ఊధీ మహిమతో భక్తురాలి అనారోగ్యాన్ని తగ్గించి ‘గౌరి గణపతి’ పూజ నిర్విఘ్నంగా జరిపించిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గౌరి గణపతి(గణేష్ చతుర్థి) రావడానికి కొన్ని రోజులే వుంది. మా దేశంలో అంటే మహారాష్ట్రలో చాలా పెద్ద ఉత్సవం. మేమంతా పండగ సందడిలో వున్నాం.

ఒక రోజు రాత్రి వున్నట్లుండి నా వీపు మీద చాలా దురద, నొప్పి వేసింది. ఏమై వుంటుంది అనుకున్నాను. చూస్తే చిన్న కురుపు లేచింది, పోతుందులే అనుకున్నాను అది రాత్రి కల్లా పెద్దగా పుండు రూపం దాల్చింది. నిమ్మకాయంతగా పెరిగింది. చెప్పలేనంత నొప్పిగా వుంది, దానితో జ్వరం. అప్పుడు నాకు ఆ సాయినాథుడు గుర్తువచ్చారు.

నాకు ఇప్పుడు వయసు 81 సంవత్సరాలు. చిన్నప్పుడు ఏప్పుడన్నా ఇలా కురుపులు వచ్చాయేమో నాకు గుర్తు లేదు. ఇంక రెండు మూడు రోజుల్లో ఆ కురుపు పెద్దగా అవుతూ వచ్చింది. పడుకోవడం కూడా నాకు కష్టం అనిపించేది. నాకు కుడిచేతి వైపు వచ్చినందు వలన చెయ్యి పైకి కూడా ఎత్తలేక పోయేదాన్ని.

రోజు పొద్దున్న స్నానం చేసి పూజ చేసేదాన్ని, అన్ని మానేసాను. సమయానికి మా ఇంటి doctor కూడా వేరే వూరు వెళ్ళారు.

మా అబ్బాయి దాన్ని చూసి “అమ్మ ఇది operation చేస్తె కాని పోదు” అన్నాడు. నాకు operation అంటే చాలా భయం, వయస్సు అయిపోయింది. అప్పుడు బాబాను వేడుకున్నాను.

“స్వామి గౌరి గణపతి రూపంలో నా ఇంటికి వచ్చే నువ్వు, ఈ సంవత్సరం రావా! ఎలా ఈ నొప్పి భరింపరానిదిగా వుంది. చెయ్యలేనేమో ప్రభూ, సాయి. ఇంక నువ్వే ఏదో చెయ్యాలి.” అనుకుంటూవున్నాను.

ఇంతలో postaman ‘Sai leela’ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు. నేను ఆ పుస్తకం తెరిచి చూస్తున్నాను. దానిలో బాబా విభూతి మహిమ రాసి వుంది.అంటే ఎప్పుడూ లేస్తూ, కూర్చుంటూ, బాబా, బాబా అనే నేను, విభూతి ఏలా మరచి పోయాను? ఇన్ని రోజులు ఇంట్లో ఔషధం పెట్టుకొని, ఎక్కడో వెతుకుతున్నాను? ఆ Sai Leela పుస్తకం ద్వారా నాకు బాబా అదే గుర్తుచేశారు అంతె.

వెంటనే వెళ్ళాను, విభూతి కొంచెం ఆ కురుపు పై మా కోడలిని రాయమన్నాను నేను కొంచెం నీళ్ళలో కలుపు కొని తాగినాను. అప్పుడు బాబాను ప్రార్ధించాను. “బాబా ఈ కురుపు దాని అంతట అదే పగిలిపోని నాకు operation అంట, ఈ వయస్సులో తట్టుకోలేను. భయంగా వుంది’ నువ్వే రక్షించాలి, అని వేడుకున్నాను.

దాని తరువాత రోజు మా family doctor వచ్చేసారు. నా కురుపు గురించి చెప్పాను. అతను చూసి’ ఏదీ, ఏమిలేదు పిన్నిగారు అంతా normal గా వుంటే అన్నారు.

నాకు అనిపించింది, ఏమైంది ఈ doctor కు ఏమి కనబడలేదా! అనిపించి అడిగాను. ఒక పెద్ద కురుపు వుండినది నిన్నటివరకు, చాలా నొప్పిగా వుండేది. మరి నీకు ఇప్పుడు ఏమి కనపడలేదా! అని అడిగాను’ లేదు పిన్ని’ అది మచ్చపడి పోయింది, ఎందుకు operation ఆది మాయం అయిపోయింది అని చెప్పాడు.

నా ఆశ్చర్యానికి అంతులేదు అసలు, అప్పుడు అనుకున్నా , నా ‘గౌరి గణపతి’ పూజ నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని బాబా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు ఏ కష్టంలేకుండా.

మనం ఏదైనా దైవ కార్యం చేయాలంటే సదా సర్వదా ఆ సాయినాధుని అండదండలు, కృపా దృష్టి తప్పకుండా మన మీద వుంటాయి. ఓ సాయిదేవా నీ కృపా దృష్టి సదసర్వదా అందరి మీద ఇలాగే వుండాలీ.

సర్వం సాయి నాధార్పణమస్తు

మాలతి
ఠాణా, మహారాష్ట్ర

 

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

4 comments on “ఊధీ మహిమతో భక్తురాలి అనారోగ్యాన్ని తగ్గించి ‘గౌరి గణపతి’ పూజ నిర్విఘ్నంగా జరిపించిన బాబా వారు

kajal

ganapathini baba ne rappincharu…jai sai gouriganapathi..

dillip

jai sai ganapathi.

Madhavi

om sri sai ganesaya namaha..

gautam

u r doing gud work.Madhu

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles