బాబాయే తన భక్తుని మొర విని సమస్యను పరిష్కరించారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కస్టమ్స్ ఆఫీసులో ఒక భక్తుడు గుమస్తాగా పని చేస్తూ ఉండేవాడు. ఒకసారి కస్టమ్స్ ఆఫీసర్ ఇదివరకు తనిఖీ చేసిన కొన్ని కస్టమ్ బిల్లులు మళ్ళీ ఏదో కారణం వలన అడిగారు. గుమస్తా వాటికోసం ఆఫీస్ మొత్తం గాలించిన అవి ఎక్కడ కనిపించలేదు.

అందువలన  ఆ గుమస్తా తన అధికారులు తనను మందలించడం మాత్రమే కాకుండా ఉద్యోగం నుండి డిస్మిస్ చేసి న్యాయ విచారణ కూడా జరిపిస్తారని భయపడ్డారు.

ఒక రోజు గడిచిన కూడా ఆ బిల్లులు కనుగొనలేకపోయిరు అతను. అతని అధికారులు  కూడా ఈ విషయాన్ని మరచిపోయి వాటి గురించి మళ్ళీ విచారించలేదు. కాని సహజంగానే గుమస్తా చాలా భయపడ్డారు. అందువలన అతను బాబాను ఈసమస్య నుండి రక్షించమని ప్రార్ధించారు.

మరుసటి ఉదయం అతను ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తన బల్లపై అవసరమైన ఆ బిల్లులు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రతిరోజూ అతనే ఆఫీసుకి హాజరు అయ్యే మొదటి వ్యక్తీ మరియు ఆఫీస్ నుండి చివరిగా వెళ్ళే వ్యక్తీ కూడా ఇతనే.

మరి అలాంటప్పుడు ఆఫీస్ మూసివేసిన తర్వాత ఎవరు ఆ బిల్ల్స్ తన బల్లపై ఉంచుతారు? బాబా కాక ఇంకెవరు అలా చేయగలరు అని అతను గ్రహించారు. ఆయన సరిగానే గుర్తించారు.

బాబాయే తన భక్తుని మొర విని సమస్యను ఈవిధంగా పరిష్కరించారు. తనను రక్షించనందుకు అతను హృదయపూర్వకంగా బాబాకి ధన్యవాదాలు తెలుపుకున్నారు.

Source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918) by Vinny Chitluri

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles