Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
హాయ్, నేను శ్రీ సాయి యొక్క భక్తురాలిని. నేను ఆయనకు ఎలా ఆకర్షించబడ్డనో నాకు తెలియదు, కానీ అయన నా జీవితంలో కొన్ని అనుభవాల ద్వారా నెమ్మదిగా నన్ను అతని వైపుకి లాగుకున్నారు.
జై సాయి రామ్ డియర్ సాయి, నా అనుభవాలను సాయి బంధువులతో పంచుకునేందుకు చేసే ఈ ప్రయత్నంలో బాబా మీరు నాకు సహాయం మరియు మార్గనిర్దేశం చేయాలని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను.
నేను ఇటీవల గత కొద్ది నెలలుగా సాయి భక్తురాలిని. దీనికి ముందు, బాబా తమ దృష్టి నాపై నిరంతరం ఉంచినప్పటికీ నాకు తెలియలేదు. నేను అయన ఉనికిని చూడలేక మరియు అనుభూతి చెందలేక పోయాను.
నేను వివాహం తరువాత నా భర్త ద్వారా సాయి రెక్కల క్రిందకి వచ్చాను. నా భర్త ఒక సాయి భక్తుడు, కానీ అతను తన భక్తిని ఎక్కువగా బయటకు తెలియజేయరు. అతను నిరంతరం సాయి డాలర్లతో 2 గొలుసులను ధరిస్తారు, కానీ అతను ఎటువంటి ప్రార్థనలను చేయారు మరియు తన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని బయటకు చూపించరు. ప్రార్థన చేయడానికి తన సొంత మార్గం తనకి ఉంది.
సాయితో నా మొదటి అనుభవము:
బాబా మాకు ఒక అందమైన ఆడ పిల్లను ఆశీర్వదించిన తరువాత నేను నా అత్తమామలకు వారి మనుమరాలను చూపించడానికి వాళ్ళ ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకుని, నేను కారులో విమానాశ్రయానికి వెళ్లబోతున్నా సమయంలో, నా హ్యాండ్బ్యాగ్లో సాయి చిత్రం సరిగ్గా సగానికి చిరిగిపోయింది. సాయి నాకు ఇచ్చిన క్లూని నేను సరిగా అర్థం చేసుకోలేదు, కానీ ఈ విషయం గురించి నేను ఏదో చెడ్డగా భావించి నా భర్తతో చెప్పాను. అతను చింతించవద్దు, అంతా బాగుంటుంది అని చివరి క్షణం విమాన రద్దు గురించి ఆలోచించలేదు.
నేను విమానంలో భారతదేశంనకు బయలుదేరాను. నా అత్తమామలతో సమయం గడపడానికి భారతదేశానికి నా మొదటి యాత్ర. నేను వివాహం తర్వాత వారితో ఎక్కువ సమయం గడపలేదు. వెళ్ళిన 2 రోజులు అంత బాగా జరిగాయి, కాని తరువాత వారితో సంబంధం దెబ్బతింది.
మొదట నేను అర్థం చేసుకోలేకపోయాను, కాని తరువాత సాయి ఫోటో సగానికి చిరిగిపోవడం యొక్క ప్రాముఖ్యత నా అత్తమామలతో సంబంధం తెగిపోవడంనకు బాబా సూచన అని నాకు అర్ధం అయ్యింది. సాయి సందేశాన్ని అర్ధం చేసుకొని ఆ యాత్రను నేను రద్దు చేసుకొని ఉంటె, నేను వారితో సంబంధాన్ని సేవ్ చేసుకోగలిగి ఉండేదాన్నిఅని ఈ రోజు కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను.
నా అసహనమైన వైఖరి కారణంగా నేను చాలా తప్పులు చేసి ఈ సంబంధాన్ని తెంచుకున్నాను. కానీ ఇప్పుడు నేను బాబా పవిత్ర పాదాల చెంతకు వచ్చి, నేను మరింత సహనంగా ఉండటం నేర్చుకున్నాను. దీనిలో సాయి నన్ను ముందు జరుగానున్నదానిని నాకు సూచించారు ఇది నా మొదటి అనుభవం.
మరో ముఖ్యమైన అనుభవం:
నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొద్ది రోజుల్లోనే, ఉద్యోగం కోసం నాకు ఆఫర్ వచ్చింది. ఇక నేను 2 రోజుల్లో పనిలో జాయిన్ అవుతాననగా అఫర్ రద్దు అయ్యింది. నేను చాలా నిరాశ చెందాను, తరువాత సాయి నవ గురువర వ్రతం మొదలుపెట్టాను. కొద్ది వారాలలో నాకు మరొక ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది.
ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతూన్నను. అప్పుడు నా భర్త నాకు మాక్ ఇంటర్వ్యూ ప్రశ్నలు అడిగినప్పుడు నేను వాటికీ సమాధానం చెప్పలేక అటువంటి ప్రశ్నలు వలన నాపై నాకున్న విశ్వాస స్థాయి తగ్గుతుందని అతనిపై కూడా అరవటం జరిగింది. కానీ అయన ఆ ప్రశ్నకు సమాధానమివ్వడంతో ఆయన నాకు సహాయం చేసి నన్ను శాంత పరిచేవారు.
మరుసటిరోజు ఇంటర్వ్యూలో నా భర్త మునుపటి రోజు అడిగిన అదే ప్రశ్నలు అడిగినప్పుడు నేను నా ఆశ్చర్యానికిలోనయ్యి నమ్మలేకపోయాను. నేను ఆశ్చర్యకరంగా వారికి సమాధానమిచ్చాను. వారు నా స్పందనతో చాలా తృప్తి చెందారు మరియు నా సమాధానాలు నాపై వారికీ మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచింది. అదే నాకు ఆఫర్ పొందడానికి నాకు సహాయపడింది.
మా ప్రియమైన సాయి కాకుండా, అటువంటి ఒక అద్భుతాన్ని ఎవరు నిర్వహించగలరు? నా భర్త ద్వారా నా జీవితంలో ఈ ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చినందుకు సాయికి నేను కృతజ్ఞురాలిగా ఉన్నాను.
నేను ఎప్పుడూ బాబా ను ప్రార్థిస్తు ఉంటాను, నేను అయన నామజపం చేయకుండా ఒకరోజు ఊహించలేను. ప్రియమైన సాయి, ఎల్లప్పుడు దయచేసి మీ గురించి ఆలోచిస్తూ ఉండేలా అనుగ్రహించండి. జై సాయి రామ్
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నాలుగు నెలల ముందుగా బాబా చేసిన దేహ త్యాగ సూచన
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- బాబా మమ్మల్ని కరుణించి మా ఇంటికి వస్తున్నవా బాబా
- కారు గుద్దగానె నేను బాబా బాబా బాబా …అంటూ బాబా నామం చెబుతూ సృహ కోల్పోయాను.–Audio
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments