Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాగమణి గారి అనుభవములు నాల్గవ భాగం:
మా అబ్బాయి M C A చేసాడు, ఎక్కడా ఉద్యోగం చేయడం వాడికి నచ్చేది కాదు.
కర్నూల్ లో ఒక కాలేజీ లో ప్రిన్సిపాల్ వాడితో నీకు ఎంత జీతం కావాలంటే అంత ఇస్తాను, 20, 000 కావాలా చెప్పు అని అడిగింది.
మా వాడేమో టీచింగ్ సైడ్ నేను పోను అంటాడు. మా వారేమో నువ్వు ఏదో ఒకటి చెయ్యి లేకపోతే నేను ఒక్కడినే సంపాదించ వలసి వస్తోంది ఊరికే కూర్చుంటే ఎలాగా? అంటారు.
తండ్రి కొడుకులు రోజూ గొడవ పడుతుండేవారు. ఈమె చెయ్యమని, వాడు ఏమో చెయ్యనని. నేను చాలా బాధపడుతుండే దానిని.
ఒక సారి కర్నూల్ లోనే ఉన్న ఒక ‘అవధూత రామిరెడ్డి’ తాత దగ్గరకి వెళ్ళాను. ఆయన కాళ్ళు పట్టుకుని, నా మనసులోనే ఎందుకు తాతా! ఈ తండ్రి కొడుకులిద్దరూ ఇలా కొట్టుకుంటున్నారు. వాడు వినడు, వీళ్ళ గొడవ నేను చూడలేకపోతున్నాను.
వాడ్ని నువ్వే ఏదో విధంగా సెట్ చేస్తావో, ఎం చేస్తావో, నాకు ఇక్కడ పని అయిపోయింది, అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇంక నన్ను ఇక్కడ ఉంచకు తీసుకు పో! అని మనసులో అనుకున్నాను.
అక్కడి నుండి కర్నూల్ లోనే మరో అవధూత దగ్గరకు వెళ్ళాను. ఆయనకీ దండం పెట్టి ‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’ అని నామం చెపుతుంటే,
వెంటనే ఆయన “తల్లులందరూ ఇలా అనుకుంటే ఎలాగా? పిల్లవాడిని బాగు చెయ్యి! అనుకోవాలే కానీ ఆలా చనిపోవాలని అనుకోకూడదు.
పిల్లవాడు బొట్టు ఇవ్వమని అడుగుతాడు ( బొట్టు అంటే పాత కాలంలో అర్ధనా కాణి లాంటి నాణెం) తండ్రి జేబులో చెయ్యి పెట్టి తీయాలా! చేతికి బొట్టు దొరకాలిగా! తీసి ఇచ్చే లోగా కంగారు అయితే ఎలాగ”? అన్నాడు.
నేను ‘రామిరెడ్డి తాత’ సమాధి దగ్గర అనుకుని, దండం పెట్టుకుంటే దానికి సమాధానం ఇక్కడ ఈయన నోటి నుండి వచ్చింది.
ఇంకా ఈ మహానుభావుడు “ఈ సారికి ఇవ్వను వచ్చేసారికి ఇస్తాను” అన్నాడు. అంటే ఈ సంవత్సరం కాదు మళ్ళీ సంవత్సరం వాడికి ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు.
మా మనువడు మాతోనే ఉంటాడు. వాడు పసి తనం నుండే బాబా భక్తుడు.
వాడు ఏది అంటే అది జరుగుతుంది. 18 నెలలప్పటి నుండే వాడికి భజన చేయడం, నాలుగు హారతులు వాడు పాడితే, మేము కోరస్ పాడే వాళ్ళం.
ఒక సారి మేము అందరం కలసి ఒక చోటుకి వెడుతుంటే, దారిలో మా వారిని ఆవు పొడిచింది. ఆవు పొడిచింది అని అనుకుంటుంటే మా వాడు “ఎందుకు పొడవదు, తప్పు చేస్తే పొడుస్తుంది” అన్నాడు.
తప్పు చేయడం ఏమిటి రా? అంటే, దానికి వాడు దానికి నిన్న తాత బస్సు ఎక్కి వచ్చేటప్పుడు “ఒక చేతులు లేని ఆమె ఆడుకుంటుంటే” ఆమెకి డబ్బులు వేయకుండా తాత కసురుకున్నాడు.
మరి ఆవు కుమ్మదా? అందుకే అలా అయింది అన్నాడు. నిజానికి నిన్న వీడు తాత తో బస్సు లో ఏమి వెళ్ళలేదు. అయినా కూడా జరిగింది చెప్పాడు.
మేము ఒక సారి ఒక టూర్ కి వెళ్లి వస్తున్నాము. ఒక చోట టీ కోసం బస్సు ఆపాడు డ్రైవర్.
అక్కడ బస్సు దిగే దగ్గర, పెద్ద పెంట కుప్ప దిబ్బ లాగ ఉంది. టీ తాగడానికి మా వారు దిగి, తాను తాగుతూ నన్ను కూడా టీ తాగడానికి రమ్మని పిలిచాడు.
ఆ దిబ్బ మీద ఆజానుబాహుడు తలకి గుడ్డ కట్టుకున్నవాడు ఉన్నాడు. ఆయన కల్లు బాగా మెరుస్తున్నాయి. ఆ వ్యక్తి దిబ్బ పైన కాలు పైన కాలు వేసుకొని కూర్చున్నాడు.
ఆయన్ని చూడగానే నాకు ఈయన బాబా నే అనిపించింది. వెంటనే అడిగేసాను.”నువ్వు బాబావా” అని నేను అడిగినదానికి ఆయన అవుననుకుంటు తలవూపాడు.
మా వారు ‘టీ’ తాగటానికి రా! ఆలస్యం అయితే బస్సు లో అందరూ మనల్ని అంటారు రా రా! అంటూ పిలుస్తున్నారు.
“మీ “టీ” సంగతి పక్కన పెట్టండి ముందు బాబా వచ్చారు రమ్మంటూ పిలిచాను. ఆయన గబా గబా వచ్చారు. మేమందరం దండం పెట్టుకున్నాం.
మా ఆడపడచు వాళ్ళు కొంచెం దూరం లో ఉన్నారు వాళ్ళని పిలిచే లోపు బాబా వెళ్ళిపోయాడు. కొంత దూరం లో మళ్ళి కనపడితే అక్కడికి పరుగు పెట్టాము.
మా ఆడపడచు కొడుకును చూడగానే చెయ్యి చాపి దక్షిణ ఇవ్వమని అడిగాడు. నేను వాడిని జేబులో చెయ్యి పెట్టి ఎంత వస్తే అంత ఇచ్చేయమన్నాను. వాడు జేబులో చెయ్యి పెట్టి 20 రూపాయల తీసి ఇచ్చాడు.
వంగి నమస్కారం చేసి పైకి చూసే సరికి ఇంకా ఆయన కనపడలేదు. అందరికి తెలిసి, అందరూ కలసి ఒక కిలో మీటర్ దాకా నాలుగు వైపులా వెదికారు అయినా కనపడలేదు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
నాగమణి గారి అనుభవములు ఐదవ భాగం తరువాయి….
Latest Miracles:
- బాబా భక్తినిగా మారిన దగ్గర నుండి విద్యార్థి చదువులో మంచి మార్పు కనిపించుట.
- బాబా దయ వల్ల బ్యాగు లో కాష్ తీయలేదు.—Audio
- యిస్తానన్నది మరి అడిగి తీసుకుంటారు బాబా–Audio
- ఎంత దయామయుడు బాబా. నా నొప్పి బాధ రెండు రోజులలో తగ్గిపోయాయి.
- శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments