బాబా దయ వల్ల మా ఆవిడ మొటిమలు మాయం అయ్యాయి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు రమేష్ బాబు.

నేను డైరీ కార్పొరేషన్ లో పని చేసి రిటైర్ అయ్యాను.

మా ఆవిడా పేరు లలిత. హైకోర్ట్ లో పని చేస్తుంది.

మాకు ఇద్దరు అమ్మాయిలు.

మేము Dilsukhnagar సాయి బాబా గుడి దగ్గరలో ఉంటాము.

నేను ముందు వేంకటేశ్వర స్వామి భక్తుడును.

తరుచు తిరుపతి వెళ్ళేవాళ్ళము.

మా ఆవిడ మాత్రం చిన్నప్పటినుంచి ఆంజేనేయా స్వామి భక్తురాలు.

ఆమె ఆంజనేయ స్వామి ని పిలిస్తే పలికేంతగా ఉండేవాడు.

ఆమె పరీక్షలన్నీ పాస్ అయి జాబ్ కూడా సంపాదించింది.

పెళ్లి నాతోటి అవడం, పెళ్లి అయినా నాలుగో నాడే నాతో పాటు షిర్డీ కి రావడం జరిగింది.

అప్పటి దాకా ఆమె కు బాబా అసలు తెలియదు.

నాకెలా పరిచయము అంటే, కొన్నాళ్ల క్రితము శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం అనే సినిమా వచ్చింది.

అనుకోకుండా నేను ఆ సినిమా చూసాను.

అప్పటి నుండి నాకు బాబా అంటే గురి ఏర్పడింది.

నాకు తాగుడు అలవాటు ఉంది.

అదొక్కటే కాదు, ఇంకా వక్కపొడి, గుట్కా అలవాట్లు కూడా ఉండేవి.

ఆ వ్యసనాలని ప్రతి గురువారం నాడు ప్రక్కన పెట్టి తప్పనిసరిగా బాబా గుడికి వెళ్ళడము అలవాటు చేసుకొన్నాను.

ఆలా మూడు సంవత్సరాలు గడిచింది.

ప్రతి గురువారం కూడా ఒక నిర్ణీత సమయము అంటూ ఏంలేదు.

ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే గుడికి వెళ్ళుతుండేవాడిని.

ఆలా ఉండగా ఒకరోజు మన ఇంట్లోనే బాబాకి ఆరతిని ఎందుకు ఇవ్వకూడదు అనిపించి ఉదయాన్నే 4 . 30 కి గుడిలో ఇచ్చినట్లు కాకుండా 6 .00 కి కాకడా ఆరతిని ఇవ్వడం మొదలు పెట్టాను.

ఆ సమయంలో మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఆరతి లో పాల్గొనేవారు కాదు.

కేవలము నేను మాత్రమే ఆలా చేస్తుండేవాడిని.

ఆ తర్వాత కొన్నిరోజులకి మా ఆవిడ పనిచేస్తున్న ఆఫీసులో శ్రీ రమణానంద మహర్షి వారి శిష్యులు ఉన్నారు.

వాళ్ళ ప్రోద్బలంతో నేను రాత్రి ఆరతి ఇస్తాను,మీరు ఉదయము కాకడ ఆరతి ఇస్తున్నారు కదా మనకి మిగిలిన రెండు ఆరతలు చేయడము కుదరదు.

కాబట్టి నేను రాత్రి ఆరతి ని ఇస్తానుఅని తను ఆరతి ని ఇవ్వడము మొదలు పెట్టింది.

నేను ఎప్పుడైతే తొందరగా ఆఫీస్ నుండి వస్తే నేను ఆరతి లో పాల్గొనడము జరిగేది.

ఆలా ఉదయము నేను , రాత్రి ఆమె ఇద్దరం చెరో ఆరతి ని ఇవ్వడము నేను రిటైర్ అయ్యేంతవరకూ కొనసాగింది.

ఇప్పుడు రెండు హారతులు ఇద్దరమూ ఇస్తున్నాము.

మా పెళ్లిఅయిన తర్వాత నాల్గోనాడే మేము షిర్డీ వెళ్ళడము జరిగింది అని చెప్పాను కదా! ఆమెకి అప్పటికి బాబా గురించి ఏమితెలియదు.

అయినా కానీ నాగురించి వచ్చింది.

అప్పటిలో షిర్డీ లో గురుస్థానము లో వేపనూనె ఒక మూకుడులో ఉంచే వారు.

ఎవరికైనా అనారోగ్య భాధలు ఉన్న వాళ్ళు ఆ నూనెను తీసుకొనే వెళ్లేవారు.

అప్పటికి మా లలితకి మొహం నిండా మొటిమలు ఉన్నాయి.

మా ఆవిడా మొహం చూసి ఎవరో ఒక పెద్దావిడ చెప్పారు.

” పెద్ద పెద్ద వ్రణాలే ఆ నూనె రాసి నందు వల్ల తగ్గిపోతాయి. నీ మోహన ఉన్న ఆ మొటిమలు తగ్గవా? కొంచెం తీసుకెళ్ళు తల్లీ! ” అన్నారు.

మా ఆవిడ ఏమో ఏపుట్టలో ఏ పాముందో అనుకుని ఆ నూనె కొంచెం తెచ్చుకుంది.

అది వాడాక కొద్దీ రోజులకి మా ఆవిడ మోహన మొటిమలు మాయం అయ్యాయి.

ఆ తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

తర్వాతి భాగము (బాబా వారు వారికీ తర్వాత చేసిన లీల)

సంపాదకీయం : లక్ష్మి నరసింహారావు గారు రచించిన నేటి సాయి భక్తుల గాధలు.

వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles