Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్
నా పేరు మేడా లక్ష్మిప్రసన్న, హైదరాబాద్.
భగవంతుడు నిరాకారరూపంలో మన చుట్టూ ఉంటూ మనల్ని అన్ని వేళలా కాపాడుతూ ఉంటారు. ఈ విషయo అందరికి తెలుసు.
కాని మనస్పూర్తిగా ఒప్పుకునేది ఎంత మంది, జరగవలసినది జరుగుతుంది అని వదిలేస్తాము.
బాబాని నమ్మితే మన విషయాలు అన్ని ఆయనే చూసుకుంటారు, వెంట ఉంటారు, దానికి మనం చేయవలసింది మనం మనసు లో ఆయనను గుర్తుపెట్టుకోవడం.
బాబా మీద నమ్మకం, తల రాతకి మద్యన నలిగిన జీవితాలు, ఇవి రాస్తూ ఉంటేనే నాకు కళ్ళలో నీళ్ళు ఏమి కనిపించడంలేదు.
మా బావగారు (మా వారి అన్నయ్య ) చాలా మంచి మనిషి, పూజలు బాగా చేస్తారు.
ఆయన ప్రేమకు ఎవరు సాటి రారు. మా వారికీ తండ్రి లేరు. ఆ లోటు తెలియకుండా చూసుకోనేవారు.
ఆయనకి బాబా గురించి అన్ని విషయాలు చెప్తూ ఉండేదాన్ని, ఆయనకు మనసు బాలేకపోయిన నాకు కాల్ చేసి మాట్లాడేవారు. అన్నిటికీ బాబా కథలు ఉదాహరణగ చేప్పేదాన్ని.
ఆయన జీవితం సమస్యల వలయం, పారాయణం, బాబా గుడిలో ప్రసాదాలు పంచడం అన్ని చేసేవారు.
అన్నిటికంటే ముందు మానవత్వం ఉన్న మనిషి, అన్ని బాబా చూసుకుంటారు. మీరు పారాయణం ఆపవద్దు అంటే అలానే చేసారు.
ఇలా ఉండగా ఒకరోజు నేను చాలా పొద్దునే కాల్ చేసి బావగారు నాకు ఒక కల వచ్చింది.
మీరు బాబా గుడిలో ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని అన్నదానం కోసం బియ్యం అడిగారు. మీరు బియ్యం లేవు ఏమి లేవు, అని అన్నారు.
అక్కడనుండి మీరు వెళ్ళిపొయ్యారు, అప్పుడు బాబా చెప్పారు సరే కాని బియ్యం వద్దులే కనీసం పులిహోర అయినా పంచమను అన్నారు.
ఏంటో నాకు ఇలా కల వచ్చింది అని చెప్పాను, ఆయన phone పెట్టేసారు.
కొద్దిసేపటికి మల్లి కాల్ చేసారు. ఏంటి బావగారు అన్నాను, ఏమి లేదు అమ్మాయి నిన్న సాయంత్రం గుడిలో ఇది నిజంగా జరిగింది.
వాళ్ళకు నేను ఫోన్ చేసి చెప్పాను, ఒక బస్తా బియ్యం ఇస్తాను అని, ఇప్పుడు నీకు చేశాను అన్నారు.
నా మనసు బాలేదు అందుకే అలా అన్నాను, లేకపొతే నేను ఆలా అనను కదా అన్నారు.
ఇలా ఆయన విషయాలు బాబా అన్ని పట్టించుకొని సరిచేస్తూ ఉండేవారు.
కొన్ని రోజులు తరువాత వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేయమను అని నాకు కలలో చెప్పారు.
మల్లీ ఇలా కల వచ్చింది, ఏమి లేనిది బాబా అలా చెప్పరు, మనం అమ్మయికి పెళ్లి చేద్దాము, అదే వయసు కదా అని బాగా పట్టుపట్టాము నేను, మావారు.
అన్ని విషయాలు నమ్మే మనిషి ఈ విషయం మాత్రం పక్కన పెట్టారు.
కొద్దిరోజుల తరువాత నేను షిర్డీలో ఉన్నాను. ఎందుకో తెలియదు ఒక రోజు రాత్రి కలలో వాళ్ళ అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుంది.
ఆ అమ్మాయి ఆలా ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను బాదగా అనిపించి, మా వారితో అన్నాను ఎదో బాబా చెప్తున్నారు, మీ అన్నయ పట్టించుకోలేదు. ఏమి చేద్దాము అనుకున్నాము.
అదే రోజు మేము హైదరాబాద్ వచ్చాము. షిర్డీ విషయాలు బావగారికి చెప్పాలి.
నేను అన్ని విషయాలు ఆయనకు చెప్పిన తరువాతే మా అమ్మకి చెప్పేదాన్ని, అంత అబిమానం.
అదేరోజు షిర్డీ నుండి రావడం వల్ల బడలిక, ప్రసాదాలు పంచడం, బిజీగా ఉన్నాను, phone చేయలేదు.
మా వారికీ చెప్తే తను పట్టించుకోలేదు, ఇలా సాయంత్రం ఐదు గంటల సమయములో నాకు phone వచ్చింది.
నా గుండె బద్దలు అయ్యింది. మా బుజాలు విరిగిపోయ్యాయి. గుండెనొప్పితో బావగారు చనిపోయ్యారు.
నేను టైపు చేయలేకపోతున్న, నాకు ఇప్పటికి అదే బాధ ఆయన విజయదశమీ రోజున పొయ్యారు.
మేము దసరాకి అని వెళ్తే బాబా ఏంటి దశమికి ఉండనివ్వలేదు నన్ను పంపించేసారు, అని చాలా బాధపడ్డాను.
అసలు విషయం బాబాకి తెలుసు కదా అందుకే మమ్మల్ని ఇంటికి పంపించేసారు.
బాబా చెప్పినప్పుడు పెళ్లి చేసి ఉంటె ఒక బాద్యత తీరేది, కాని ప్రయోజనం లేదు.
దానికి తోడు నోట్ల కష్టాలు వాళ్ళని వదలలేదు. ఆయన చేసిన పుణ్యం ఆ పిల్లలకి కలసిరావాలని మనసార బాబాని ప్రర్దిస్తున్నా.
ఓం సాయి రామ్, బాబా అన్ని వేళల మనల్ని కనిపెట్టుకొని ఉంటారు.
ఆయన ప్రేమ తల్లి, తండ్రికి కూడా సాద్యం కాదు, ఇది ముమ్మాటికి నిజం.
బాబాని మనము ప్రేమిద్దాంo, ఆయన మనల్ని ప్రేమించేలా చేసుకుందాము.
సాయినాథ్ మహరాజ్ కి జై .
Latest Miracles:
- జరగబోయే విషయము ముందుగా తెలియ చేసిన బాబా.–Audio
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
- సాయి అంకిత భక్తులైన తండ్రి కొడుకులకు బాబా వారు చేసిన సాయం–Audio
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
- బాబా చేసిన ఫోటో చమత్కారం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “జరగబోయే విషయము ముందుగా తెలియ చేసిన బాబా.”
kishore Babu
April 20, 2018 at 1:01 pmనిన్ననే ..మమ్మల్ని కూడా బాబా వారు …పులిహోర చేయించి బాబా మందిరములో ఇమ్మన్నారు…ఇచ్చాము ..
kishore Babu
April 20, 2018 at 1:09 pmఈ లీల చదువుతుంటే …మాకు కూడా చాలా..భాధ గ అనిపించింది…మీ లీలలు…ఇంకా షేర్ చేయాలనీ..మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..
T.V.Madhavi
April 20, 2018 at 5:04 pmVijayadasami roju poyaru.ante,he merged in sai..Chala baaga raasaru madam..Sairam.