Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
కేవలం శరీరభోగాలకే సద్గురువును ఆశ్రయిస్తే, అంతకన్న మించిన ప్రారబ్దం మరొకటి ఉండదేమో.
********
అన్నిట్లో తృప్తిగా జరిగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు కానీ నిజానికి తృప్తిగా జీవిస్తున్నవారు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు ? ఎందుకు మనుషులకింత నిరాశ , నిస్పృహలు. వెనక్కుతిరిగి ఆలోచించుకొనే వ్యవథి ఎందరికుంది …
అదికారం , అంగబలం ఉన్నవాడిచుట్టూ అవకాశవాదులు , లేనివి ఉన్నట్టుగా తెగపొగడ్తలతో తెలివితేటలను ప్రదర్శించేవాళ్లున్నారు ..
ఇల్లు కాస్త మరమ్మత్తులకుగురైతే , సుఖజీవనానికి ఇబ్బందిలేకుండా అప్పుచేసి మరీ సరిచేసుకొనేవాళ్ళు కనబడతారు ..
కాలవ్యవస్థకు అనుగుణంగా వృద్ధిచెందే శరీరంలో కంటికి సంబంధించో , ఒంటికి సంబంధించో అనూహ్యమైన మార్పులొస్తే , క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటలు చుట్టూ తిరుగుతూ జాగ్రత్తపడేవాళ్లు ఉన్నారు ..
శరీరంతో ప్రతి క్షణం పరిస్థితికి అనుకూలంగా మనసూ చలిస్తూంటుంది ..
జీవన గమనంలో ఎత్తుపల్లాలను అధిగమించేందుకు అనుభవమున్న పెద్దవాళ్ల సలహాలు తోడ్పడవొచ్చు , శరీర రుగ్మతలకు వైద్యుడి సాయంతో నయం చేసుకోవొచ్చు …
ధనం ఉంటేచాలు అన్నీ సాధించుకోవొచ్చని కొందరు దానికోసమె పాకులాడుతుంటారు ..
కోట్లరూపాయలు ఖర్చుపెట్టగలిగిన స్థాయిలో ఉన్నవాడికి కూడా జబ్బుచేసి , వందమంది నిపుణులైన డాక్టర్ల సంరక్షణలో ఉంచినా మృత్యుముఖంలోనుండి కాపాడుకోడం కష్టమౌతుంది..
అవసరాలకు తగ్గట్టు సాయమందించే మనుషులు ఎదురుకావొచ్చు కానీ ఆదుకొన్నవాడు, సాయాన్ని పొందినవాడుకూడా ఒకనాటికి కదిలిపోయేవాళ్లే ..
మొగ్గతొడిగి వికసించిన పుష్పం వాడి, నేలకొరగడం ఎంతసహజమో ఎదిగేశరీరం ఒకనాటికి నేలకూలడం సృష్టిధర్మం ..
భోగానికి శరీరం , యోగానికి మనసు అంటారు ..
అమ్మానాన్నా , భార్యాబిడ్డలు , బంధుమిత్రుల బాంధవ్యాల తోడ్పాటులేక జీవితం రక్తికట్టదు .
నిలకడలేని మనసుకు నింపాదినందించే సద్గురు సాయంలేక జన్మ తరించే ఉపాయానికి మార్గంలేదు.
అంతటి సమర్థుడైన సద్గురువును కేవలం శరీరవాంఛలకే పరిమితమౌతూ ఆశ్రయిస్తే అంతకన్నా మించిన ప్రారబ్దం మరొకటిలేదని పెద్దలమాట …
జయ్ సాయి గురు సమర్థ
*******
Latest Miracles:
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments