బాబా దయతో బాలుడి కుంటితనం నయం చేసారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

1956 సంవత్సరంలో విధవరాలైన ఒక స్కూల్ టీచర్ గారి అబ్బాయి SSC పరీక్ష కోసం హాజరయ్యాడు. బాలుడు చివరి పరీక్ష వ్రాసిన తరువాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతను అధిక జ్వరంతో బాధపడుతున్నాడు. సరైన వైద్యంతో బాలుని జ్వరం తగ్గింది; కానీ బాలుడు తన కాళ్ళలో శక్తిని కోల్పోయి లేచి నిలబడి లేకపోయేవాడు. ఎక్కడైనా వెళ్ళాలంటే బాలుడుని ఎత్తుకొని తీసుకువెళ్ళాలి.

ఎన్నో ప్రయత్నాలు చేసారు కానీ, అన్ని రకాల వైద్యములు నిరార్ధకమయ్యాయి. అటువంటి సమయంలో శ్రీ సాయిబాబా యొక్క మహిమల గురించి విన ఆవిడా తన కుమారుడిని షిర్డీకి తీసుకువెళ్ళింది. ఆవిడా బాలుడిని కులీ వాని భుజంపై కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణ చేయిస్తుంది.

తన కుంటితనం వల్ల బాలుడు కూలీ వాని భుజాలపై కూర్చొని బాబా సమాధికి ప్రదక్షిణ చేయడానికి సిగ్గుపడి, తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి తాను ఒంటరిగా వసతి గృహంలో ఉన్నాడు. రెండు రోజులు ఆమె మాత్రమే సమాధి మందిరానికి వెళ్లి తన కొడుకు కుంటితనం నయం కావాలని బాబాను ప్రార్ధించింది.

వారు మూడవ రోజు షిర్డీ నుండి తిరుగు ప్రయాణం అవుతుండటంతో చివరిసారిగా ఆమె సమాధి మందిరంలో హారతికి హాజరయ్యి బాబాకి నమష్కరములు సమర్పించుకున్నది. అదే సమయంలో వసతి గృహంలో ఉన్న బాలుడి ముందు బాబా కనిపించి “ధైర్యం ఉండు!” అని చెప్పిరు. తర్వాత ఆయన బాలుడి చేతిని పట్టుకొని, మందిరంలోకి తీసుకోని వెళ్లారు. అక్కడ బాలుడిని ఒక స్తంభం పట్టుకొని నిలబడమని చెప్పి ఆయన అదృశ్యమయ్యారు.

ఆరతి అయిన తర్వాత ఆమె వసతి గృహానికి వెళ్లి చుస్తే గదిలో కొడుకు కనిపించలేదు. కన్నీరు నిండిన కళ్ళతో ఆమె మరోసారి సమాధి మందిరానికి వచ్చి బాబాకి ప్రార్థన చేసి, వెనుకకు తిరిగినప్పుడు ఆమె దృష్టి స్తంబం వద్ద నిలబడి ఉన్న బాలుడిపై పడిపోయింది. బాలుడిని అక్కడకు ఎలా రాగలిగావు అని ఆమె అడిగింది.

తాను అక్కడికి రావటానికి బాబా సహాయం చేసారని బాలుడు వివరించాడు, కానీ తల్లి నమ్మలేక పోయింది. తరువాత ఆమె మద్దతుతో బాలుడు గదికి నడిచి వెళ్ళగలిగడంతో ఆమె మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. బాబా చూపిన కరుణకు ఆమె మనఃస్పూర్తిగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంది. తరువాత బాబా అనుగ్రహం వలన బాలుడు ఒక నెలలో పూర్తిగా కోలుకొని స్వేచ్ఛగా కదలగలిగాడు.

source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles