Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఇది చాలా అద్భుతమైన అనుభవం
బెంగళూరు కర్ణాటకలో నివసించే వందనా కామత్ ఇలా అంటున్నారు. బాబా చమత్కారం జరిగే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు నాకు బాబా గురించి కాని, ఆయన నివసించే ప్రదేశం కాని అసలు తెలియదు. అలాంటి వందన ఇప్పుడు సంపూర్ణంగా బాబా మయం అయింది.
ఒక్కప్పుడు వందన వాళ్ళ కుటుంబం చాలా కష్టాల్లో వుండేవాళ్ళు. ఇంటి అద్దె కూడా ఇవ్వలేని పరిస్థితిలో వుండేవాళ్లు అతి కష్టం మీద వారి ఇల్లు గడిచేది.
అప్పుడు వాళ్ళకి బాబా గురించి ఏమి తెలియదు. వాళ్ళ పేదరికం చూడలేక వాళ్ళ ఇంటి owner ఒక సాయి సచ్చరిత్ర ఇచ్చి బాబా గురించి చెప్పి, ఇది చదివి, బాబాను ప్రార్థన చేయి, ఈ కష్టాల్లో నుంచి మిమ్మల్ని రక్షించమని వేడుకో, అయన మీకు తప్పకుండ సహాయం చేస్తాడు అని చెప్పింది. ఇది విని వందనా చాలా సంతోష పడింది.
కొన్ని నెలలు గడిచాక ఇంకో కష్టం వచ్చిపడింది. ఏంటి అంటే వాళ్ళ ఇంటి owner ఇల్లు ఖాళీచేయమని చెప్పింది. ఆమెకు అది పెద్ద shock.
ఎక్కడికి వెళ్ళాలి, ఏలా చేయాలి. అస్సలు ఏమి తోచలేదు. అలాంటప్పుడు ఎవరో వచ్చి Shirdi కి వెళ్దాం వస్తావా, అంటే, వెంటనే హ ! వస్తాను అని చెప్పి వెళ్ళింది.
బాబాను ఆనందంగా దర్శించుకొని, బాబా మా కష్టాలను గట్టునవేయి ప్రభు అని మొక్కుకొని వచ్చింది.
ఒక రోజు ఒక friend పిలిస్తే వెళ్ళింది. తన కష్టాలన్నీ చెప్పుకుంది. ఆ friend అన్ని విన్నాక, నీవు నా ఇల్లు తీసుకోని వుండు అని ఒక సలహా ఇచ్చింది. అది విని వందనా ఆశ్చర్య పోయింది.
ఇంటి rent కట్టలేకుండా వున్నాను. ఇంక కొనడం ఏలా కుదురుతుంది అని ఆలోచించింది. అలా రోజులు గడుస్తున్నాయి, ఒక రోజు sudden గా వందనా వాళ్ళ friend వాళ్ళ ఇంటికి వచ్చి, 15,000 రూపాయలు ఇచ్చి మా ఇల్లు తీసుకోకుంటే వదిలేయ్, కాని ఇక్కడ దగ్గరలో బాబా మందిరం దగ్గర స్థలం వుంది, వెంటనే వెళ్లి తీసుకో అని చెప్పింది.
ఇంక అందరం స్థలం కొనుక్కుందాము అనుకున్నాం. ఇంతలో చూస్తే ఆ స్థలం లక్షల్లో వుంది. అంత పైసలు లేవు దగ్గర, మరి ఎలా తెస్తాను అంత పైసలు అనుకుంటూ వుంది.
ఇంతలో వందనా గారి మామ గారు స్వర్గస్తులైనారు. అప్పుడు వాళ్ళ ఆస్థిపాస్తులు భాగం చేస్తే వందనా గారికి ఒక లక్ష రూపాయలు వచ్చాయి. మెల్లిగా ఇంకా కొంచెం ఆరెంజ్ చేసి బాబా మందిరం దగ్గర స్థలం కొన్నారు.
బాబా మందిరం దగ్గర స్థలం కొని ఇల్లు కట్టడం start చేశారు. కాని డబ్బులు తగినంత లేనందు వలన మళ్ళి పని ఆగిపోయింది.
అప్పుడు ఆమెకు సాయి సచ్చరిత్ర పదమూడవ అధ్యాయం గుర్తు వచ్చింది. దానిలో బాలా షింపీకి జ్వరం వస్తే ఒక నల్ల కుక్కకు పెరుగు అన్నం పెట్టమని బాబా చెప్తారు. అప్పుడు వందనా అనుకుంది “బాబా నేను ఏడు గురువారాలు నల్ల కుక్కకు పెరుగు అన్నం తినిపిస్తాను. నా కష్టం కూడా తీర్చు ప్రభు అని మొక్కుకుంది.”
మనసులో చాలా నమ్మకం వుండినది బాబా తప్పక సహాయం చేస్తారు అని, 1st గురువారం వచ్చింది. ఆమె అనుకున్న సంకల్పం ప్రకారం బయట వాకిలి దగ్గర ‘పెరుగు అన్నం’ పెట్టింది. ఏ నల్ల కుక్క
చాలా సేపు రాలేదు. చాలా దుఃఖం అనిపించింది.
అప్పుడు ఒక నల్ల కుక్క వచ్చింది కాని దానిపైన తెల్ల మచ్చలు వున్నాయి. ఆమె అనుకుంది, ఇది కాదు, ఈ కుక్క తినేస్తే ఎలాగా! అని విచారిస్తూ కూర్చుంది.
ఆ నల్లని తెల్లమచ్చల కుక్క పెరుగన్నం only వాసన చూసి వెళ్ళిపోయింది. తరువాత చాలా సేపటి వరకు ఇంకో నల్ల కుక్క రాలేదని నిరాశ పడుతూవుంది.
ఇంతలో ఆ నల్ల తెల్లని మచ్చల కుక్క , ఒక only నల్ల కుక్కను తీసుకొని వచ్చింది. ఆ పూర్తి నల్ల కుక్క మొత్తం పెరుగన్నం తినేసింది. అది చుసిన వందనా గారికి సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు.
అలా ఏడు గురువారాలు నల్ల కుక్క వచ్చి పెరుగన్నం తీనింది. ఇంతలో వాళ్లకు పైసలు సమకూరినాయి. 5 నెలల్లో ఇల్లు complete కూడా అయింది.
ఇంత విలక్షణమైన ఘటన తరువాత వాళ్ళ ఇంట్లో అందరూ బాబా భక్తులు అయ్యారు. మూడంతస్తుల మెడ కట్టేసింది. దానిలో ఒక అంతస్తు పూర్తిగా బాబా కోసం వుంచారు.
బాబా అన్ని రకాల ఫొటోలు, బాబా భక్తుల ఫోటోలు కూడా పెట్టుకుంది. ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. బాబాకు శిరిడీలో జరిగే అన్ని ఉత్సవాలు జరుగుతాయి.
వందనా గారు సాయి సముదాయం ప్రారంభించి, అందరి ఇండ్లలో సాయిభజనలు పెట్టుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఈ సాయిసముదాయం వాళ్ళు శిరిడీకి వెళ్తారు. అక్కడికి సాయి పల్లకితో వెళ్లి ఉత్సవం కూడా చేస్తారు.
(ఇప్పుడు చూడండి వందనా గారు ఒక చిన్న కుటీరం నుంచి, మూడంతస్తుల మెడ వరకు వెళ్ళింది. అలాగే ఆ పరమాత్మ సహస్రశీర్ష పురుష : సహస్రాక్ష : సహస్రపాద్) అని పురుషసూక్తం మనం చదువుతాము. ఆ భగవంతుడు సహస్ర రూపాలలో ఏ రూపంలో ఐనా రావచ్చు. అన్ని ఆయనవే, అన్ని ఆయనే అని నా భావన….మాధవి)
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
Latest Miracles:
- నా కోరికను తీర్చిన బాబా.
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- బాబా నైవేద్యంలో ఊదీ మహిమ.
- నాకు ఒక బంగారు చైన్ దొరికింది,అది ఎవరిదో నా దగ్గరికి వచ్చి సరియైన ప్రమాణం చూపించి తీసుకెళ్లు వచ్చు
- బాలాగణపతి షింపీ
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on ““బాబా నేను ఏడు గురువారాలు నల్ల కుక్కకు పెరుగు అన్నం తినిపిస్తాను”….నా కష్టాములను తొలగించు తండ్రి”
gautam
January 10, 2018 at 12:52 pmWe have same experience at babas temple on thursday
gaurav
January 10, 2018 at 12:58 pmnaaku kuda black dog ku guruvaram roti pettamani oka aged person cheppad