిలిచారుట అయన రావడం ఆలస్యం అయిందట అందుకని ఇంటర్వ్యూ లు ఇంకా అవలేదు అని చెప్పి, నా పేరు అడిగారు చెప్పాను.

క్వాలిఫికేషన్ బట్టి మీ పేరు ముందు వుంది అన్నారు. సరే కూర్చున్నాను. బోర్డు మెంబర్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళల్లో వున్నారు.

చాలా ప్రశ్నలు వేసారు. అన్నిటికీ సమాధానాలు చెప్పాను. ఇంటర్వ్యూ అయ్యింది. ఒక 5 నిముషాలు ఉండమన్నారు. ఐదు మందిని సెలెక్ట్ చేసాము మిగతా అందర్నీ వెళ్లిపొమ్మన్నారు.

నన్ను మాత్రం పిలిచి ఫ్రీ భోజనము కూపన్లు ఇచ్చి వెళ్ళి భోజనం చేసి రమ్మన్నారు. నేను రూమ్ కి వెళ్లి fresh అయ్యి భోజనము కూడా చేసుకొని మళ్ళీ మధ్యాన్నం 2 గంటలకి అక్కడికి చేరుకున్నాను.

Demonstration చేసి చూపమన్నారు. చేసి చూపించాను. చాలా సేపు అధికారులందరూ తర్జన భర్జనలు పడుతున్నారు. లోపలికి వెడుతున్నారు బయటికి వస్తున్నారు.

ఇంతలో ఒకాయన బయటికి వచ్చి సార్ మీ గురించి ఆలోచిస్తున్నాము మీ Age కొంచెం ఎక్కువుగా వున్నా మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాము. మీరు సెలెక్ట్ అయ్యారు అని అన్నాడు.

అప్పుడు నా ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు అపుడు బాబా దర్శనానికి వెళ్ళాను.

అప్పటికి మా ఆవిడ 2,3 సార్లు బాబా దర్శనం చేసుకుందిట. నేను అప్పుడు బాబాని చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు.

ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడుతిరిగి వచ్చేశాం.

15 రోజుల లో orders వస్తాయి అన్నారు. నాకు వారు 9000 రూపాయలు జీతం ఇస్తామన్నారు. నాకు 15 రోజుల లో order వచ్చింది.

అది మరాఠీ భాష లో వుంది. నాకు మరాఠీ రాదు. ఆ లెటర్ తీసుకొని చాదర్ ఘాట్ లో వున్నా మరాఠీ స్కూల్ కి వెళ్లి అక్కడి పిల్లల తో ఆ లెటర్ చదివించుకున్నాను.

ఆ లెటర్ లో వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని వుంది. నేను వెళ్లి పోతాను అంటే శంకర మఠం ITI వాళ్ళు పిల్లల ఎగ్జామ్స్ అయ్యాక వెళ్లామన్నారు.

The above telugu TEXT typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles