నాలుగు నెలల ముందుగా బాబా చేసిన దేహ త్యాగ సూచన



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

బాబా తమ మహానిర్వాణనికి సుమారు నాలుగు నెలల ముందు, అప్పా భిల్ ని పిలిచి, “అతిథులు రానున్నారు, చికెన్ తెమ్మని” చెప్పారు. అతను తీసుకోని వచ్చిన తర్వాత బాబా తన చేతులతో కోడి పలావు మరియు చపాతీలు కూడా తయారుచేసారు.

కొంతసేపటి తర్వాత బాడే బాబా కుమారుడు  కాశీం అక్కడకు వచ్చాడు. అతనికి కోడి పలావు, చపాతీలు పెట్టారు. అతడికి రూ. 250 ఇచ్చి, ‘నీవు ఔరంగాబాద్ లో ఫకీర్వె షంషుద్దీన్ మియాను కలిసి ఈ రూ. 250 లతో ‘మౌలు’  ‘కవ్వాలీ’ మరియు ‘నియాజ్’ లను జరిపించమను.

తర్వాత ఫకీర్ బన్నేమియా  మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి ఆయనతో, “(ముస్లింల పంచాంగంలో) తొమ్మిదివ నెలలో తొమ్మిదవ రోజున అల్లా మియా వెలిగించిన ధునిని తీసుకుపోతారు. అయన దయ అలా ఉంది అని చెప్పు” అన్నారు.

బాబా ఇచ్చిన పైకము, పూలమాల తీసుకుని కాశీం, ఇమాం బాయి చోటేఖాన్, అమీర్ లు ముగ్గురు ఔరంగాబాద్ చేరారు. ఫకీర్ షంషుద్దీన్ స్టేషన్ లో రైలు వద్దకు వచ్చి “సాయి ఫకీరు వద్ద నుండి వచ్చినదెవరు?” అని విచారిస్తున్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలచిన వార్త గూడ ఆయనే చెప్పారు! తర్వాత ఆ ఫకీరు ఈ ముగ్గురికి తన ఇంత భోజనం పెట్టి, బాబా పంపిన పైకంతో అన్నదానం (నియాజ్), కవ్వాలి, సంకీర్తనలు(మౌలు) విధిగా జరిపించారు.

మరురోజు వారి బన్నే మియా వద్దకు వెళ్లారు. జనాబ్ బన్నే మియా బియాబని సంప్రదాయంలో ఒక గౌరవనీయలైన సూఫీ సన్యాసి. అతను ఔరంగాబాద్ లోని వేరుల్ దగ్గర ఖుల్తాబాద్ వద్ద స్థిరపడ్డారు.  ఆ బృందం బన్నే మియాకు చేరుకున్నప్పుడు, అయన ఒక చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడియున్నారు.

అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు. ఆ స్థితిలో ఆయనను పలుకరిస్తే ఆ ఫకీర్ ఉగ్రులై మీద కొస్తారని వారు హెచ్చరించారు. కాని గంటయినా అయన మోల్కోలేదు. తర్వాత ఆ బృందం ధైర్యం చేసి ఆయనను సమీపించి అయన మేడలో మాల వేసారు. వెంటనే అయన మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు.

కాని ఈ సంఘటన జరిగిన అనంతరం, సరిగ్గా నాలుగు నెలల తర్వాత, బాబా సమాధి చెందారు. బాబా సమాధి చెందిన విజయదశమి రోజే ముస్లిం క్యాలెండర్ ప్రకారం, తొమ్మిదవ నెలలో తొమ్మిదవ రోజు అయ్యింది. ఆవిధంగా బాబా ముందుగానే ఆ రోజు దేహత్యాగం చేయబోతున్నామని సూచించారు.

Source: Shri Sai Leela Magazine September-October 2007

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles