Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అప్పట్లో బిల్లులు తరచుగా రైళ్ళను దోచుకొంటుడేవారు. 1914లో గణపతి ధోండుకదమ్ కుటుంబం తోపాటు షిరిడికి రైలులో ప్రయాణిస్తున్నారు. వారు నాసిక్ దాటిన తర్వాత ఒక భిల్లుల ముఠా ప్రయాణీకులను దాడి చేసి, దోచుకోవాలనే ఉద్దేశ్యంతో వారి భోగిలోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ధోండుకదమ్ పవిత్ర గీతాల పుస్తకం చదువుతూన్నడు.
ఆ ముఠా అతని వద్ద ఐదు నిమిషాల పైగా నిలబడ్డారు. తాను చదివేది వారు వినాలని ఆసక్తి కలిగివున్నారని ఆలోచించి కదమ్ బిగ్గరగా చదవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత ధోండుకదమ్ తల పైకెత్తి చూసేసరికి ఒక ఫకీర్ అతనికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
మరు క్షణం అ భిల్లులు రైలు కదులుతూ ఉండగానే ఒకరి తర్వాత ఒకరు దూకి పారిపోయారు. ధోండుకదమ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకి వెళ్లి చూసాడు. ఆ భిల్లులు వెనుకకు చూస్తూ పరుగెత్తుతున్నారు. ధోండుకదమ్ వెనుకకు తిరిగి చుస్తే ఆ ఫకీర్ అక్కడలేరు. అతనికి ఏమి అర్ధం కాలేదు.
ధోండుకదమ్ షిరిడికి చేరి బాబా దర్శనం చేసుకోగానే బాబా నవ్వి “మంచిది, మీరు భద్రంగానే వచ్చారే?” అన్నారు. వెంటనే ఫకీర్ కి భయపడి ఆ భిల్లులు పారిపోయారని అతను గ్రహించాడు. అతడు బాబా పాదాల మీద పడి తనని, తన కుటుంబాన్ని కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
భక్తులు బాబాను తలుచుకున్న, తలుచుకోకపోయిన బాబా యొక్క కృప దృష్టి మాత్రం సదా తమ భక్తులపై ఉంటుంది అందానికి నిదర్శనం ఈ లీల. ఈ లీలలో గణపతి ధోండుకదమ్ బాబాను తలుచుకోలేదు. నిజానికి ఆ బిల్లులు వారిని దోచుకోవడానికి వచ్చారని కూడా అతనికి తెలియదు. అయినప్పటికీ బాబా తన భక్తునికి ఎటువంటి కష్టం కలగకుండా సురక్షితంగా షిర్డీలో తమ చెంతకు చేర్చుకున్నారు.
అది తమ భక్తుల పట్ల బాబాకు ఉండే శ్రద్ధ. అంతటి గొప్ప సద్గురుని ఆశ్రయించిన మనం ఎంతటి ధన్యత్ములమో కదా!
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- ఊధీ మహిమతో భక్తురాలి అనారోగ్యాన్ని తగ్గించి ‘గౌరి గణపతి’ పూజ నిర్విఘ్నంగా జరిపించిన బాబా వారు
- నాలుగు నెలల ముందుగా బాబా చేసిన దేహ త్యాగ సూచన
- మా ఇంటికి వచ్చిన బాబా
- నాలుగు చేతులతో….సాయి@366 ఫిబ్రవరి 11…Audio
- దైవమె సుమా! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 29
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments