నా భర్తను వైద్యులకే   వైద్యులైన  సాయి నయం చేసారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయిరాం

నా సోదరి తరపున నేను ఈరోజు ఈ లీలను మీతో పంచుకుంటున్నాను

నా పేరు అనురాధ,

నా వయస్సు 56 నేను చెన్నై నివాసిని

ఫిబ్రవరి 8, 1997 నేను ఆఫీస్ కి బయలుదేరుతుండగా నాకు ఎదో అలజడి తెలియని భయంకరమైన భావన కలిగింది. ఇంట్లోనే ఉందామని నిర్ణయించుకున్నాను

ఆ సమయం లో నా భర్త తీవ్రమైన జ్వరం తో బాధ పడుతున్నారు ఏ మందులు పని చేయలేదు.

కొంత సేపటికి జ్వరం తీవ్రత పెరిగి అపారమరక స్థితి లోకి వెళ్లిపోయారు, వెంటనే ఆయనను అత్యవసర విభాగంలో చెరిపించాను

అయన పరిస్థితి విషామంగా ఉందని బ్రతికే అవకాశాలు తక్కువని అక్కడ వైద్యులు చెప్పారు.

ఆయనకు ఒక విధమైన మెదడు వాపు వ్యాధి వచ్చిందని బ్రతికిన కదలలేని స్థితి లో ఉంటారని తెలిపారు

నేను నిస్సహాయురాలిగా దిక్కు తోచని పరిస్థితి లో ఉండిపోయాను, అలాంటి  విపత్తర పరిస్థితులలో సాయి నాకు అండ గా నిలిచారు

మా దగ్గర బంధువులు నాకు సాయి సచ్చరిత్ర చదవమని ఇచ్చారు, అప్పటివరకు నేను ఆ పుస్తకం గురించి వినలేదు.

నేను వెంటనే ఆ పుస్తకము కొని అత్యంత భక్తి శ్రద్ధలతో సాయి మాత్రమే నా సహాయకుడని భవిస్తూ చదవనారంభించను. 48  గంటలు గడిచిన పిదప ఒక అద్భుతం జరిగింది 

నేను నా సోదరి మైలాపూర్ లోని సాయి బాబా గుడి కి వెళ్లి బాబా ఆశీర్వాదములు తీసుకుని ఊది తో ఆసుపత్రి కి వచ్చాము

అప్పటివరకు మాకు ఊది గురించి అవగాహనా లేదు నా భర్త ౩ రోజులు నుండి కోమా లోనే ఉన్నారు, ఆయనకు బాబా ఊది పెట్టి బాబా ను ప్రార్ధించాను.

కొంతసేపటికి నా భర్త పడుకున్న మంచం చుట్టూ ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది, నా భర్త అయన కాళ్ళను కదుపుతున్నారు

ఎంతో అద్భుతమైన అనుభూతిని లోనయ్యాను, క్రమేపి నా భర్తను వైద్యులకే   వైద్యులైన  సాయి నయం చేసారు

అక్కడి వైద్యులు ఇది వైద్య శాస్త్రం లో అపురూమైన సంఘటమని పేర్కొన్నారు

ఒక 15  రోజులయ్యాక ఆయనని ఇంటికి తీసుకొని వచ్చాము, సాయి కృప వల్ల అయన చాల ఆరోగ్యం గా ఉన్నారు

సాయి బాబా చెప్పినట్లు అయన సమాధి లో నుంచి కూడా పలుకుతారు

కాబట్టి సాయి భక్తులారా మనము సాయి ని శ్రద్ధ భక్తులతో పిలిస్తే తప్పక సహాయం చేస్తారు

ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు

ఓం సాయిరాం

సునంద, చెన్నై.

This Miracle Translated to Telugu: Mrs. Bhanu Jyothi

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles