Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయినాధుడు శిరిడీలోనే వున్నాడనుకుంటే మనం చాలా పొరపాటు పడుతున్నాం. అయన అన్ని చోట్ల ప్రతి క్షణం సప్తసముద్రాల ఆవల కూడా ఎవరెవరు ఎక్కడ నుంచి పిలిచినా అక్కడికి వెను వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం.
ఏన్ని సార్లు ఆయన నా మొర విన్నారో, నేను లెక్కల్లో చెప్పలేను. వాటిల్లో అన్నిటికన్న, నా హృదయాన్ని కలిచి వేసే సన్నివేశం మీ ముందు వుంచుతున్నాను.
ఒక సారి నా భర్తకి ఆరోగ్యం చాలా పాడు అయిపోయింది పరిస్థితి విషమించి అందరు అయన మీద నమ్మకం వదిలేసారు. దానికి కొన్ని రోజుల ముందే నాకు పెండ్లి అయి అత్తవారింటికి అడుగుపెట్టారు.
ఇంక మీరే ఆలోచించండి ఆ పరిస్థితి అత్తవారింట్లో అందరు నన్ను పెండ్లి చేసుకున్నందు వలనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించిందని తిట్టినారు.
ఇలాంటి విషమ పరిస్థితి మొదటిసారి నా జీవితంలో మా అత్తగారింట్లో ఏదురైనది. మా అత్తవారింటి వారు సామాజిక కట్లుబాట్లు, మూఢవిశ్వాసాలు అనే సంకెళ్లతో వున్నవాళ్లు. నన్ను ఆ సంకెళ్లతో బంధించేశారు.
సాయి పూజ. సాయి భక్తి అంటే ఏమిటో అసలు తెలియదు వాళ్ళకు. నాకు పెండ్లి అయి వచ్చేటప్పుడు ఒక సాయినాధుని photo నాతొ ఒకటి తెచ్చుకున్నాను. నా Room లో పెట్టుకొని రోజు సాయి పూజ మాత్రం చేసేదాన్ని ఇంక ఇలాంటి పరిస్థితిలో సాయి మాత్రమే నాకు సహాయకుడిగా ఉంటాడని దృడంగా నమ్మేదాన్ని.
నా భర్తకి అనారోగ్యంతో వుండగా ఒక సారి భయంకరమైన తలనొప్పి వాంతులు అయినాయి. మా అత్తగారు చాలా భయపడి పోయి బోరున ఏడవడం మొదలు పెట్టింది. నా వైపు చూసి అరవడం మొదలు పెట్టింది.
నన్ను చూస్తు, ఏమి! నిలబడుకొని తమాషా చూస్తున్నావా! నా కొడుకు చావు బతుకుల మధ్య వుంటే నీకు ఏమి అనిపిస్తాలేదా! సాయి, సాయి అని అరుస్తూవుంటావు ఎప్పుడూ. ఇప్పుడు పిలువు నీ సాయిని ఎక్కడ పోయినాడు నీ సాయి, రమ్మాని పిలువు నీ సాయిని” అని నా మీద విరుచుకు పడింది.(పాపం అమ్మ కదా!).
ఆమె ఆ ఉగ్రరూపాన్ని చూసి నేను భయపడి పోయాను.ఏడుస్తూ బాబా photo దగ్గరికి వెళ్ళి, బాబా రా తండ్రి , ఇప్పుడు పరీక్ష సమయం నాకే కాదు నీకు కూడా నువ్వు సర్వదా, సర్వత్రా వున్నావని నువ్వే నిరూపించుకో, నా కంత శక్తి లేదు స్వామి అని నా మనసులోనే బాబాను వేడుకుంటున్నాను.
ఆటు నా భర్తను ఇటు నా అత్తగారిని ఇద్దరినీ భరిస్తూ, కొంచెం నీళ్ళలో విభూతి వేసి నా భర్తతో త్రాగించాను. అయన నుదుట బొట్టు పెట్టాను విభూతితో అంతే 5 నిముషాలు కూడా ఇంకా కాలేదు. ఇంతలో postman వచ్చాడు.
వాడి చేతిలో ఒక postcard size బాబా Photo, ఆశీర్వాద ముద్రలో వుంది. విభూతి packet ఇచ్చి వెళ్ళాడు.
నాకు ఆశ్చర్యం వేసింది. నిజానికి నా దగ్గర విభూతి అయిపోయింది. ఇలా అనుకుంటూ వున్నాను, ఇంతలో విభూతి packet వచ్చింది, పైగా నేరుగా శిరిడీ నుంచి నాకు ఇంత వరకు అర్థంకాలేదు ఎవరు పంపారో.
నేను శిరిడీలో life Member కూడా కాదు. ఏదో program గురించి నాకు ఆహ్వానం వచ్చింది, మరియు ఇలా రాసి వుంది. “నా photo ను ఒక చిత్రపటం అనుకోకు నా photo వుంటే నేను అక్కడ వున్నట్లే.” ఇది చూసి ఇంట్లో వున్న వాళ్ళందరూ ఆశ్చర్య పోయారు.
ఇలాగా బాబా జీవిత కాలంలో కూడా చాలా మంది ఇండ్లకు చిత్రపటం రూపంలో వెళ్లారు. నా హృదయంలో నుంచి వచ్చిన నా పిలుపును మన్నించి సాయినాధుడు స్వయంగా వచ్చారు అనిపించింది.
అది ఏలాంటప్పుడు? నీవు వున్నావా, లేవా? అని నా అత్తగారు బాబాను నిరూపించమన్నప్పుడు? చూశారా! చిత్రపటం రూపంలో రావడం, సాయి రావడమే కదా! అప్పటినుంచి నా భర్త ఆరోగ్యం కుదుటపడింది.
నాకు అత్తగారింట్లో మంచి స్థానం లభించింది. అంత బాబా వారి కృపానే అని మా ఇంటిల్లపాది నమ్ముతున్నాం. మీరు నమ్మండి.
ఇందు మిశ్ర,
మధ్యప్రదేశ్
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
Latest Miracles:
- బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు–Audio
- సాయిబాబావారి సమాధి మందిరములో, గురూజీ బాబా ఒడిలో ధ్యానం చేసుకుంటూ కనిపించారు.
- ఒక అవధూత దగ్గర బాధ చెప్పుకుంటే, మరో అవదూత దగ్గర సమాధానం దొరికింది.
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
- మా ఇంటిలో జ్యోతి (పూజ) పెట్టించుకోమని వేరే భక్తురాలి రూపంలో వచ్చి చెప్పిన బాబా వారు….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
13 comments on “సమాధి నుంచి సమాధానం చెప్పిన సాయి”
b vishnu Sai
December 27, 2017 at 1:39 pmBaagundi
GKALPANA
December 29, 2017 at 1:05 pmmeeru cheppevanni nijamena mari baba naku anduku help cheyaltam ledu meeru pilisthe palikadu help chesadu naku anduku help cheyatam ledu
Revanth
December 27, 2017 at 1:40 pmOm sai ram!
Renuka Rani
December 27, 2017 at 1:42 pmSai ram nijamga baba krupa unty alagy untundi
Madhavi
December 27, 2017 at 1:44 pmEe leela raasetappudu.nijamga avida elaa prove chestundhi.anukunnanu.prahladhu du..Elaa chesadu? Sarvasyasaranagathi.okkate.margam…sainaathuni patla manaku adhe vundaali..Sarvam saimayam jagath…
kishore Babu
December 28, 2017 at 9:20 pmmiracle చదువుతుంటే మనసు చలించి పోతుంది.thanks mam
TV Gayathri
December 27, 2017 at 1:50 pmOM NAMO SAINADHAYA
Radhika J
December 27, 2017 at 2:04 pmChala Bagundi
TV Gayathri
December 27, 2017 at 2:13 pmSamardha sadguru sainadhaya
Lalitha k
December 27, 2017 at 3:43 pmOm Sai ram
Raja
December 27, 2017 at 5:54 pmనిజంగా అద్భుతమైన గురువు. కోరినవి అన్ని తీరుచే బాబా..Jai Sai Maharaj ki
Vidya
December 27, 2017 at 7:48 pmSairam wonderful leela
T.v.pramada
March 16, 2018 at 9:55 pmSai ram